- Home
- Entertainment
- తాతలు తండ్రులు ఉంటే సరిపోదు... ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్ పేర్లు ప్రసవిస్తూ బండ్ల సంచలన ట్వీట్
తాతలు తండ్రులు ఉంటే సరిపోదు... ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్ పేర్లు ప్రసవిస్తూ బండ్ల సంచలన ట్వీట్
నటుడు నిర్మాత బండ్ల గణేష్ ట్వీట్స్ తరచుగా సంచలనం రేపుతూ ఉంటాయి. ఈ పవన్ భక్తుడు పరోక్షంగా కొందరిని టార్గెట్ చేస్తూ చేసే సోషల్ మీడియా కామెంట్స్ వివాదాస్పదం అవుతూ ఉంటాయి. తాజాగా బండ్ల గణేష్ వేసిన ట్వీట్ చాలా ఘాటుగా ఉండగా ఎవరిని ఉద్దేశించనే చర్చ మొదలైంది.

బండ్ల గణేష్ తన ట్వీట్ లో... తాతలు తండ్రులు ఉంటే సరిపోదు ఎన్టీఆర్ లా మహేష్ బాబుల రామ్ చరణ్ లా ప్రభాస్ లా టాలెంట్ కూడా ఉండాలి బ్రదర్... అని కామెంట్ చేశారు. సదరు ట్వీట్ కి ఎన్టీఆర్, మహేష్, రామ్ చరణ్ లను ట్యాగ్ చేశాడు. తన ట్వీట్ లో బండ్ల గణేష్ మహేష్, రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ లను పొగిడినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఆయన తిట్టింది ఎవరిననేది ఇక్కడ చర్చ.
సోషల్ మీడియాలో మాత్రం బండ్ల గణేష్ చేసిన ఈ కామెంట్ విజయ్ దేవరకొండను అంటున్నారు. ఆయన ట్వీట్ ప్రకారం స్టార్ కిడ్స్ ని టార్గెట్ చేసినట్లు ఉంది. గాడ్ ఫాదర్స్ లేకున్నా ఇక్కడ టార్గెట్ చేసింది విజయ్ దేవరకొండనే అనేది మెజారిటీ నెటిజెన్స్ అభిప్రాయం.
వాళ్ళ వాదనలో నిజం లేకపోలేదు. నిన్న లైగర్ ట్రైలర్ విడుదల చేశారు. అలాగే విజయ్ దేవరకొండ అంటే బండ్లకు ఎందుకో నచ్చడం లేదనిపిస్తుంది. ఆ మధ్య పూరి కుమారుడు ఆకాష్ పూరి నటించిన చోర్ బజార్ ప్రీ రిలీజ్ వేడుకలో బండ్ల ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చోర్ బజార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పూరి రాలేదని బండ్ల గణేష్ అసహనం వ్యక్తం చేశారు.
కనీసం నటన, డైలాగ్స్ చెప్పడం రానివాళ్లను స్టార్స్ చేసిన నీవు కన్నకొడుకుని పట్టించుకోవడం లేదని సున్నితంగా చురకలు అంటించాడు. విజయ్ దేవరకొండతో మూవీ చేయడం బండ్ల గణేష్ కి ఇష్టం లేనట్లుంది. ఛార్మి కారణంగా భార్యను పూరి నిర్లక్ష్యం చేస్తున్నాడన్న అర్థంలో ఆమెపై కూడా సెటైర్స్ వేశాడు. ఇక బండ్ల వ్యాఖ్యలకు పూరి ఇండైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చాడు.
అయితే ఖచ్చితంగా విజయ్ దేవరకొండను ఉద్దేశించే బండ్ల ఈ కామెంట్ చేశాడు అనడానికి ఎలాంటి ఆధారం లేదు. సోషల్ మీడియా జనాల అంచనాలు మాత్రమే. అదే సమయంలో అల్లు అర్జున్ ని బండ్ల టార్గెట్ చేసి ఉండవచ్చని అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఇక బండ్ల ట్వీట్ కి సోషల్ మీడియాలో హీరోల ఫ్యాన్స్ కామెంట్స్ రూపంలో అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు.
కొందరైతే బండ్ల గణేష్ ని తిట్టిపోస్తున్నారు. ధైర్యం ఉంటే ఎవరిని ఉద్దేశించి అన్నావో చెప్పాలని ఛాలెంజ్ విసురుస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న ట్విటర్ ని బండ్ల గణేష్ ఒక్క కామెంట్ తో గందరగోళం చేశాడు.