రానా దగ్గుబాటి పెళ్లి తంతులో చిన్న చేంజ్!
టాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుబాటి త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలసిందే. ఇటీవల తన ప్రేయసి మిహీకా బజాజ్‌ను అభిమానులతో పాటు పెద్దలకు పరిచయం చేసిన రానా, ఆమె మెడలో మూడు ముళ్లూ వేయనున్నాడు. అయితే తాజాగా రానా పెళ్లికి సంబంధించి ఇంట్రస్టింగ్ అప్‌డేట్ వచ్చింది.
బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న రానా దగ్గుబాటి, చాలా రోజులుగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా ఉన్నాడు.
ఈ యంగ్ హీరో మే 12న వ్యాపారవేత్త మిహీకా బజాజ్‌తో ప్రేమలో ఉన్నట్టుగా ప్రకటించాడు రానా. ఆ వెంటనే పెళ్లి ఏర్పాట్లలో బిజీ అయ్యాడు రానా దగ్గుబాటి.
ఇప్పటికే వీరిద్దరి రోకా వేడుక ఇరు కుటుంబాల సమక్షంలో ఘనంగా నిర్వహించగా, ఆగస్టు 8న పెళ్లి జరిపిచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇప్పట్లో పరిస్థితి చక్కబడే పరిస్థితి కనిపించకపోవటంతో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతున్నారు.
కొద్ది రోజుల క్రితం వీరి నిశ్చితార్థం కూడా జరిగినట్టుగా వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఈ వార్తలను రానా తండ్రి, నిర్మాత సురేష్ బాబు ఖండించాడు.
ఆగస్టు 3 నుంచి ఆగస్టు 8 వరకు ఐదు రోజుల పాటు వివాహ వేడుకను నిర్వహించనున్నారు.
వీరి వివాహ వేడుక హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరగనుందని ముందుగా కుటుంబ సభ్యులు వెల్లడించారు.
అయితే ప్రస్తుతం కరోనా కేసులు తీవ్ర స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో వివాహ వేడుకను ప్యాలెస్‌లో కాకుండా ఇంట్లోనే నిర్వహించాలని భావిస్తున్నారట.
ప్రస్తుతం ఇదే విషయంపై ఇరు కుటుంబాలు చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంలో ఓ నిర్ణయం తీసుకోనున్నారట.
ఈ వేడుకకు అత్యంత సన్నిహితులను మాత్రమే ఆహ్వానించనున్నట్టుగా తెలుస్తోంది. అయితే వివాహ వేదిక మార్పు విషయంలో ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.