తండ్రి పేరు చెప్పుకుని అవకాశాలు..స్టార్ హీరోని అవమానకరంగా తిట్టిన లెజెండ్రీ విలన్, ఊహించని రియాక్షన్
ఒకప్పుడు విలన్ పాత్రలకు లెజెండ్రీ నటుడు రఘువరన్ ఒక బ్రాండ్ గా ఉండేవారు. ఆయన డైలాగ్ టైమింగ్, యాటిట్యూడ్ మిగిలిన విలన్స్ కంటే భిన్నంగా ఉంటూ ఆకట్టుకునేది.
ఒకప్పుడు విలన్ పాత్రలకు లెజెండ్రీ నటుడు రఘువరన్ ఒక బ్రాండ్ గా ఉండేవారు. ఆయన డైలాగ్ టైమింగ్, యాటిట్యూడ్ మిగిలిన విలన్స్ కంటే భిన్నంగా ఉంటూ ఆకట్టుకునేది. ఒక రకంగా చెప్పాలంటే అప్పట్లో ఆయన స్టైలిష్ విలన్. శివ, సుస్వాగతం, మాస్ లాంటి చిత్రాల్లో రఘువరన్ నటించి మెప్పించారు.
Raghuvaran
సుస్వాగతం చిత్రంలో పవన్ కళ్యాణ్ తండ్రిగా నటించారు. అనేక తమిళ చిత్రాల్లో కూడా రఘువరన్ నటించారు. సూర్య కెరీర్ బిగినింగ్ లో రఘువరన్ తో నటించారు. ఉయిరీలే కాలాంతతు అనే చిత్రం వీరిద్దరూ నటించిన చిత్రాల్లో ఒకటి. ఈ చిత్రంలో రఘువరన్ సూర్య అన్నయ్య పాత్రలో నటించారు.
వీరిద్దరి మధ్య ఒకసారి ఊహించని సంఘటన చోటు చేసుకుంది. కెరీర్ బిగినింగ్ కాబట్టి సూర్య చాలా అమాయకంగా కనిపించేవాడట. నటనని సీరియస్ గా తీసుకునేవాడు కాదు. ఏదో వచ్చామా డైరెక్టర్ చెప్పింది చేశామా అన్నట్లుగా ఉండేవాడట. సూర్య తండ్రి శివకుమార్ తమిళంలో పేరు మోసిన నటుడు. దీనితో సూర్యకి కెరీర్ బిగినింగ్ లో అవకాశాలు వచ్చాయి.
తండ్రి వారసత్వాన్ని నిలబెట్టాలనే ఆలోచన కూడా సూర్యకి ఉండేది కాదట. నటనలో అపరిపక్వత కనిపించేది. సూర్య నటన, బిహేవియర్ రఘువరన్ కి నచ్చేవి కాదట. షూటింగ్ కి వెళ్ళడానికి రఘువరన్, సూర్య ఇద్దరూ ఒకరోజు ట్రైన్ లో ప్రయాణించారట.
Suriya
సూర్య ఎంతో సుఖంగా నిద్రపోతున్నాడు. కెరీర్ గురించి ఎలాంటి దిగులు ఆలోచన లేదు. దీనితో రఘువరన్ సూర్యని నిద్ర లేపి మరీ క్లాస్ పీకారట. కాస్త అవమానకరంగానే తిట్టారు. 'అసలు నిద్ర ఎలా పడుతోందిరా నీకు.. కెరీర్ గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా. ఇంకా ఎంతకాలం తండ్రి పేరు చెప్పుకుని అవకాశాలు అందుకుంటావు అని రఘువరన్ తిట్టారట.
రఘువరన్ లాంటి నటుడు తిట్టడంతో సూర్య ఆలోచించడం మొదలు పెట్టారట. కానీ బాధపడలేదు. నెమ్మదిగా నటనపై ఫోకస్ పెట్టి రాటు దేలాడు. సౌత్ లో అద్భుతమైన నటుల్లో ఒకరిగా సూర్య నిలిచాడు. విలక్షణమైన పాత్రల్లో నటిస్తూ సౌత్ మొత్తం అభిమానులని సొంతం చేసుకున్నాడు. రఘువరన్ అలా తిట్టడం వల్లే సూర్యకి పరోక్షంగా ప్లస్ అయింది అని చెప్పొచ్చు. కంగువ చిత్రం కనుక హిట్ అయితే సూర్య కూడా పాన్ ఇండియా స్టార్ గా మారిపోతారు.