- Home
- Entertainment
- ఢీ షో వల్లనే చైతన్యకు అప్పులు, ఒక్కో పాటకు ఇచ్చేది ఇంతే... ఆట సందీప్ సంచలన కామెంట్స్!
ఢీ షో వల్లనే చైతన్యకు అప్పులు, ఒక్కో పాటకు ఇచ్చేది ఇంతే... ఆట సందీప్ సంచలన కామెంట్స్!
ఢీ షో నిర్మాతలు పరోక్షంగా చైతన్య మాస్టర్ మృతికి కారణమయ్యారని తెలుస్తుంది. చైతన్యతో అనుబంధం ఉన్న ఆట సందీప్ సంచలన విషయాలు వెల్లడించారు.

Aata Sundeep
ఆట సందీప్ తాజా ఇంటర్వ్యూలో షాకింగ్ ఫ్యాక్ట్స్ బయటపెట్టారు. ఢీ కొరియోగ్రాఫర్స్ షోకి ఎదురు పెట్టుబడి పెడుతున్నారని వెల్లడించారు. చైతన్య అప్పులపాలు కావడానికి ఇదే కారణమన్నారు. ఢీ లో ఒక పాటకు కొరియోగ్రాఫర్ కి రూ. 30000 ఇస్తున్నారు. ఈ డబ్బులతో డాన్సర్స్ కి కావలసిన కాస్ట్యూమ్స్, ప్రాపర్టీస్, భోజనాలు, ట్రావెలింగ్ చార్జెస్, రెమ్యూనరేషన్ ఏర్పాటు చేయాలని ఆట సందీప్ తెలిపారు.
Aata Sundeep
ఒక పాటను కొరియోగ్రాఫర్ చేయడానికి ముప్పై వేలు ఏ మాత్రం సరిపోవు. తమకు పేరు రావాలని ఢీ నిర్మాతలు ఇచ్చే డబ్బులకు తోడు బయట అప్పులు చేసి రిచ్ గా వచ్చేందుకు ప్రయత్నం చేస్తారు. ఈ కారణంతో చైతన్య అప్పులు పాలయ్యారు. జబర్దస్త్ షోలో కమెడియన్స్ కి మంచి రెమ్యునరేషన్స్ ఇస్తున్నారు. ఢీ డాన్సర్స్ కి బాగా తక్కువ ఇస్తున్నారని, సందీప్ అన్నారు.
Aata Sundeep
కష్టం అంతా డాన్సర్స్ దే. కానీ డాన్సర్స్ ని చిన్న చూపు చూస్తారు. డబ్బుల విషయంలో బేరాలు ఆడతారు. చైతన్య మాదిరి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న డాన్సర్స్, కొరియోగ్రాఫర్స్ చాలా మంది ఉన్నారు. అత్తెసరు సంపాదనతో వాళ్ళు కష్టాలు పడుతున్నారని సందీప్ వేదన వెళ్లగక్కారు. సింగర్, కమెడియన్స్ కి పెద్దగా బ్యాక్ అప్ అవసరం లేదు. ఒక సాంగ్ చేయాలంటే కనీసం 20 మంది వెనుక డాన్స్ చేయాలి. వాళ్ళందరికి డబ్బులు ఇవ్వాలి. ఖర్చులు భరించాలని సందీప్ చెప్పుకొచ్చారు.
చైతన్య చాలా మంచి వ్యక్తి. సాఫ్ట్ గా ఉంటాడు. ఒక ప్రైవేట్ ఆల్బమ్ చేస్తున్నట్లు నాతో చెప్పాడు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆత్మహత్య చేసుకోవాల్సింది కాదు. మాకు చెబితే అతని సమస్యను మేమందరం కలిసి సాల్వ్ చేసేవాళ్ళమని సందీప్ చెప్పుకొచ్చారు.
ఢీ షోలో పని చేసే డాన్సర్స్ కి కనీస గౌరవం, సంపాదన లేదని ఆట సందీప్ నేరుగా చెప్పారు. చైతన్య సూసైడ్ వీడియోలో ఇదే చెప్పారు. మల్లెమాల మీద ఆయన ఎలాంటి ఆరోపణలు చేయకున్నప్పటికీ.. ఢీ ఫేమ్ నేమ్ ఇస్తుంది కానీ సంపాదన ఇవ్వడం లేదన్నారు. జబర్దస్త్ కమెడియన్స్ కి ఇచ్చే రెమ్యూనరేషన్ తో పోల్చితే చాలా తక్కువ ఢీ వాళ్లకు ఇస్తున్నారని ఆయన వాపోయారు.
ఏప్రిల్ 30 ఆదివారం చైతన్య నెల్లూరు క్లబ్ హోటల్ లో ఆత్మహత్య చేసుకున్నారు. తన మరణానికి ప్రధాన కారణం ఆర్థిక బాధలని వెల్లడించారు. అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ వీడియోలో వివరించారు. చైతన్య మృతి బుల్లితెర వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది.