120 కోట్లు ఫ్యాన్స్ కోసం వదులుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
స్టార్ హీరోలు ఫ్యాన్స్ అంటే ప్రాణం అంటారు, కానీ వారి కోసం కోట్లు వదులుకోవలసి వస్తే..? ఇంత వరకూ ఏ హీరోకు ఆ పరిస్థితి వచ్చి ఉండదు, కానీ ఓ స్టార్ హీరో మాత్రం తన అభిమానుకు కోసం 120 కోట్ల డీల్ ను వదిలేసుకున్నాడు. ఇంతకీ ఎవరతను? ఏంటా కథ.

ఫ్యాన్స్ కోసం బ్లడ్ డొనేషన్ చేయోచ్చు... అప్పుడప్పుడు అత్యవసర పరిస్థితుల్లో ఓ పదిలక్షల వరకూ డొనేట్ చేయవచ్చు, కాని ఫ్యాన్స్ కోసం వదల కోట్లు వదులుకునే హీరోను మీరు ఎప్పుడైనా చూశారా? ఆ హీరో ఏ ఫారెన్ లోనో లేడు మన ఇండియాలోనే ఉన్నాడు. అందరికి తెలిసిన హీరో. ఎంతో మంది అభిమానించే హీరో. ఆయన ఎవరో కాదు ఆమిర్ ఖాన్.
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ తన తాజా చిత్రం 'సితారే జమీన్ పర్' విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో రూ.120 కోట్ల భారీ ఆఫర్‌తో కొనుగోలు చేయాలని చాలా ప్రయత్నం చేసింది. కాని ఈ ఆఫర్ ను ఆమిర్ ఖాన్ వెంటనే తిరస్కరించారు. అది కూడా ఆయన అభిమానుల కోసం, థియేటర్లు బ్రతకడం కోసం.
ఆమీర్ ఖాన్ అభిప్రాయం ప్రకారం, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా సినిమా విడుదలవడం వల్ల థియేటర్లలో ప్రేక్షకుల సంఖ్య చాలా తగ్గిపోతుంది, అందువల్ల థియేటర్లలో ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతి మిస్ అవుతుంది. థియేటర్లు కూడా ఇబ్బందుల్లో పడతాయి.
అంతే కాదు అభిమానులు చాలా మంది తన సినిమాను థియేటర్ లో చూసి ఎంజాయ్ చేయాలనే అనుకుంటారు. అందుకే వారికి మంచి థియేటర్ అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
సాధారణంగా, సినిమాలు థియేట్రికల్ రన్ తర్వాత ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ అవుతుంటాయి. కానీ ఆమిర్ ఖాన్ ఈ సంప్రదాయాన్ని పక్కన పెట్టి, తన సినిమా థియేటర్లలో రిలీజ్ అయిన తర్వాత నేరుగా యూట్యూబ్‌లో పే-పర్-వ్యూ మోడల్‌లో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విధానం ద్వారా ప్రేక్షకులు తక్కువ ధరకు సినిమాను వీక్షించవచ్చు, అలాగే థియేటర్లలో ప్రేక్షకుల సంఖ్య కూడా పెరుగుతుందని ఆయన భావిస్తున్నారు.
'సితారే జమీన్ పర్' సినిమా జూన్ 20న థియేటర్లలో రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు, జెనీలియా దేశ్‌ముఖ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఆర్.ఎస్. ప్రసన్న దర్శకత్వం వహించిన ఈ సినిమా, 2007లో విడుదలైన 'తారే జమీన్ పర్' చిత్రానికి సీక్వెల్‌గా రూపొందించబడింది. ఇక ఆమిర్ ఖాన్ తీసుకున్న ఈ నిర్ణయం బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి కొత్త మార్గదర్శకతను సూచిస్తుంది.
ఇక ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో, ఈ విధానం ఇతర నిర్మాతలు, దర్శకులు, నటులకు కూడా ప్రేరణగా నిలుస్తుంది.సమీప భవిష్యత్తులో, ఈ విధానం ప్రేక్షకులకు ఎలా స్పందిస్తుందో, థియేటర్లలో ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుందో లేదా తగ్గుతుందో వేచి చూడాలి. అయితే, ఆమిర్ ఖాన్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఇండస్ట్రీలో హర్షం వ్యక్తం అవుతోంది.