- Home
- Entertainment
- రక్తం వస్తున్నా ఆగని హీరోయిన్, 3 చిత్రాల్లో ఛాన్స్ ఇస్తే అన్నీ ఫ్లాపులే.. కొత్త అవతారంలో కూడా కష్టాలే
రక్తం వస్తున్నా ఆగని హీరోయిన్, 3 చిత్రాల్లో ఛాన్స్ ఇస్తే అన్నీ ఫ్లాపులే.. కొత్త అవతారంలో కూడా కష్టాలే
టాలీవుడ్ లో ట్యాలెంట్ ఉంటే సరిపోదు అదృష్టం కూడా ఉండాలి అని చెప్పడానికి కొందరు హీరోయిన్లు ఉన్నారు. ఎంత ట్యాలెంట్ ఉన్నా కొందరికి సక్సెస్ మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది.

Krishna vamsi
టాలీవుడ్ లో ట్యాలెంట్ ఉంటే సరిపోదు అదృష్టం కూడా ఉండాలి అని చెప్పడానికి కొందరు హీరోయిన్లు ఉన్నారు. ఎంత ట్యాలెంట్ ఉన్నా కొందరికి సక్సెస్ మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. అలాంటి వారిలో హీరోయిన్ ఛార్మి ఒకరు. నటిగా ఆమె కెరీర్ దాదాపుగా ముగిసినట్లే. ఎందుకంటే ఛార్మి నటనకు దూరమై చాలా రోజులు అవుతోంది.
Charmy kaur
ఛార్మి 30 పైగా తెలుగు చిత్రాల్లో నటించింది. ఆమె సాధించిన హిట్ చిత్రాలు వేళ్ళపై లెక్కపెట్టుకోవచ్చు. మాస్, లక్ష్మి, స్టైల్, మంత్ర, జ్యోతి లక్ష్మి లాంటి చిత్రాలు మాత్రమే ఛార్మి విజయాలుగా చెప్పుకోవచ్చు. డ్యాన్స్, యాక్టింగ్, గ్లామర్ విషయంలో ఛార్మి కాంప్రమైజ్ కాకుండా పెర్మార్మెన్స్ ఇస్తుంది. డైరెక్టర్ కృష్ణ వంశీ మూడు చిత్రాల్లో ఛార్మీ కి ఛాన్స్ ఇచ్చారు. చక్రం, శ్రీ ఆంజనేయం, రాఖీ చిత్రాల్లో చార్మీ.. కృష్ణవంశీ దర్శకత్వంలో నటించింది. వీటిలో రాఖీ మాత్రమే చెప్పుకోదగ్గ చిత్రం . అది కూడా గొప్ప సక్సెస్ ఏమీ కాదు.
Charmy kaur
మహాత్మ చిత్రంలో కామియో రోల్ చేసింది. ఆ మూవీ కూడా అంతంత మాత్రంగానే రాణించింది. ఛార్మి బ్యాడ్ లక్ గురించి కృష్ణవంశీ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఛార్మి టెర్రిఫిక్ యాక్ట్రెస్... అందులో తిరుగులేదు. కానీ ఆమె ఎందుకు సక్సెస్ కాలేదు అంటే చెప్పలేం.. పూర్తిగా బ్యాడ్ లక్ అని చెప్పాలి. ఆమె డెడికేషన్ లెవల్స్ అద్భుతం. రక్తం వస్తునప్పటికీ పట్టించుకోకుండా నటిస్తూనే ఉంటుంది. శ్రీ ఆంజనేయం, చక్రం లాంటి చిత్రాల్లో కొన్నిసార్లు అలా జరిగింది అని కృష్ణవంశీ తెలిపారు.
ఛార్మి మంచి అందం ఉంది, అద్భుతమైన డ్యాన్సర్, సెట్స్ లో ఎప్పుడూ ఎనెర్జిటిక్ గా ఉంటుంది. నేను మూడు చిత్రాల్లో ఛాన్స్ ఇచ్చి ట్రై చేశాను.. కుదర్లేదు అని కృష్ణవంశీ అన్నారు. హీరోయిన్ గా కెరీర్ ముగుస్తున్న టైంలో ఛార్మి నిర్మాతగా అవతారం ఎత్తింది. ఇక్కడ కూడా ఆమెకి ఎదురుదెబ్బలు తప్పలేదు. పూరి జగన్నాధ్ తో ప్రొడ్యూసర్ గా ఛార్మి పార్ట్నర్ షిప్ మొదలు పెట్టింది.
Puri Jagannadh, Charmy
పూరి జగన్నాధ్ తో కలసి ఛార్మి 8 చిత్రాలు నిర్మించింది. వాటిలో జ్యోతి లక్ష్మి, ఇస్మార్ట్ శంకర్ తప్ప మిగిలినవన్నీ డిజాస్టర్ చిత్రాలే. లైగర్, డబుల్ ఇస్మార్ట్ చిత్రాలైతే ఛార్మిని బాగా కష్టాల్లోకి నెట్టేశాయి.