డ్రైవర్ మాట విని వేల కోట్లు పోగొట్టుకున్న నటుడు బబ్లూ పృథ్వీరాజ్.. ఆ పని చేసి ఉంటే ఎయిర్‌పోర్ట్ తనదే?
`దేవుళ్లు` ఫేమ్ పృథ్వీరాజ్.. ఇప్పుడు ఆఫర్ల కోసం వేచి చూస్తున్నాడు. కానీ ఆయన వేలకోట్లు పోగొట్టుకున్నాడు. డ్రైవర్ మాట విని పెద్ద మిస్టేక్ చేశాడు.
తెలుగు సినిమాల్లో విభిన్నమైన పాత్రలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు పృథ్వీరాజ్(బబ్లూ పృథ్వీరాజ్). `పెళ్లి`, `పెళ్లి పందిరి`, `దేవుళ్లు`, `బాచీ`, `కంటే కూతురునే కను` ఇలా అనేక సినిమాల్లో నటించి మెప్పించాడు. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించాడు పృథ్వీరాజ్. 1990 నుంచి 2006 వరకు తెలుగు, తమిళ, కన్నడలో సినమాలు చేస్తూ బిజీగా గడిపారు. ఆ తర్వాత సినిమాలు తగ్గాయి.
మళ్లీ ఇటీవల తెలుగు, తమిళ, కన్నడలో అడపాదడపా సినిమాలు చేస్తూ వస్తున్నారు. మళ్లీ ఆకట్టుకుంటున్నారు. ఇటీవల `యానిమల్`లోనూ మెరిశారు. విలన్ సైడ్ ఉండి కాసేపు మెరిశారు. ఈ నేపథ్యంలో తాజాగా పృథ్వీరాజ్‌కి సంబంధించిన ఓ పాత ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్ అవుతుంది. అలీతో సరదాగా కార్యక్రమంలో పృథ్వీరాజ్ పాల్గొన్నాడు. ఇందులో ఓ షాకింగ్ విషయాన్ని పంచుకున్నాడు.
తాను కెరీర్ పరంగా పీక్‌లో ఉన్న సమయంలో ప్రాపర్టీస్ కొనాలనుకున్నారు. 1996 ఆ టైమ్‌లో పృథ్వీరాజ్ ఎంత బిజీగా ఉండేవాడంటే ఏడాది ఏడెనిమిది సినిమాల్లో కనిపించారు. ఆ సమయంలో పారితోషికాలు కూడా బాగానే వచ్చేవి. దీంతో ప్రాపర్టీ కొనాలనుకున్నారు. ఓ ఇంటిని కొనాలా? లేక ల్యాండ్‌ని తీసుకోవాలా అనే ప్రశ్న వచ్చింది. ఓ స్నేహితుడు తనకు శంషాబాద్ సమీపంలో వంద ఎకరాలు చూపించాడట.
తనని మధ్యలోకి తీసుకెళ్లి ఇటు వైపు యాభై ఎకరాలు, అటు వైపు యాభై ఎకరాలు అని చెప్పి, ఆ మొత్తం పది లక్షలకే అన్నాడట. దీంతో అంత తక్కువగా వస్తుందని చెప్పి పృథ్వీరాజ్ టెంప్ట్ అయ్యాడట. తీసుకోవాలని నిర్ణయించుకున్నారట. ఆ సమయంలోనే డ్రైవర్‌తో ఈ డిస్కషన్ వచ్చిందట. అతను కింద మొత్తం రాయి సార్. కొనడానిఇక పది లక్షలు అయితే, దీనికి ఫెన్సింగ్ చేయించడానికి ఇరవై లక్షలు అవుతుందన్నాడట.
దీంతో దెబ్బకి బయపడిపోయాడట పృథ్వీరాజ్. వామ్మో ఇది మనకెందుకు అని వెళ్లిపోయాడట. కట్ చేస్తే కరెక్ట్ గా అదే ప్లేస్‌లో ఇప్పుడు ఎయిర్‌పోర్ట్ వచ్చిందని ట్విస్ట్ ఇచ్చాడు బబ్లూ పృథ్వీరాజ్. అలా డ్రైవర్ మాట విని వేల కోట్లు పోగొట్టుకున్నాడు పృథ్వీరాజ్. ఎందుకంటే ఇప్పుడు శంషాబాద్ ఎయిర్ ప్రారంతంలో ఒక ఎకరం 50-100 కోట్లు పలుకుతుంది. ఈ లెక్కన పృథ్వీరాజ్ వేల కోట్లు పోగొట్టుకున్నాడు. అదే కొని ఉంటే సినిమా సెలబ్రిటీల్లోనే అత్యంత సంపన్నుడిగా నిలిచేవాడు పృథ్వీరాజ్.
అయితే ఆ సమయంలో ఈ ల్యాండ్ కొనకుండా బంజారాహిల్స్ లోని ఓ చిన్న ఇళ్లుని తీసుకున్నాడట పృథ్వీరాజ్. ఇప్పుడు దాని విలువ రెండు మూడు కోట్లకు మించి ఉండదంటే అతిశయోక్తి కాదు. అదృష్టాన్ని కాళ్లతో తన్నుకోవడం అంటే ఇదే. పృథ్వీరాజ్ ఇప్పుడు సినిమా ఆఫర్ల కోసం వెయిట్ చేస్తున్నారు.