- Home
- Entertainment
- Intinti Gruhalakshmi: అంకిత జీవితాన్ని కూడా నీలా మార్చేద్దాం అనుకుంటున్నావా.. అభి మాటలకు తులసి కన్నీళ్లు!
Intinti Gruhalakshmi: అంకిత జీవితాన్ని కూడా నీలా మార్చేద్దాం అనుకుంటున్నావా.. అభి మాటలకు తులసి కన్నీళ్లు!
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalashmi) సీరియల్ కుటుంబం మీద ఉన్న బాధ్యత అనే నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టు కుంటుంది. ఇక ఈరోజు జూన్ 21 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ లో(ankitha)అంకిత అభి గురించి ఆలోచిస్తూ ఉండగా అప్పుడు అతనికి తను చూసిన దివ్య బాధపడుతుంది. ఆ విషయం వెళ్లి అనసూయ దంపతులకు చెప్పడంతో అప్పుడు వారు తనని ఆ ఆలోచన నుంచి బయటకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తారు. అప్పుడు మొదటి దివ్య (divya)వెళ్లి అంకితం నవ్వించే ప్రయత్నం చేయగా కానీ అంకిత మాత్రం దివ్య ని పట్టించుకోకుండా ఆలోచించుకుంటూ బాధపడుతూ ఉంటుంది.
ఆ తర్వాత అనసూయ(Anasuya )వచ్చి కామెడీ చేస్తూ పాటలు పాడుతూ డాన్స్ కూడా చేస్తుంది. అయినా కూడా అంకిత ఆలోచనల్లోనే ఉంటుంది. చివరగా పరంధామయ్య(paramdamayya)వచ్చి కామెడీ చేసినా కూడా అంకిత మౌనంగానే ఉంటుంది. అప్పుడు వాళ్ళు ముగ్గురు తులసి దగ్గరికి వెళ్లి అసలు విషయం చెబుతారు. అప్పుడు తులసి ఎలా అయినా అంకిత ను నవ్వించాలి అని ఒక కథ చెబుతుంది.
తులసీ మాటలకు అంకిత (ankitha)నవ్వడంతో అందరూ హ్యాపీగా ఫీలవుతారు. అప్పుడే నందు అక్కడికి వచ్చి తులసి (tulasi)అంటు గట్టిగా అరుస్తాడు. ఫ్యామిలీ అందరూ ఒకచోట చేరుకుంటారు. అప్పుడు నందు గట్టిగా అరుస్తూ అంకిత ని ఎందుకు ఇంట్లోకి తీసుకొని వచ్చావు తన తల్లి దగ్గరికి పంపించు అని అంటాడు నందు.
అప్పుడు తులసి , అంకిత( ankitha)ను రమ్మని చెప్పలేదని ఇక్కడి నుంచి పంపించే అర్హత నాకు లేదు అనడం తో వెంటనే లాస్య అందరి ముందు రావద్దు అని చెప్పావు కదా. మీ పెద్ద కొడుకు నువ్వు చెబితే వెళ్ళాడు. చిన్న కొడుకు నువ్వు చెబితే వెళ్ళాడు మరి అంకిత నువ్వు పిలవకుండానే వచ్చిందా అంటూ వెటకారంగా మాట్లాడుతుంది లాస్య(lasya).
అప్పుడు అంకిత వారిపై కోప్పడుతూ నన్ను ఎవరు ఇక్కడికి రమ్మని పిలవలేదు నేనే వచ్చాను అని అనగా అప్పుడు గాయత్రి(gayathtri)ఎలా వస్తావు అంటూ గట్టిగా నిలదీస్తుంది. అప్పుడు గాయత్రి మన ఇంటికి వెళదాం పద అని అనగా అంకిత మాత్రం రాను అని గట్టిగా చెబుతుంది. అప్పుడు లాస్య(lasya) అలా చెబితే కరెక్టు కాదు అని పట్టుకొని లాగాలి అనటంతో వెంటనే తులసి అడ్డుపడి మధ్యలో కర్ర వేస్తుంది.
ఆ రేఖను దాటి ఎవరు రావద్దు దాటి వచ్చి అంకిత(ankitha)ను తీసుకుని వెళ్లాలి అని చూస్తే ఇక్కడ కురుక్షేత్రము జరుగుతుంది అంటూ గట్టిగా అరుస్తుంది. అప్పుడు అభి (abhi)కూడా ఏ అత్త కోడలిని ఇలా చూడదు అంటూ వెటకారంగా మాట్లాడటం తో అప్పుడు అంకిత అభి పై మండిపడుతుంది. అనసూయ దంపతులు కూడా నందు పైకి గట్టిగా అరుస్తారు.