- Home
- Entertainment
- Amala Paul Pics : మంచు కొండల్లో మలయాళీ బ్యూటీ అమలా పాల్.. లేటెస్ట్ ఫొటోలకు అదిరిపోయే క్యాప్షన్..
Amala Paul Pics : మంచు కొండల్లో మలయాళీ బ్యూటీ అమలా పాల్.. లేటెస్ట్ ఫొటోలకు అదిరిపోయే క్యాప్షన్..
హీరోయిన్ అమలాపాల్ (Amala Paul) సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది. తన అభిమానులకు దగ్గరగా ఉండేందుకు ఏదో సమాచారంతో తళుక్కున మెరుస్తూనే ఉంటుంది. తాజాగా మంచుకొండల్లో ప్రత్యక్షమైందీ బ్యూటీ.

మలయాళీ హీరోయిన్ అమలాపాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక అవసరం లేదు. ఈ బ్యూటీ తెలుగులో చేసినవి తక్కువ సినిమాలే అయినప్పటికీ.. ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. గ్లామర్, నటనతో యూత్ లో తనకుంటూ ఓ క్రేజ్ సంపాదించుకుంది.
ఏదుకోగానీ ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగులో సినిమాలు తగ్గించిందనే చెప్పాలి. కానీ వెబ్ సిరీస్ లలో నటిస్తూ.. సౌత్ ఆడియెన్స్ ను అలరిస్తూనే ఉంది. మరోవైపు బోల్డ్ సీన్లలోనూ అమలాపాల్ నిర్మోహమాటంగా నటిస్తూ షాక్ కు గురిచేస్తోంది.
పిట్ట కథలు Pitta Kathalu సినిమాలో మీరా పాత్రలో మతిపోయేలా యాక్ట్ చేసింది. బోల్డ్ గా నటించి ఆడియెన్స్ ను ఊర్రూతలూగించిందీ బ్యూటీ. కానీ ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. పైగా ఈ మూవీ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కావడంతో రీచ్ కాలేపోయిందనే టాక్ కూడా ఉంది.
ఏదేమైనా అమలాపాల్ ఈ ఏడాది కూడా మరో వెబ్ సిరీస్ లో నటిస్తోంది. అయితే హిందీలో ‘రంజిష్ హి సాహి’ డెబ్యూ వెబ్ సిరీస్ లో నటిస్టున్నట్టు తెలుస్తోంది. దీంతో హిందీ ఆడియెన్స్ ను కూడా అలరించనుందీ బ్యూటీ.
మరీ ముఖ్యంగా అమలా పాల్ తన అభిమానులకు ఎక్కువగా సోషల్ మీడియాలోనే దగ్గరగా ఉంటుందని చెప్పాలి. ఎప్పటికప్పుడు తన జీవిత విశేషాలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటుందీ ముద్దుగుమ్మ. ఈ సందర్భంగా తాజాగా తన టూర్ కు సంబంధించిన ఫొటోలను షేర్ చేసుకుంది.
ఈ ఫొటోల్లో అమలా పాల్ ఆకట్టుకుంటోంది. ఓ కొండపైకెక్కి స్టైలిష్ గా ఫొటోలకు ఫోజులిచ్చింది. మంచుకొండల్లో మైమరిపించే గ్లామర్ తో అమలా పాల్ నెటిజన్లను ఆకర్షిస్తోంది. ‘ఒక్కోసారి పర్వతాల వైపు వెళ్లండి. చలి మీ హృదయాన్ని వేడి చేస్తుంది’ అంటూ అదిరిపోయే క్యాప్షన్ కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.