‘ఎందుకో కొందరు గుర్తుకు వస్తున్నారం’టూ.. యాంకర్ అనసూయ పోస్ట్.. మళ్లీ దుమారం రేపిందిగా!
అందాల యాంకర్ అనసూయ భరద్వాజ్ పేరు సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్ నే ఉంటుంది. ఒకవైపు కేరీర్ లో దూసుకెళ్తునే.. మరోవైపు కాంట్రవర్సీలతో నెట్టింట దుమారం రేపుతుంటుంది. అనసూయ తాజా పోస్టు నెట్టింట వైరల్ గా మారింది.
బుల్లితెరపై అందాల యాంకర్ గా అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన యాంకరింగ్ స్కిల్స్ తోనూ, అందాలను ఆరబోతతోనూ టీవీ ఆడియెన్స్ ను కట్టిపడేసింది. ప్రస్తుతం వెండితెరపైనా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
‘జబర్దస్త్’ షోతో అనసూయకు ఎంతటి క్రేజ్ పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈషో ద్వారా ఏ స్థాయిలో క్రేజ్ సంపాదించుకుందో అదే స్థాయిలో వ్యతిరేకతనూ మూటగట్టుకుంది. టీవీ షోల్లో ఆమె మెరిసిన తీరు.. నెట్టింట పెట్టే సంచలన పోస్టులే ఇందుకు కారణమని పలువురు భావిస్తున్నారు.
గతంలో నెటిజన్ల ట్రోల్స్ కు, తనపై వచ్చే నెగెటివ్ కామెంట్లకు పెద్ద స్పందించేది కాదు. స్పందించినా మాటలతోనే బుద్ధి చెప్పి ఊరుకునేది. కానీ ప్రస్తుతం మాత్రం కేసు పెట్టి మరీ హెచ్చరిస్తోంది. ఇటీవల ఓ వ్యక్తిని అరెస్టు కూడా చేయించిన విషయం తెలిసిందే. ఇలా ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతూనే వస్తోంది.
ఈ క్రమంలో అనసూయ మరో షాకింగ్ పోస్ట్ పెట్టింది. తన ఇన్ స్ట్రా గ్రామ్ స్టోరీలో కొందరినీ టార్గెట్ చేస్తూ ఆసక్తికరంగా కామెంట్స్ చేసింది. ‘సమస్యలను తెచ్చిపెట్టే పాపులకు దూరంగా ఉండాలి’ అంటూ ఓ కొటేషన్ ను షేర్ చేసింది. దీనికి క్యాప్షన్ గా ‘నాకెందుకో కొంతమంది గుర్తుకు వస్తున్నార’ని యాడ్ చేసింది.
ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకీ అనసూయ ఎవరినీ ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసింది.. ఆ కొంతమంది ఎవరనేది రహస్యంగా మారింది. ఇక దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్ల ద్వారా స్పందిస్తున్నారు. ఎక్కువ శాతం ఆమె పోస్టుకు మద్దతిస్తూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. బుల్లితెరను వీడి వెండితెరపై సందడి చేస్తున్న అనసూయ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అరిస్తోంది. యాంకర్ గానే కాకుండా నటిగానూ తనను తాను ఫ్రూవ్ చేసుకుంటోంది. ‘రంగస్థలం’,‘పుష్ఫ’తో అదరగొట్టిన అనసూయ చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ‘పుష్ప 2’తో పాటు మరిన్ని చిత్రాల్లో నటిస్తోంది.