MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ హౌస్లోకి చిరంజీవి ఫ్రెండ్.. మెగా ఫ్యాన్స్ సపోర్ట్ అతనికేనా?

Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ హౌస్లోకి చిరంజీవి ఫ్రెండ్.. మెగా ఫ్యాన్స్ సపోర్ట్ అతనికేనా?

బిగ్ బాస్ తెలుగు 8 మరో నెల రోజుల్లో ప్రారంభం కానుంది. కాగా ఈ సీజన్లో చిరంజీవి ఫ్రెండ్ కాంటెస్ట్ చేస్తున్నాడట.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Jul 29 2024, 09:16 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బిగ్ బాస్ తెలుగు 8 వచ్చేస్తుంది. ఆడియన్స్ రెండు నెలల ముందు నుంచే ఈ మూడ్ లోకి జారుకున్నారు. కంటెస్టెంట్స్ ఎవరు? హోస్టింగ్ నాగార్జునే చేస్తారా? లేక మరొకరు వస్తారా? షో ఎలా ఉండబోతుంది?... ఇలా అనేక సందేహాలు బిగ్ బాస్ లవర్స్ మైండ్ లో రన్ అవుతున్నాయి. జులై 21న నాగార్జున బిగ్ బాస్ సీజన్ 8 ప్రోమో లాంచ్ చేశారు. తన అధికారిక ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. మీకు అన్ లిమిటెడ్ వినోదం పంచేందుకు తిరిగి వస్తున్నామని కామెంట్ జోడించారు. 

 

26
Bigg boss telugu 8

Bigg boss telugu 8

నాగార్జున పోస్ట్ తో ఒక క్లారిటీ వచ్చేసింది. ఈసారి కూడా బిగ్ బాస్ హోస్టింగ్ బాధ్యతలు ఆయనే తీసుకుంటున్నారు. వరుసగా ఆరో సీజన్ ని నాగార్జున తన సారధ్యంలో నడిపించనున్నారు. కాగా బిగ్ బాస్ 8 లోగో చూసిన బిగ్ బాస్ రివ్యూవర్స్ అంచనాలు వేస్తున్నారు. సీజన్ 8 డిజైన్ ఇలా ఉంటుందని మైండ్ బ్లోయింగ్ డిటైల్స్ రివీల్ చేస్తున్నారు. 
 

36
Bigg Boss Telugu

Bigg Boss Telugu

సీజన్ 6 ప్లాప్ కావడంతో సీజన్ 7 కొత్తగా డిజైన్ చేసి సక్సెస్ అయ్యారు. ఉల్టా పల్టా అంటూ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచారు. గతంలో చూడని పవర్ అస్త్ర, ఫినాలే అస్త్ర వంటి కాన్సెప్ట్స్ సీజన్ 7లో మనం చూశాము. లాంచింగ్ ఎపిసోడ్స్ రెండు నిర్వహించడం కూడా కొత్త టెక్నిక్. లాంచింగ్ ఎపిసోడ్ రోజు 14 మంది కంటెస్టెంట్స్ ని పరిచయం చేసిన నాగార్జున... ఐదు వారాల తర్వాత మినీ లాంచ్ ఈవెంట్ నిర్వహించి మరో 5 మంది కంటెస్టెంట్స్ ని హౌస్లోకి పంపారు. ఇది టీఆర్పీ పరంగా కలిసొచ్చింది. 


 

46

ఈ క్రమంలో సీజన్ 7కి మించి విభిన్నంగా సీజన్ 8 రూపొందిస్తున్నారనే వాదన మొదలైంది. అనూహ్యంగా ఈసారి బిగ్ బాస్ షోలో రెండు హౌసులు ఉంటాయట. ఒక మెయిన్ హౌస్, రెండోది లూప్ హౌస్. మెయిన్ హౌస్లోకి రావాలంటే... కంటెస్టెంట్స్ కష్టపడాల్సి ఉంటుంది. గేమ్స్, టాస్క్స్ లో సత్తా చాటిన వారు మెయిన్ హౌస్లోకి వచ్చి బిగ్ బాస్ షోలో తమ జర్నీ కన్ఫర్మ్ చేకుంటారట. 

56
Bigg boss telugu 8

Bigg boss telugu 8

ఇదిలా ఉంటే బిగ్ బాస్ తెలుగు 8 కంటెస్టెంట్స్ వీరే అంటూ ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. కాగా నటుడు రోహిత్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తున్నాడట. రోహిత్ పలు హిట్ చిత్రాల్లో నటించాడు. సిక్టీన్, గర్ల్ ఫ్రెండ్, సొంతం, జానకీ వెడ్స్ శ్రీరామ్ వంటి హిట్ చిత్రాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. చిరంజీవి సూపర్ హిట్ మూవీ శంకర్ దాదా ఎంబీబీఎస్ లో రోహిత్ చిరంజీవి ఫ్రెండ్ రోల్ చేశాడు. 


 

66
Bigg boss telugu 8

Bigg boss telugu 8

2010 తర్వాత పూర్తిగా సిల్వర్ స్క్రీన్ కి దూరమైన రోహిత్ ఇటీవల ఓ చిత్రం చేశాడు. కాగా రోహిత్ బిగ్ బాస్ తెలుగు 8 కి ఎంపికయ్యాడని అంటున్నారు. నిజంగా రోహిత్ హౌస్లోకి వస్తే ఎలాంటి సంచనాలు చేస్తాడో చూడాలి.. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Jason Sanjay: తండ్రి పేరు తీసేశాడా? 'సిగ్మా' టైటిల్ కార్డ్‌లో జేసన్ సంజయ్ సంచలనం!
Recommended image2
Ustaad X Dhurandhar 2: ఉస్తాద్ కి పోటీగా ధురంధర్ 2 వస్తే జరిగేది ఇదేనా ? హరీష్ శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Recommended image3
Laya Mistake: లయ చేసిన బిగ్‌ మిస్టేక్‌ ఇదే, ఒక్క సినిమాతో కెరీర్‌ తలక్రిందులు.. అది తలచుకుని ఆవేదన
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved