- Home
- Entertainment
- బ్రహ్మానందం వస్తున్నాడంటే వణికిపోయా.. హాస్యబ్రహ్మ ఒరిజినల్‌గా ఎలా ఉంటాడో చెప్పిన మధునందన్..
బ్రహ్మానందం వస్తున్నాడంటే వణికిపోయా.. హాస్యబ్రహ్మ ఒరిజినల్‌గా ఎలా ఉంటాడో చెప్పిన మధునందన్..
బ్రహ్మానందం హాస్యనటుడిగా అనేక రికార్డులు సృష్టించారు. ఇప్పటికీ అదే ఎనర్జీతో కామెడీని పండిస్తున్నాడు. అయితే ఆయన సెట్‌లోకి వస్తున్నాడంటే అందరికి వణుకే అట. షాకింగ్ విషయం చెప్పాడు నటుడు మధునందన్.

బ్రహ్మానందం మూడు తరాల నటులతో కలిసి నటిస్తున్న హాస్యనటుడు. ముద్దుగా పరిశ్రమ ఆయన్ని హాస్య బ్రహ్మ అని పిలుస్తుంటుంది. ఆయన తెరపై కనిపిస్తే చాలు నవ్వులే నవ్వులు అనేంతగా తనదైన కామెడీతో అలరించాడు. ఆ ఇంపాక్ట్ ని ఆడియెన్స్ పై వేసుకున్నారు. ఆయన కామెడీ ఆయనకే సాధ్యం, మరెవ్వరూ చేయలేరు. ఆయన ఏం చేసినా నవ్వులే. అంతగా నవ్వించి, నవ్విస్తున్నారు. ఇప్పుడు ఎవరికి ఎంటరైన్‌మెంట్ కావాల్సి వచ్చినా, మీమ్స్ , ట్రోల్స్ కావాల్సి వచ్చిన బ్రహ్మానందం కామెడీ సీన్లనే వాడుకుంటారు. సోషల్ మీడియాని బతికిస్తుంది, వారికి పెద్ద రీసోర్స్ గా ఉపయోగపడుతున్నది ఆయనే.
ఇటీవల బ్రహ్మానందంకి సినిమాలు తగ్గిపోయాయి. ఆయన చాలా తక్కువ సినిమాల్లో కనిపిస్తున్నారు. కొత్త ఆర్టిస్టు జోరు సాగుతున్న నేపథ్యంలో బ్రహ్మీకి ఛాన్స్ లు తగ్గాయి. పైగా ఆయన పారితోషికం ఎక్కువ కావడంతో ఆయన్ని బేర్ చేయలేకపోతున్నారు. అడపాదడపా మాత్రమే కనిపిస్తున్నారు. ఆ మధ్య తన రూట్ మార్చి `రంగమార్తాండ`లో సీరియస్ రోల్ చేశాడు. కన్నీళ్లు పెట్టించాడు. తనలో ఇలాంటి యాంగిల్ కూడా ఉందని చూపించాడు బ్రహ్మీ.
ఒకప్పుడు బ్రహ్మానందంపై చాలా రకాల కామెంట్లు వినిపించేవి. ఆయన వరుసగా సినిమాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో, కెరీర్ పీక్‌లో ఉన్న నేపథ్యంలో టైమ్‌కి సెట్‌కి రాడని, చాలా యాటిట్యూడ్ చూపిస్తాడని, నిర్మాతలను పిండేస్తుంటాడనే ప్రచారం జరిగింది. బ్రహ్మీ చాలా కాస్ట్లీ కామెడీ అంటూ ప్రచారం జరిగింది. నిర్మాతలను, దర్శకులను చాలా ఇబ్బంది పెడుతుంటాడని కూడా మాట్లాడుకున్నారు. కానీ ఆయన ఎలా ఉంటాడో తాజాగా మరో కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ మధునందన్ తెలిపారు. బ్రహ్మానందం గురించి ఆశ్చర్యపరిచే విషయాలను పంచుకున్నారు.
తాజాగా ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో మధునందన్ మాట్లాడుతూ, తాను కమిట్ మెంట్ కారణంగా చాలా మంచి ఆఫర్లని, హిట్ సినిమాలను మిస్ చేసుకున్నానని, అవి చేస్తే తన కెరీర్ వేరే స్థాయిలో ఉండేదన్నారు. బ్రహ్మానందం అంటే ఎంతో గౌరవం, ఆరాధాన భావం ఉంటుందని, ఫస్ట్ టైమ్ ఆయనతో `గీతాంజలి` సినిమాకి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నామని తెలిసినప్పుడు చాలా భయపడినట్టు తెలిపారు. సెట్‌లో ఎలా ఉంటారో, ఏమంటాడో అనే టెన్షన్ పడ్డాడట.
పైగా సెట్‌లో బ్రహ్మానందం వస్తున్నారంటే మామూలు హడావుడి ఉండేది కాదని, ఓ రకంగా తమని వణికించేవారని తెలిపారు. ఆయన సెట్‌లోకి వస్తున్నారంటేనే అసిస్టెంట్ లు మొత్తం గోడకుర్చీలు వేయించినంత పనిచేసేవాళ్లని, కదలకుండా నిలబెట్టించేవారని, ఆ హడావుడికే తమకి వణికిపోయేదని చెప్పాడు. మిగిలిన ఏ సీనియర్ ఆర్టిస్టుల వద్ద అయినా తాను భయపడలేదుగానీ, బ్రహ్మానందం విషయంలో ఓ రకంగా వణికిపోయినట్టు చెప్పాడు మధునందన్.
అయితే ఈ సందర్భంగా బ్రహ్మానందం గురించి ఆశ్చర్యపరిచే విసయాలను తెలిపారు. ఆయన మొదట్లో మనకు అంత గాంభీర్యంగా అనిపిస్తాడని, కానీ ఆయనకు అలవాటు అయితే, రెండు మూడు సార్లు కలిస్తే ఫ్రీ అయిపోతుందని, మనతో ఎంతో సరదాగా, ఫ్రీగా ఉంటాడని, చాలా ఎంకరేజ్ చేస్తాడని, ఇలా కాదు, అలా అని చెబుతుంటాడని, ఆయన సపోర్ట్ నెక్ట్స్ లెవల్ ఉంటుందని, అన్ని సినిమాలు చేశాడు, లెజెండరీ హాస్య నటుడిగా నిలిచారు. కానీ అవేవీ ఆయనకు ఉండవని, అందరితోనూ చాలా జోవియెల్‌గా ఉంటాడని తెలిపాడు మధునందన్. ఆ తర్వాత తనని కూడా ఎంతో ఎంకరేజ్ చేశాడని చెప్పాడు. `గీతాంజలి`, `దొంగాట`, `గరం`వంటి సినిమాలకు బ్రహ్మానందంతో కలిసి పనిచేసినట్టు చెప్పాడు.