MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • `ఆర్‌ఆర్‌ఆర్‌` డేట్‌ని టార్గెట్‌ చేసిన చిరు, బాలయ్య.. బాక్సాఫీసుపై మరోసారి దండయాత్ర?

`ఆర్‌ఆర్‌ఆర్‌` డేట్‌ని టార్గెట్‌ చేసిన చిరు, బాలయ్య.. బాక్సాఫీసుపై మరోసారి దండయాత్ర?

ఇండియన్‌ ప్రిస్టీజియస్‌ మూవీ `ఆర్‌ఆర్‌ఆర్‌` మరోసారి వాయిదా పడబోతుంది. దీంతో నిద్ర లేచారు చిరు, బాలయ్య. బాక్సాఫీసు ఫైట్‌కి రెడీ అవుతున్నారు. ఈ సారి నువ్వా నేనా అనే రేంజ్‌లో పోటీపడబోతున్నారు. ఢీ అంట్‌ ఢీ అనబోతున్నారు. ఇద్దరు సీనియర్ల ఆట ఇప్పుడు రసవత్తరంగా మారబోతుంది.  

3 Min read
Author : Aithagoni Raju
Published : Aug 20 2021, 02:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

నాలుగేళ్ల క్రితం చిరంజీవి, బాలకృష్ణ ఒకేసారి బరిలోకి దిగారు. బాక్సాఫీసు వద్ద పోటీపడ్డారు. చిరంజీవి రీఎంట్రీ చిత్రం `ఖైదీ నెంబర్‌ 150`, , బాలకృష్ణ నటించిన హిస్టారికల్‌ ఫిల్మ్ `గౌతమిపుత్ర శాతకర్ణి` సంక్రాంతికి విడుదలై బాక్సాఫీసు వద్ద దుమ్ములేపాయి. బాలయ్య చిత్రం బాగానే ఆడగా, చిరు మరోసారి తన స్టామినా నిరూపించుకున్నారు. 

28

ఇప్పుడు మరోసారి వీరిద్దరు బాక్సాఫీసుపై దండయాత్ర ప్రకటించబోతున్నారు. ఒకేసారి వీరిద్దరి సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అది కూడా దసరా సందర్భంగా థియేటర్‌లోకి రాబోతుండటం విశేషం. ఇప్పుడిదే టాలీవుడ్‌లో ఇంట్రెస్టింగ్‌గా సాగుతున్న చర్చ. 
 

38

నిజానికి ఈ దసరాకి ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ల `ఆర్‌ఆర్‌ఆర్‌` రాబోతున్నట్టు ప్రకటించారు. ఇటీవల విడుదల చేసిన మేకింగ్‌ వీడియోలోనూ క్లారిటీ ఇచ్చారు. మరోవైపు నిన్ననే ఈ సినిమా షూటింగ్‌ మొత్తం పూర్తి చేసుకుని ఉక్రేయిన్‌ నుంచి హైదరాబాద్‌కి తిరిగొచ్చింది యూనిట్‌. ఈ నేపథ్యంలో సినిమా విడుదల మరోసారి వాయిదా అంటూ టాలీవుడ్‌లో వార్తలు చక్కర్లుకొడుతున్నాయి. ప్రస్తుతం ఇండియాలో థియేటర్లకి అనుకూలమైన పరిస్థితులు లేవు. జనం ఆశించిన స్థాయిలో థియేటర్‌కి రావడం లేదు. 
 

48

తెలంగాణలో థియేటర్లు ఫుల్‌గా నడుస్తున్నాయి. కానీ ఏపీ 50శాతమే సీటింగ్‌ కెపాసిటీకి ప్రభుత్వం అనుమతినిచ్చింది. తమిళనాడులో సినిమా థియేటర్లు ఇంకా ఓపెన్‌ కావడం లేదు. కేరళాలోనూ ఆల్మోస్ట్ క్లోజ్‌ అయిన పరిస్థితి. బాలీవుడ్‌లోనూ థియేటర్‌కి జనం రావడం లేదు, థియేటర్లు ఓపెన్‌ చేసేందుకు కూడా ఎగ్జిబిటర్ల నుంచి ఆసక్తి కనిపించడం లేదు. దీంతో `ఆర్‌ఆర్‌ఆర్‌` రిలీజ్‌కిది సరైన టైమ్‌ కాదని యూనిట్‌ భావిస్తున్నారు. పైగా ఈ చిత్రాన్ని దాదాపు 14భాషల్లో రిలీజ్‌ ప్లానుంది. సుమారు 500కోట్ల బడ్జెట్‌ సినిమా కాబట్టి ఆ మాత్రం భారీ రిలీజ్‌ లేకపోతే కలెక్షన్లు రావడం కష్టం. అందుకే వేచి చూసే ధోరణిలో ఉంది జక్కన్న టీమ్‌. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్‌కి ప్లాన్‌ చేస్తున్నట్టు టాక్. 
 

58

దీంతో ఇప్పుడు `ఆర్‌ఆర్‌ఆర్‌` డేట్‌ని చిరు, బాలయ్య టార్గెట్‌ చేశారు. సరదా కానుకగా చిరంజీవి నటిస్తున్న `ఆచార్య` చిత్రాన్ని, బాలయ్యనటిస్తున్న `అఖండ` చిత్రాన్ని విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారట. ఒక్క రోజు అటు ఇటుగా ఈ రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్‌ కాబోతున్నాయని టాలీవుడ్‌లో చర్చ జరుగుతుంది.నిర్మాతలు అదే ప్రయత్నాల్లో ఉన్నారట. `ఆర్‌ఆర్‌ఆర్‌` రిలీజ్‌ డేట్‌పై త్వరలోనే రాజమౌళి ఓ ప్రెస్ మీట్‌ పెట్టి వివరించబోతున్నారని టాక్. ఆ వార్త వచ్చిన వెంటనే చిరు, బాలయ్య తమ సినిమాల రిలీజ్‌ డేట్‌లను ప్రకటించే ఆలోచనలో ఉన్నారట. 

68

గతంలో అనేకసార్లు చిరంజీవి, బాలకృష్ణ బాక్సాఫీసు వద్ద పోటీ పడ్డారు. ఆ పోటీ సంక్రాంతి టైమ్‌లో ఎక్కువగా ఉండేది. ఇప్పుడు దసరాకి వీరిద్దరుపోటీ పడబోతున్నారనే వార్త ఇరు స్టార్ల అభిమానుల్లో గుబులు పుట్టిస్తుంది. మెగా అభిమానులు రేంజ్‌ గురించి తెలిసిందే. ఇక బాలయ్య అభిమానులు అంటే పూనకమే. ఈ ఇద్దరు హీరోలు కూల్‌గానే ఉన్నా, అభిమానుల మధ్య తీవ్రమైన పోటీ ఉండే అవకాశాలున్నాయని క్రిటిక్స్ అంటున్నాయి. అదే సమయంలో బాక్సాఫీసు వద్ద చిరు, బాలయ్య పోటీ తప్పదని, కలెక్షన్లని షేర్‌ చేసుకునే అవకాశం ఉంది. అదే సమయంలో ఈ రెండు సినిమాలు లోకల్‌ రిలీజ్‌ ఉంటుంది. ఇతర భాషల్లో విడుదల కావు. కాబట్టి దసరా అనేది పర్‌ఫెక్ట్ టైమ్‌గా భావిస్తున్నారట. 

78

ఇక చిరంజీవి నటిస్తున్న `ఆచార్య` సినిమా విషయానికి వస్తే, కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా, రామ్‌చరణ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. చిరు సరసన కాజల్‌, చెర్రీ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై నిరంజన్‌రెడ్డి, రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. 
 

88

మరోవైపు `సింహా`, `లెజెండ్‌` చిత్రాల తర్వాత బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం `అఖండ`.దీంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. పైగా ఇందులో బాలకృష్ణ రెండు విభిన్న గెటప్‌ల్లో కనిపించబోతున్నారు. అందులో ఒకటి అఘోరగా కనిపించనుండటం విశేషం. ప్రగ్యా జైశ్వాల్‌ కథానాయికగా నటిస్తుండగా, శ్రీకాంత్‌ విలన్‌ పాత్రని పోషిస్తున్నారు. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Allu Arjun: సినిమా వేస్ట్ డస్ట్ బిన్‌లో వేయండి.. అల్లు అర్జున్‌ సినిమాపై అల్లు అరవింద్‌ కామెంట్‌
Recommended image2
రాజమౌళి వల్ల కన్నీళ్లు పెట్టిన అనుష్క శెట్టి, యంగ్ హీరో చేసిన పనికి స్వీటీ ఎంత బాధపడిందంటే?
Recommended image3
కొత్తల్లుడికి గ్రాండ్ వెల్కం, కొడవ సంప్రదాయ గెటప్ లో రష్మిక విజయ్ ఎలా ఉన్నారో చూశారా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved