- Home
- Entertainment
- ఆ పెద్ద డైరెక్టర్ ఓ మూమెంట్ పదే పదే చేయించాడు.. చిరాకు దొబ్బి సెట్స్ నుండి వెళ్ళిపోయా
ఆ పెద్ద డైరెక్టర్ ఓ మూమెంట్ పదే పదే చేయించాడు.. చిరాకు దొబ్బి సెట్స్ నుండి వెళ్ళిపోయా
విలన్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీకాంత్ (Srikanth) హీరోగా ఎదిగారు. ఫ్యామిలీ చిత్రాల హీరోగా బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్నారు. కొన్నేళ్లుగా వరుస పరాజయాల నేపథ్యంలో హీరోగా అవకాశాలు తగ్గాయి. పరిస్థితులకు అనుగుణంగా మరలా విలన్ గా బిజీ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు.

యుద్ధం శరణం మూవీతో విలన్ గా మారిన శ్రీకాంత్... బాలయ్య (Balakrishna)లేటెస్ట్ బ్లాక్ బస్టర్ అఖండ మూవీలో క్రూరమైన విలన్ రోల్ చేశారు. వరదరాజులుగా శ్రీకాంత్ విలనిజానికి మంచి మార్కులే పడుతున్నాయి. కాగా స్టార్ కమెడియన్ ఆలీ హోస్ట్ గా కొనసాగుతున్న ఆలీతో సరదాగా షోకి శ్రీకాంత్ గెస్ట్ గా వచ్చారు. శ్రీకాంత్ తో పాటు హీరోయిన్ పూర్ణ కూడా ఈ షోకి రావడం జరిగింది.
ఈ సందర్భంగా అఖండ (Akhanda) మూవీ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అదే సమయంలో ఇద్దరూ వ్యక్తిగత విషయాలపై స్పందించారు. ఒకే మూమెంట్ డైరెక్టర్ పదే పదే చేయించాడని సెట్స్ లో నుండి గొడవపడి వెళ్లిపోయావట... ఏంటి ఆ సినిమా అని ఆలీ అడిగారు. శ్రీకాంత్ స్పందిస్తూ.... బాగా ప్రాక్టీస్ చేసి బీజీఎమ్ కి ఓ మూమెంట్ చేశాం. కాసేపటి తర్వాత డైరెక్టర్ వచ్చి.. ఇది కాదయ్యా ఆ మూమెంట్ అని మరో మూమెంట్ చెప్పారు. అది కూడా చేశాం... మరలా మరో మూమెంట్ అంటూ.. నాలుగైదు మార్చారు. నాకు కోపం వచ్చి అక్కడున్న వస్తువు నేలకేసి కొట్టి సెట్ లో నుండి వెళ్ళిపోయాను.
ఆ మూమెంట్ చేసింది రాశితో అని చెప్పిన శ్రీకాంత్.. తనని విసిగించిన అతను ఓ పెద్ద డైరెక్టర్ అన్నాడు. డైరెక్టర్ పేరు మాత్రం స్పష్టంగా చెప్పలేదు. ఇక హీరోగా విలన్స్ ని కొట్టిన నీవు, విలన్ గా ఎప్పుడు దెబ్బలు తినడం ఎలా ఉందని ఆలీ అడిగారు. నేను మొదట్లో విలన్ గా కొట్టించుకున్నాను. హీరోగా తర్వాత కొట్టాను. ఇప్పుడు మరలా విలన్ గా కొట్టించుకుంటున్నాను. కాబట్టి నాకు మొదట్లోనే విలన్స్ బాధలు తెలుసు అన్నారు.
అఖండ మూవీ గురించి మాట్లాడుతూ.. బాలయ్య ఎనర్జీ ని తట్టుకోవడం కష్టం. ఆయన అసలు అలసిపోయేవారు కాదు. ఎండలో పనిచేసే కొద్దీ ఆయనకు ఇంకా ఊపు వస్తూ ఉండేది. అసలు సెట్ లో కూర్చునేవారు కాదు. ఆయన కూర్చోకుండా మనం కూర్చోలేం. ఏదో ఫోన్ మాట్లాడుతున్నట్టు పక్కకు వెళ్లి, చాటున కాసేపు అలా కూర్చునేవాడినని శ్రీకాంత్ తెలిపారు.
మరోవైపు శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా ఎదిగే ప్రయత్నాలలో ఉన్నారు. రోషన్ నటించిన పెళ్లి సందడి చిత్రం ఇటీవల విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. హీరోగా రిటైరైన శ్రీకాంత్ విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు.