- Home
- Entertainment
- Ennenno Janmala Bandham: యష్ చాప్టర్ క్లోజ్ అయిపోవాలంటున్న అభి.. భర్తని వదిలేయమంటూ కోడలికి సలహా ఇచ్చిన మాలిని!
Ennenno Janmala Bandham: యష్ చాప్టర్ క్లోజ్ అయిపోవాలంటున్న అభి.. భర్తని వదిలేయమంటూ కోడలికి సలహా ఇచ్చిన మాలిని!
Ennenno Janmala Bandham: స్టార్ మా లో ప్రసారం అవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ మంచి కథ కథనాలతో ఎంతో ఇంట్రెస్టింగ్ గా ముందుకి దూసుకుపోతుంది. తను ప్రేమించిన అమ్మాయికి పెళ్లి అయిపోయినా కూడా తననే దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్న ఒక సైకో కథ ఈ సీరియల్. ఇక ఈరోజు ఏప్రిల్ 4 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో భర్త దగ్గరికి వచ్చి ఎందుకు తాగుతున్నారు, ఎందుకు నన్ను దూరం పెడుతున్నారు నేను ఏం తప్పు చేశాను అని అడుగుతుంది వేద. తప్పు చేసింది నువ్వు కాదు నేను జరిగిన పొరపాటు నుంచి గుణపాఠం నేర్చుకోకుండా మళ్ళీ అదే తప్పు చేశాను. నేను దురదృష్టవంతుడిని అంటాడు యష్. ఎందుకు బాధ పడుతున్నారు నాతో చెప్పండి అంటుంది వేద.
వద్దు నాతో ఎవ్వరూ ఉండరు, నువ్వు కూడా వెళ్ళిపో అనటంతో మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళిపోతాను మీకోసం ఎంత ఆరాట పడుతున్నానో మీకు తెలుసు అంటుంది వేద. ఆమె మాటలు వినిపించుకోకుండా స్పృహ తప్పి పడిపోతాడు యష్. అప్పటికే వర్షం పడటంతో తనకి మెలకువ వచ్చేసరికి వేద ఒడిలో ఉండటం చూసి ఎందుకు పట్టుకున్నావు వదిలేయడానికే కదా అంటూ లేచి వెళ్ళిపోయి కారులో కూర్చుంటాడు యష్. మిమ్మల్ని వెళ్ళనివ్వను అంటూ కారుకి అడ్డగా నిల్చుంటుంది వేద. యష్ ఎంత చెప్పినా వినిపించుకోదు.వెళ్ళ దలుచుకుంటే నామీద నుంచి వెళ్ళనివ్వండి అంటుంది.
మాట్లాడుతూనే మత్తులోకి జారిపోతాడు యష్. డోర్ ఓపెన్ చేసి అతనిని దగ్గరికి తీసుకొని ఎందుకు ఇంత బాధ పడుతున్నారు ఎంతో సంతోషంగా గడపవలసిన రోజు ఇది.ఇంట్లో వాళ్ళందరినీ వదిలేసి ఒంటరిగా బాధపడవలసిన అవసరం మీకు ఏం వచ్చింది నాకు తెలియకుండానే నేను తప్పు చేశానా, నేను మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాను తెలుసా అంటూ కన్నీరు పెట్టుకుంటుంది వేద. మరోవైపు అక్కడ ఏం జరిగిందో చెప్పటానికి కైలాష్ ఇంకా రాలేదు అంటూ టెన్షన్ పడుతూ ఉంటాడు అభి. ఫోటోలు చూసిన యష్ వేదని వదిలేయాలి వాళ్ళు నాశనం అయిపోవాలి అని శాపనార్ధాలు పెడుతూ ఉంటాడు.
అంతలోనే అక్కడికి వచ్చిన కైలాష్ ఫంక్షన్ మధ్యలోంచి యష్ వెళ్లిపోయాడు, ఎందుకు వెళ్లిపోయాడో అర్థం కాక అందరూ జుట్టు పీక్కుంటున్నారట అంటూ ఆనందంగా చెప్తాడు. నాకు కావలసింది ఇదే యష్ పర్సనల్ లైఫ్ దెబ్బతింటే ఆటోమేటిక్గా ప్రొఫెషనల్ లైఫ్ లో కూడా దెబ్బతింటాడు. వాడు నాకన్నా ఎప్పుడు 100 మెట్లు కిందనే ఉండాలి అంటాడు అభి.అయినా ఇది చాలదు వాడు సునామీలో కొట్టుకుపోవాలంటే ఇంకా పెద్దగా ప్లాన్ చేయాలి అంటాడు అభి. యష్ వేదని పట్టించుకోకుండా ఉంటే ఆటోమేటిక్ గా వేద కూడా యష్ దగ్గరికి రాదు.
ఇద్దరి మధ్య దూరం పెరిగి యష్ లైఫ్ లో వేద చాప్టర్ కూడా ఎండ్ అయిపోవాలి వాడి లైఫ్ లో వైఫ్ ఉండకూడదు అంటాడు అభి. మరోవైపు భర్తని పక్క సీట్లో కూర్చోబెట్టి తనే డ్రైవ్ చేస్తూ ఇంటికి తీసుకు వెళుతుంది వేద.మరోవైపు కంగారు పడుతున్న సులోచన కి ధైర్యం చెప్తే ఉంటారు రత్నం దంపతులు. అంతలోనే భర్తని తీసుకొస్తున్న వేదని చూసి అందరూ సంతోషిస్తారు. యష్ అవతారాన్ని చూసి తాగి తూలుతున్నడు వాడిని ఎందుకు మోస్తున్నావు వదిలేయ్ అంటూ కోప్పడుతుంది మాలిని. వదిలేసే అంత తేలికైనది కాదు మా బంధం అంటుంది వేద. నీలాగా భరించే భార్యలు ఉండబట్టే భర్తలందరూ వాడిలాగా తయారవుతున్నారు అంటాడు రత్నం.
ఆయన్ని ఏమీ అనొద్దు అంటూ భర్తని వెనకేసుకొస్తుంది వేద. మరి అంత మంచితనం పనికిరాదు అంటుంది సులోచన. నువ్వే చెప్పావు కదా బాధైనా సంతోషమైనా భర్తే అని నేను అదే చేస్తున్నాను అంటూ భర్తని లోపలికి తీసుకెళ్ళి పోతుంది వేద. భర్తని తీసుకెళ్లి మంచం మీద పడుకోబెడుతుంది. అంత దుఃఖం ఏముంది మీ మనసులో, మీకు ఎవరూ లేరు అనుకుంటున్నారా నేను ఉన్నాను.మీ బాధ ఏంటో కనీసం నాతో అయినా పంచుకోవచ్చు కదా.
నాలో ఉన్న ప్రేమ మీకు కనిపించడం లేదా మీకోసం ఏమైనా చేస్తాను అని మీకనిపించడం లేదా. మీరు అంటే నాకు పిచ్చి మన బంధం ఒక సంవత్సరం అగ్రిమెంటు అనుకొని ఆగిపోతున్నారేమో, మనది ఎన్నెన్నో జన్మల బంధం అంటూ అతన్ని పట్టుకొని ఏడుస్తుంది వేద. తరువాయి భాగంలో ఖుషి తో నవ్వుతూ మాట్లాడుతున్న వేద దగ్గర నుంచి ఖుషి ని లాక్కొని నా కూతురి విషయంలో పరాయి వాళ్ళ జోక్యం అనవసరం అంటాడు యష్. ఒక్కసారిగా షాక్ అవుతుంది వేద.