గౌన్ లో యంగ్ గా మెరిసిన భూమికా చావ్లా.. కొంటె పోజులతో కలవరపెడుతున్న సీనియర్ నటి
సీనియర్ నటి భూమికా చావ్లా (Bhumika Chawla) ప్రస్తుతం ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా కనిపిస్తోంది.
స్టార్ హీరోయిన్ భూమిక చావ్లా టాలీవుడ్ లో కొన్నేళ్ల పాటు వెలుగొందింది. వెండితెరపై బడా హీరోల సరసన నటించి మెప్పించింది. అద్భుతమైన పెర్ఫామెన్స్ తో తనకంటూ ఇండస్ట్రీలో స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. అలాగే ఫ్యాన్ ఫాలోయింగ్ ను దక్కించుకుంది.
తెలుగులో భూమిక చాలా గుర్తుండిపోయే సినిమాలు చేసింది. ‘బద్రీ’, ‘ఖుషి’, ‘ఒక్కడు’, ‘మిస్సమ్మ’, ‘సింహాద్రి’, ‘నా ఆటోగ్రాఫ్’, ‘జై చిరంజీవి’ వంటి సినిమాలు ఆమెను మరో స్థాయికి చేర్చాయి. ఆ తర్వాత మరిన్ని చిత్రాల్లోనూ మెరిసింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ చిత్రాల్లోనూ వరుసగా నటిస్తూ వచ్చింది.
2007లో భూమికా తన బాయ్ ఫ్రెండ్, యోగా టీచర్ ను పెళ్లి చేసుకుంది. తర్వాత కూడా కేరీర్ ను ప్రారంభించింది. ప్రస్తుతం ముంబైలోనే సెటిల్ అయింది. కేరీర్ లో ఇప్పుడు భూమిక సెకండ్ ఇన్నింగ్స్ ను కొనసాగిస్తోంది. కీలక పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
ఇదిలా ఉంటే.. భూమికా ఇటు సోషల్ మీడియాలోనూ నిత్యం సందడి చేస్తోంది. తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ వస్తోంది. మరోవైపు యంగ్ హీరోయిన్లకే షాకిచ్చేలా ఫొటోషూట్లను కూడా చేస్తోంది. ఆ ఫొటోలను ఫ్యాన్స్ తో షేర్ చేస్తోంది.
తాజాగా ఈ ముదురు భామ గౌన్ లో ఫొటోషూట్ చేసింది. వైట్ అండ్ బ్లాక్ గ్లౌన్ లో మరింత యంగ్ గాకనిపిస్తోంది. బద్రి లాంటి లుక్ లో దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా కొంటెగా ఫొటోలకు ఫోజులిస్తూ కట్టిపడేసింది. మత్తు చూపులతో మంత్రముగ్ధులను చేసింది. దీంతో ఫ్యాన్స్ పిక్స్ ను లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు.
కేరీర్ విషయానికొస్తే.. భూమికా చివరిగా తెలుగులో ‘సీతారామం’, ‘బటర్ ఫ్లై’ చిత్రాల్లో మెరిసింది. కీలక పాత్రల్లో అలరించింది. అటు తమిళంలో ‘కన్నాయి నంబాతే’లో నటించింది. హిందీలో ‘కిసి కా బాయ్ కిసి కి జాన్’లో అలరించింది. ఇక నెక్ట్స్ మూవీపై అప్డేట్ రాలేదు.