- Home
- Entertainment
- సౌందర్య 50వ జయంతి: నా భర్త ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పాలి.. ఎక్స్ పోజింగ్ పై ఆమనికి చెప్పిన మాటలు
సౌందర్య 50వ జయంతి: నా భర్త ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పాలి.. ఎక్స్ పోజింగ్ పై ఆమనికి చెప్పిన మాటలు
వెండితెరపై చెరగని ముద్ర వేసి పిన్న వయసులోనే కనుమరుగైన సౌందర్యని అభిమానులు ఎవరూ మరచిపోలేరు. చిత్ర పరిశ్రమలో సౌందర్య ఒక ప్రత్యేకమైన నటి అని చెప్పాల్సిందే. 2004లో సౌందర్య హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు.

వెండితెరపై చెరగని ముద్ర వేసి పిన్న వయసులోనే కనుమరుగైన సౌందర్యని అభిమానులు ఎవరూ మరచిపోలేరు. చిత్ర పరిశ్రమలో సౌందర్య ఒక ప్రత్యేకమైన నటి అని చెప్పాల్సిందే. 2004లో సౌందర్య హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు. సౌందర్య ఆమె మరణించే వరకు కూడా టాలీవుడ్ లో తిరుగులేని స్టార్ హీరోయిన్ గా ఉన్నారు.
గ్లామర్ అవసరం లేకుండానే ప్రేక్షకులని మెప్పించవచ్చు అని నిరూపించిన నటి సౌందర్య. తన సాటి నటీమణులు రమ్య కృష్ణ,రంభ, నగ్మ, రోజా, ఆమని లాంటివారు ఎక్స్ పోజింగ్ లో దూసుకుపోతున్న తరుణంలో ఏమాత్రం గ్లామర్ లో హద్దులు దాటకుండా స్టార్ హీరోయిన్ గా నిలబడింది సౌందర్య.
హద్దులు దాటే అందాల ప్రదర్శనకి సౌందర్య దూరం. దీని గురించి సౌందర్య ఒక సందర్భంలో తన బెస్ట్ ఫ్రెండ్ నటి ఆమనితో మాట్లాడిందట. తనకి, సౌందర్య ఇద్దరికీ కన్నడ సాంగ్స్ అంటే చాలా ఇష్టం అని ఆమని తెలిపింది. తామిద్దరం చిన్ననాటి విషయాలు, ఫ్యూచర్ గురించి ఎక్కువగా మాట్లాడుకునేవాళ్ళం.
నేను సినిమాల్లో కొంతవరకు ఎక్స్ పోజింగ్ చేశాను. కానీ సౌందర్య చేయలేదు. దీని గురించి సౌందర్యని ఒకసారి అడిగాను. 'ఎందుకే నువ్వు ఎక్స్పోజింగ్ అంటే అంత దూరం వెళతావు అని అడిగాను. దీనికి సౌందర్య.. ఎందుకే ఎక్స్ పోజ్ చేయాలి. రేపు నేనొక భర్త వస్తే నన్ను ప్రశ్నించడా.. ఎందుకు అలా చేశావ్ అని అడగడా. రేపు నాకంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది.
చిరంజీవితో `చూడాలని వుంది`లో సౌందర్య.
ఇప్పుడు డబ్బు కోసం ఎక్స్ పోజింగ్ చేసేస్తాము. రేపటి పరిస్థితి ఏంటి, ఫ్యామిలీకి ఇబ్బందిగా ఉంటుంది కదా అని చెప్పింది. అంటే సౌందర్య సినిమాల్లోకి వచ్చే ముందే అలా ఫిక్స్ అయి వచ్చింది. ఎవరి స్టైల్ వాళ్ళది. అది సౌందర్య స్టైల్.. తప్పు లేదు అంటూ ఆమని తెలిపింది.
1993లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సౌందర్య ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించింది. హలొ బ్రదర్, పవిత్ర బంధం, చూడాలని ఉంది, పెదరాయుడు, నిన్నే ప్రేమిస్తా, రాజా లాంటి సూపర్ హిట్ చిత్రాలు సౌందర్య ఖాతాలో ఉన్నాయి. రేపు సోమవారం సౌందర్య 50వ జయంతి. ఆమె మరణించకుండా ఉంటే ఫ్యామిలీతో కలసి సంతోషంగా 50వ బర్త్ డేని సెలెబ్రేట్ చేసుకునే వారు. కానీ సౌందర్య 30 ఏళ్ల పిన్న వయసులోనే దురదృష్టవశాత్తు మరణించారు.