MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • `ఘరానా మొగుడు`కి సెలెక్ట్ చేసి తప్పించారు.. తర్వాత సాంగ్ నుంచి తీసేశారు.. నటి దివ్య వాణి ఆవేదన..

`ఘరానా మొగుడు`కి సెలెక్ట్ చేసి తప్పించారు.. తర్వాత సాంగ్ నుంచి తీసేశారు.. నటి దివ్య వాణి ఆవేదన..

అలనాటి నటి దివ్య వాణి తాను సినిమా అవకాశాలను కోల్పోవడంపై ఓపెన్‌ అయ్యారు. `ఘరానా మొగుడు` సినిమా నుంచి తొలగించడంపై ఆమె వెల్లడించారు. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Dec 20 2023, 08:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

`పెళ్లి పుస్తకం` చిత్రంతో పాపులర్‌ అయ్యింది నటి దివ్య వాణి. అడపాదడపా మంచి సినిమాలు చేసింది. మెప్పించింది. కానీ తన నటనకు రేంజ్‌ గుర్తింపు రాలేదు. అడపాదడపా సినిమాలు చేసిన ఆమె కొన్నాళ్ల తర్వాత సినిమాలకు దూరమయ్యింది. అయితే `ఈగో`ల వల్ల చాలా ఆఫర్లు కోల్పోయినట్టు చెప్పింది దివ్య వాణి. చాలా సినిమాల్లో తనని సెలెక్ట్ చేసి తప్పించారని వాపోయింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

దివ్యవాణి చాలా రోజుల తర్వాత బయటకు వచ్చింది. ఆమె ఇప్పుడు మళ్లీ యాక్టివ్‌ అవుతుంది. అందులో భాగంగా ఓ యూట్యూబ్‌కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. పలు షాకింగ్‌ విషయాలను పంచుకుంది. తనకు ఆఫర్లు మిస్‌ అయిన విషయాలను సైతం చెప్పింది. చాలా ఆఫర్లు కోల్పోయినట్టు తెలిపింది దివ్య వాణి. ఎంపిక చేసి తొలగించారని ఆవేదన చెందింది. 
 

37

చిరంజీవితో `ఘరానా మొగుడు` చిత్రంలో తాను నటించాల్సి ఉందని చెప్పింది. వాణి విశ్వనాథ్‌ నటించిన పాత్రకి మొదట తననే తీసుకున్నారట. కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ మూవీ నుంచి తనని మధ్యలోనే తప్పించారని తెలిపారు. దానికి కారణం ఏంటో తెలియదని వెల్లడించింది. చిరంజీవి మంచి వారు అని, నిగర్వి, బాగా సపోర్ట్ చేస్తారని, మంచిగా మాట్లాడతారని, కానీ తనకే కలిసి రాలేదని చెప్పింది. ఆ తర్వాత `కొండవీటి దొంగ`లో తాను నటించినట్టు చెప్పింది దివ్య వాణి. 

47

`కొండవీటి దొంగ`లో తాను మరదలి పాత్రలో నటించానని, అప్పటికీ తాను చిన్న అమ్మాయిని అని చెప్పింది. ఇందులో `శుభలేఖ రాసుకున్నా.. ` పాటలో తనేనటించాల్సి ఉందని, కానీ చిన్నమ్మాయి అని తొలగించారని తెలిపింది దివ్య వాణి. హీరో వరకు రీచ్‌ అవ్వాలంటే మధ్యలో చాలా స్టెప్స్ ఉంటాయి, నిర్మాతలు, దర్శకులు, కెమెరామెన్లు ఇలా చాలా మంది ఉంటారు. వాళ్ల వాళ్ల ఉద్దేశ్యాలు వాళ్లకి ఉంటాయి, కానీ తాను చేయలేకపోయాను ఎందుకో అని చెప్పింది. ఆ కంపు అయిపోయింది, దాన్ని లోతుగా తోడుకోవడం ఎందుకని వెల్లడించింది. 
 

57

తన నుంచి పోయిన వాటిలో `ప్రేమ ఖైదీ` సినిమా కూడా ఉందని చెప్పింది. అందులో పెయిరే మారిపోయిన్నట్టు పేర్కొంది దివ్య వాణి. ఇందులోనూ తాను హీరోయిన్ గా ఉండాలి, కానీ కుదరలేదు అంటూ నవ్వుతూ చెప్పింది. దాని వెనకాల ఏం జరిగి ఉంటుందో అనేది ఆమె తన నవ్వుతోనే చెప్పకనే చెప్పింది. ఇదే కాదు శ్రీకాంత్‌తో `ఆమె` సినిమా చేయాల్సింది. అప్పటికే ఆయనతో `దొంగ రాస్కెల్‌`సినిమా చేశాను కూడా. కానీ `ఆమె` సినిమా కూడా చేయాల్సింది. కానీ కుదరలేదని చెప్పింది దివ్య వాణి. 

67

ఇలా చాలా సినిమాలు మిస్‌ కావడంతో, తనని నిజంగానే జనాలు మర్చిపోతారని, చిన్న పాత్రలు కూడా చేసేందుకు రెడీ అయినట్టు చెప్పింది. అలా తాను ఏ సినిమా చేసిన, ఏ పాత్ర చేసినా అందులో తన మార్క్‌ ఉండేలా నటించినట్టు చెప్పింది. అదే తనకు మంచి గుర్తింపు తెచ్చిందని, తన టాలెంట్‌తోనే అది సాధ్యమైందని చెప్పింది దివ్యవాణి. 

77

ఈ సందర్భంగా బాలకృష్ణతో సినిమా మిస్‌ అయినదాని గురించి చెబుతూ, `బైరవ ద్వీపం` చిత్రంలో ఓ సాంగ్ కోసం తనని అప్రోచ్‌ అయ్యారట సింగీతం శ్రీనివాసరావు. `నరుడా ఓ నరుడా` అనే పాటకి తనని అడిగారట. కేవలం ఒక్కపాట కోసం ఏం చేస్తాం లే అని వదిలేసుకుందట. కానీ ఆ పాటే సినిమాని ఎక్కడికో తీసుకెళ్లిందని, సినిమాని మించి ఆ పాటకిపేరొచ్చిందని, కానీ ఆ తర్వాత తాను చేయాల్సిందని, చాలా బాధపడినట్టు చెప్పింది దివ్య వాణి. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mokshagna: మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీపై క్లారిటీ? ముహూర్తం ఫిక్స్ చేసిన బాలకృష్ణ, రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Recommended image2
Krishna Movies: కృష్ణాష్టమికి చూడాల్సిన 7 యానిమేటెడ్ సినిమాలు ఇవే!
Recommended image3
భయపెడుతూ నవ్వించి, 180 కోట్లు కొల్లగొట్టిన హారర్ సినిమా.. ఓటీటీలో ఇప్పటికీ ట్రెండింగే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved