ధన్య బాలకృష్ణ గుట్టు రట్టు చేసిన కల్పిక గణేష్, సంచలన విషయాలు వెల్లడించిన యశోద నటి
ధన్య బాలకృష్ణ సీక్రెట్ ను బట్టబయలు చేసింది మరో నటి కల్పిక గణేష్. ధన్య సీక్రేట్ గా పెళ్లి చేసుకుందంటూ రివిల్ చేసిన కల్పికా.. ఈ పెళ్లికి సబంధించిన సంచలన విషయాలు బయట పెట్టింది.
ఫిల్మ్ ఇండస్ట్రీ అంటేనే రహస్యల పుట్టు. అందులో ఎన్ని రహస్యాలు ఉన్నాయో లెక్కపెట్టడం ఎవరికి సాధ్యం కాదు. అందులో ఒకటీ అర మాత్రమే బయటకు వస్తున్నాయి. ఈక్రమంలోనే టాలీవుడ్ నటి ధన్య బాలకృష్ణకు సబంధించిన ఒక సీక్రేట్ రీసెంట్ గా బయటకు వచ్చింది. అది కూడా మరో నటి కల్పిక గణేష్ వల్ల.. ఈ రహస్యం బట్టబయటయ్యింది. అంతే కాదు ధన్య విషయంలో సంచలన విషయాలు వెల్లడించింది కల్పిక గణేష్.
రీసెంట్ గా ఫ్యాన్స్ తో సోషల్ మీడియా లైవ్ లో మాట్లాడుతూ.. కల్పిక సంచలన విషయాలు పంచుకుంది. టాలీవుడ్ హీరోయిన్ ధనయ బాలకృఫ్ణ సీక్రేట్ గా పెళ్లి చేసుకుందంటూ అసలు విషయంతో పాటు విస్తుపోయే మరికొన్ని విషయాలు కూడా పంచుకుంది. అయితే అసలు విషయం ఏంటంటే.. సీక్రెట్ పెళ్లి చేసుకున్న హీరోయిన్ కూడా ఇంతవరకు తన పెళ్లి విషయాన్ని ఎక్కడా చెప్పకపోవడం గమనార్హం.
ఫిల్మ్ ఇండస్ట్రీలో సక్కెస్ ఫుల్ లైఫ్ ను కొనసాగిస్తున్న ధన్య బాలకృష్ణ సీక్రెట్ గా పెళ్ళి చేసుకుందని.. అది కూడా ఆల్రెడీ పెళ్లి చేసుకొని డివోర్స్ తీసుకున్న డైరెక్టర్ బాలాజీ మోహన్ ని పెళ్లి చేసుకున్నట్టు కల్పిక చెప్పకోచ్చింది. ఈ పెళ్లి జరిగి కూడా ఏడాది అవుతుందని.. ఈ విషయం ఇంత వరకూ ఎవరికి తెలియదని చెప్పింది కల్పిక. ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు ధన్య బాలకృష్ణ ఈ ఏడాది జనవరిలో మారి, మారి 2 సినిమాల దర్శకుడు బాలాజీ మోహన్ ని రెండో పెళ్లి చేసుకుందని, ఆమె చెన్నై వెళ్ళినప్పుడల్లా బాలాజీతోనే ఉండేదని కల్పిక సంచలన విషయాలు తెలిపింది.
ఇక పెళ్లి చేసుకున్నప్పటకీ, ఇప్పటి వరకు బయట ప్రపంచానికి ఇద్దరూ బయట ప్రపంచానికి తెలియకుండా కలిసి ఉంటున్నారంది కల్పిక. అయితు ఈ విషయం ఇప్పుడు తాను వెల్లడించడానికి కారణం ఉంది అంటోంది నటి. పెళ్లి తర్వాత ఆమెను డైరెక్టర్ టార్చర్ పెడతాడని అనుకున్నా.. కానీ వాళ్లు బాగానే ఉన్నారు అనిపించింది.
అయితే ఇప్పుడు మాత్రం ధన్య సినిమా ప్రమోషన్స్ కోసం బయటకు రావడంలేదు. దాంతో బాలాజీ తనను బయటకు రానివ్వడం లేదు అన్న డౌట్ తో ఈ విషయం వెల్లడించానంటోంది కల్పిక. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టాలీవుడ్ లో స్టార్స్ సినిమాల్లో నటించింది ధన్య బాలకృష్ణ. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ,సెవెన్త్ సెన్స్, నేను శైలజ, జయజానకి నాయక లాంటి సినిమాలలో క్యారెక్టర్ రోల్స్ లో మెప్పించింది. హల్చల్, సాఫ్టువేర్ సుధీర్, అనుకున్నది ఒక్కటీ అయినది ఒక్కటి లాంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించింది. మరో వైపు కొన్ని వెబ్ సిరీస్ ల లో కూడా నటిస్తోంది. అటు తమిళంలో కూడా ఛాన్స్ లు కొట్టేస్తోంది బ్యూటీ.