MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Bigg Boss Telugu 5: ట్రైలర్ లోనే అసభ్యంగా.. సిరిపై నటుడి హాట్ కామెంట్స్, హీరోయిన్ గా ఛాన్స్ ఇస్తే..

Bigg Boss Telugu 5: ట్రైలర్ లోనే అసభ్యంగా.. సిరిపై నటుడి హాట్ కామెంట్స్, హీరోయిన్ గా ఛాన్స్ ఇస్తే..

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ తెలుగు 5 షో ఎపిసోడ్స్ గడిచే కొద్దీ రసవత్తరంగా మారుతోంది. ప్రస్తుతం హౌస్ లో సన్నీ, మానస్, శ్రీరామ్ లాంటి బలమైన కంటెస్టెంట్స్ ఉన్నారు. యూట్యూబ్ వీడియోలతో ఫేమస్ అయిన అందాల భామ సిరి కూడా హౌస్ లో ప్రధాన కంటెస్టెంట్స్ లో ఒకరు.

2 Min read
Author : pratap reddy
| Updated : Nov 17 2021, 03:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ తెలుగు 5 షో ఎపిసోడ్స్ గడిచే కొద్దీ రసవత్తరంగా మారుతోంది. ప్రస్తుతం హౌస్ లో సన్నీ, మానస్, శ్రీరామ్ లాంటి బలమైన కంటెస్టెంట్స్ ఉన్నారు. యూట్యూబ్ వీడియోలతో ఫేమస్ అయిన అందాల భామ సిరి కూడా హౌస్ లో ప్రధాన కంటెస్టెంట్స్ లో ఒకరు. సిరి హౌస్ లో గ్లామర్ గా కనిపిస్తూనే మాటల యుద్ధంలో నెట్టుకొస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

హౌస్ లో సిరి, షణ్ముఖ్, జెస్సి ఒక జట్టుగా ఉంటారు. జెస్సి గత వారం ఆరోగ్య సమస్యల కారణంగా ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. Bigg Boss Telugu 5 షోలో Siri గ్లామర్ గా కనిపిస్తూ ప్రేక్షకులని ఆకర్షిస్తోంది. అయితే ఆమె సన్నీ, శ్రీరామ్ లాంటి వాళ్లకు గట్టి పోటీనిచ్చి ఫైనల్ కు చేరుతుందా లేదా అనేది రానున్న రోజుల్లో తేలనుంది. 

37

ఇక సిరి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఆమె గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. సిరి యూట్యూబ్ వీడియోలతో పాపులర్ అయ్యాక ఆమెకు సీరియల్స్, సినిమాల్లో కూడా ఆఫర్స్ వచ్చాయి. అలా సిరి ఈ ఏడాది 'నరసింహ పురం' అనే క్రైమ్ మూవీలో హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంలో నటుడు Nandakishore హీరోగా నటించారు. 

47

ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా నంద కిషోర్ సిరిపై చేసిన హాట్ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. హీరోయిన్ గా నటించిన ఎవరైనా తమ చిత్ర ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారు. కానీ సిరి మాత్రం Narasimhapuram చిత్ర ప్రమోషన్స్ కి డుమ్మా కొట్టినట్లు నటుడు నందకిషోర్ కామెంట్స్ చేశాడు. తనని సినిమాలో అసభ్యంగా చూపించారని కోపంతో ఆమె ప్రమోషన్స్ కి హాజరు కాలేదని అన్నారు. 

57

వాస్తవానికి ఆమె పాత్ర సినిమాలో చాలా బావుంటుంది. కేవలం ట్రైలర్ చూసే ఆమె ఆ అభిప్రాయానికి వచ్చేసింది. కానీ సినిమాలో ఆమె పాత్రని దర్శకుడు చక్కగా చూపించారు. పూర్తి సినిమా ఆమె చూడలేదు. ట్రైలర్ లో కొన్ని సన్నివేశాల్లో సింపుల్ రొమాన్స్ ఉంటుంది. ఆ సీన్లని చూసి తనని అసభ్యంగా చూపించారని, ఇలాగైతే తనపై ప్రేక్షకుల్లో నెగిటివ్ ఫీలింగ్ ఏర్పడుతుందని ఆమె చెప్పినట్లు నంద కిషోర్ అన్నారు. 

67

ట్రైలర్ లో కొన్ని సన్నివేశాలకి, ఆమె ప్రమోషన్స్ కి హాజరు కాకపోవడానికి సంబంధం ఏంటో తనకి అర్థం కావడం లేదని నందకిషోర్ అన్నారు. సినిమా చూస్తే మాత్రం దర్శకుడు ఆమె పాత్రని ఎంత అందంగా తీర్చిదిద్దారో అర్థం అవుతుందని.. సిరి తన అభిప్రాయం మార్చుకుంటుందని అన్నారు. 

77

సిరి సోషల్ మీడియాలో కానీ, బయట కానీ ఎక్కడా నరసింహ పురం చిత్రం గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నరసింహ పురం చిత్రం విడుదలై నిరాశపరిచింది. తీవ్రస్థాయిలో హింస, క్రైమ్ అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం నిరాశపరిచింది. ఇదిలా ఉండగా బిగ్ బాస్ హౌస్ లో సిరి, షణ్ముఖ్ స్నేహితులుగా ఉన్నారు. కానీ ఇప్పుడు వీరిద్దరూ ప్రేమికులా అని అనుమానం కలిగేలా ప్రవర్తిస్తున్నారు. బయట వీరిద్దరికి వేరే వ్యక్తులతో రిలేషన్స్ ఉన్నాయి. సిల్లీ రీజన్స్ కి వీరిద్దరూ రియాక్ట్ అవుతుండడం ప్రేక్షకుల అసహనానికి కారణం అవుతోంది. 

Also Read: Bheemla Nayak: 'భీమ్లా నాయక్' ఎఫెక్ట్.. సంక్రాంతి ఫైట్ పై ప్రొడ్యూసర్స్ గిల్డ్ సమావేశం

Also Read: మైండ్ బ్లోయింగ్ హాట్.. అవార్డుల వేడుకలో దివి అందాల విధ్వంసం, కుర్రాళ్లు ఉక్కిరి బిక్కిరి

About the Author

PR
pratap reddy
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: పులివేషం వేసుకున్న గుంటనక్క.. ఆటగాడిలా ఆడు, పోటుగాడిలా కాదు.. ముఖేష్‌, రోహిత్, అమన్‌కి వార్నింగ్‌
Recommended image2
Crazy Kalyanam Release Date: రెండు వారాల ముందే అనుపమా పరమేశ్వరన్‌ `క్రేజీ కల్యాణం`.. రిలీజ్‌ డేట్‌ ఇదే
Recommended image3
Kajal Aggarwal Mysore Palace: మైసూర్ ప్యాలెస్‌లో కాజల్ సందడి.. అది చూసి చందమామ సర్‌ప్రైజ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved