ఆస్తులు అమ్మకానికి పెట్టిన నటి గౌతమి.. నిన్ను, కూతుర్ని ఇద్దరినీ చంపేస్తాం అంటూ బెదిరింపులు
ప్రముఖ నటి గౌతమి గురించి పరిచయం అవసరం లేదు. 90వ దశకంలో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం సీనియర్ నటిగా గౌతమి పలు చిత్రాల్లో నటిస్తోంది.
ప్రముఖ నటి గౌతమి గురించి పరిచయం అవసరం లేదు. 90వ దశకంలో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం సీనియర్ నటిగా గౌతమి పలు చిత్రాల్లో నటిస్తోంది. గౌతమి చివరగా సమంత శాకుంతలం చిత్రంలో నటించింది. అయితే గౌతమి తరచుగా వివాదాలతో కూడా వార్తల్లో కెక్కుతూ ఉంటుంది.
గౌతమి గతంలో సందీప్ భాటియా అనే వ్యాపారవేత్తని వివాహం చేసుకుంది. వీరిద్దరికి సుబ్బలక్ష్మి అనే కుమార్తె జన్మించింది. ఆ తర్వాత గౌతమి తన భర్త నుంచి విడిపోయింది. అయితే కొంతకాలం పాటు గౌతమి.. కమల్ హాసన్ తో సహజీవనం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కమల్ నుంచి కూడా గౌతమి విడిపోయింది.
ప్రస్తుతం గౌతమి తన కుమార్తె తో కలసి జీవిస్తోంది. అయితే గౌతమికి తాజాగా ఊహించని సమస్య వచ్చిపడింది. గౌతమికి తన సొంత ఊరు పెరంబూరు సహా తమిళనాడులో పలు ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నాయి. వాటి విలువ దాదాపు 45 కోట్ల వరకు ఉంటుందట.
Gautami
అయితే ఇటీవల కొంత కాలంగా గౌతమికి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయట. దీనితో డబ్బు అవసరంతో కొన్ని ఆస్తులని అమ్మేయాలని గౌతమి భావిస్తోంది. దీనితో అళగప్పన్ అనే రియలెస్టేట్ ఏజెంట్ కి ఆ బాధ్యత అప్పగించింది. కానీ అతడు నకిలీ పాత్రలు సృష్టించి ఫోర్జరీ సంతకాలతో గౌతమి ఆస్తిని కాజేయాలని ప్లాన్ చేశాడు.
ఈ విషయం గౌతమికి తెలియడంతో ఆమె అళగప్పన్ ని ప్రశ్నించింది. తనకు రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయని.. అడ్డొస్తే నిన్నూ నీ కుమార్తెని చంపేస్తానని బెదిరిస్తునట్లు గౌతమి తాజాగా చెన్నైలో పోలిసులకు ఫిర్యాదు చేసింది. దీనితో గౌతమి నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. అళగప్పన్ ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
గౌతమి ఆస్తిలో రూ 25 కోట్లు విలువచేసే స్థలంపై అళగప్పన్ కన్నేసినట్లు తెలుస్తోంది. గౌతమి శ్రీనివాస కళ్యాణం, గాంధీనగర్ రెండవ వీధి, మనమంతా లాంటి తెలుగు చిత్రాల్లో నటించింది.