సబ్బులు అమ్ముకుంటున్న సీనియర్ నటి, హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా 200 సినిమాలు, పాచి పనికీ రెడీ ..?
200 సినిమాలు, సినీ వారసత్వం, తల్లి పెద్ద స్టార్, కుటుంబం అంతా సినిమా నేపథ్యం.. అయినా సరే సీనియర్ నటి ఐశ్వర్య రోడ్డున పడింది. బ్రతుకు తెరువుకోసం సబ్బులు అమ్ముకుంటుంది. ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉండి, అన్ని సినిమాలు చేసిన ఐశ్వర్యకు ఆ పరిస్థితి ఎలా వచ్చింది.
ఫిల్మ్ ఇండస్ట్రీలో జీవితం ఎప్పుడు ఎన్ని మలుపులు తిరుగుతుందో చెప్పడం కష్టం. కోట్లకు పడగలెత్తినా..టక్కున కిందపడి పోతుంటారు. తిండికి లేక ఇబ్బందిపడినా.. కోట్లు సంపాదిస్తుంటారు.. టైమ్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పడం చాలా కష్టం. ఇలా ఇబ్బందులు పడినవారు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. స్టార్లు గా ఎదిగి కుప్పకూలిపోయిన వారు కోకొల్లలు. అలాంటి వారిలో సీనియర్ హీరోయిన్ ఐశ్వర్య కూడా ఒకరు.
దాదాపు 200 చిత్రాల్లో నటించింది... సీనియర్ నటి లక్ష్మి కుమార్తె ఐశ్వర్యా భాస్కరన్ ప్రస్తుతం ఇంటింటికి తిరిగి సబ్బులు అమ్ముకుంటూ.. జీవిస్తున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. సినిమా అవకాశాలు లేకపోవడంతో ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన తాను జీవనం కోసం సబ్బులు విక్రయిస్తున్నట్టు చెప్పారు.
అంతేకాదు, మంచి జీతం ఇస్తానంటే పాచిపని కూడా చేసేందుకు సిద్ధమని చెప్పారు. ప్రస్తుతం చేస్తున్న పనితో తాను సంతోషంగానే ఉన్నానంటోంది ఐశ్వర్య. అప్పులు, ఇతర సమస్యలు అన్నీ తీరిపోయి బరువు తిగిపోవడంతో ఆనందంగా ఉన్నానని చెప్పింది ఐశ్వర్య. తన కాళ్లపై తాను నిలబడి స్వశక్తితో జీవిస్తున్నానని పేర్కొన్నారు.
తన నలుగురు పిల్లలతో కలిసి ఉంటున్నానని ఐశ్వర్య అన్నారు. అంతే కాదు మెంటల్ టెన్షన్, ఫిజికల్ టెన్షన్ల నుంచి రిలీఫ్ కోసం యోగాను సాధన చేస్తున్నాను, అంతే కాదు రోజుకు ఒక పూట మాత్రమే ఆహారం తీసుకుంటున్నట్టు ఐశ్వర్య చెప్పారు.
సీరియల్సే తనకు బతుకునిచ్చాయని, సినిమాలు తనకు అన్నం పెట్టలేదన్నారు. ప్రస్తుత తన ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలి అంటే తనకు ఒక మెగా టీవీ సీరియల్ కావాలని అన్నారు. న్యాయంగళల్ జయిక్కట్టుం సినిమాతో తమిళ తెరకు పరిచయమై ఐశ్వర్య దాదాపు 200 సినిమాల్లో నటించారు.
ఐశ్వర్య ఎక్కువగా మోహన్‌లాల్‌తో హిట్ సినిమాలలో నటించి మెప్పించారు. బటర్‌ఫ్లైస్, నరసింహమ్, ప్రజా వంటి వాటిలో నటించారు. హీరోయిన్‌గా అవకాశాలు కరవైనా చిన్నచిన్న పాత్రలు చేసిన ఆమె... పలు టీవీ సీరియళ్లలోనూ నటించారు. ఆ తర్వాత అవి కూడా లేకపోవడంతో కుటుంబ జీవనానికి సబ్బులు అమ్ముకుంటున్నట్టు ఐశ్వర్య స్వయంగా ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
తెలుగులో కూడా ఐశ్వయ్య సూపర్ హిట్ సినిమాలలో నటించారు. దాసరినారయాణ రావు, హీరో వినోద్ కాంబోలో వచ్చిన మామాగారు సినిమాలో హీరోయిగ్ గా నటించిన ఐశ్వర్య.. తరువాత కాలంలో ఆకాశమంతా లాంటి కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ లో నటించి మెప్పించారు. కాగా, 1994లో తన్వీర్ అహ్మద్‌ను పెళ్లి చేసుకున్న ఐశ్వర్య మూడేళ్ల తర్వాత విడాకులిచ్చినట్టు తెలిపారు.