హాట్ టాపిక్ గా మారిన ఆది పినిశెట్టి కట్నం.. ఎంత తీసుకున్నాడో తెలిస్తే షాకే!?
టాలీవుడ్, కోలీవుడ్ లో వరుస చిత్రాల్లో నటిస్తూ ఆడియెన్స్ ను అలరిస్తున్నాడు నటుడు ఆది పినిశెట్టి. ఇటీవల తన ప్రియురాలు నిక్కీ గల్రానీతో మ్యారేజ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన కట్నం మ్యాటర్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

హీరో ఆది పినిశెట్టి తెలుగు తమిళ భాషల్లో క్రేజీ నటుడిగా గుర్తింపు సొంతం చేసుకున్నాడు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా ఆది పినిశెట్టి (Aadhi Pinisetty) రాణిస్తున్నాడు. విభిన్న పాత్రల్లో నటిస్తూ ఆడియెన్స్ ను అలరిస్తున్నాడు. స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ తన మార్క్ చూపిస్తున్నారు. తానూ హీరోగా పలు చిత్రాల్లో నటిస్తూ వస్తున్నాడు.
అయితే గత కొంత కాలంగా తమిళ హీరోయిన్ నిక్కీ గల్రానీతో ఆది పినిశెట్టి ప్రేమలో ఉన్నారు. వారిప్రేమ కాస్తా పెళ్లి పీటలు వరకు వచ్చింది. ఈ ఏడాది మార్చిలో ఈ ఇద్దరి ఎంగేజ్‌మెంట్ గ్రాండ్ గా జరిగింది. ఎంగేజ్ మెంట్ పిక్స్ ను అప్పట్లో షేర్ చేసుకుంటూ ఈ స్టార్ కపుల్ తమ వివాహా బంధం ప్రారంభం కానున్నట్టు అభిమానులు తెలియజేశారు.
ఇక మే 18న చెన్సైలో వీరిద్దరి వెడ్డింగ్ చాలా గ్రాండ్ గా జరిగింది. మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన ఈ జంట వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. అయితే వీరి వెడ్డింగ్ కు కోలీవుడ్, టాలీవుడ్ సినీ స్టార్స్, సెలబ్రెటీలు కూడా హాజరై వారిని ఆశీర్వదించారు.
ముఖ్యంగా వీరిద్దరి వెడ్డింగ్ రిసెప్షన్ కు నేచురల్ స్టార్ నాని, యంగ్ హీరో సందీప్ కిషన్, లెజెండ్ మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా కూడా హాజరయ్యారు. అలాగే సీనియర్ నటి రాధిక శరత్ కుమార్, హీరో జీవా, అరుణ్ విజయ్, నటుడు నాజర్, డైరెక్టర్ హరి.. ప్రీత దంపతులు అతిథులుగా హాజరయ్యారు.
ఇదిలా ఉంటే ఆది పినిశెట్టి మ్యారేజ్ సందర్భంగా ప్రస్తుతం ఓ టాపిక్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆది పినిశెట్టి ఎంత కట్నం తీసుకొని ఉంటాడనే ప్రశ్న అందరిలోనూ కలిగి ఉంది. ప్రముఖ సీనియర్ డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి కొడుకు కావడంతో భారీగానే డౌరీ అంది ఉంటుందని నెట్టింట ప్రచారం జరుగుతోంది.
ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ (Nikki Galrani) కొన్నేండ్ల పాటు డేటింగ్ లో ఉండి.. ప్రేమ వివాహాం చేసుకున్నాడు. అయినప్పటికీ పెద్దలను ఒప్పించి ఒక్కటవడంతో ఆది పినిశెట్టికి రూ. కోట్లల్లోనే కట్న కానుకలు అందినట్టు ఇంటర్నెట్ లో టాక్ నడుస్తోంది. ఈ హీరోకు ఆమాత్రమైనా ఇవ్వాలంటూ పలువురు ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
నిక్కీ గల్రాని ప్రస్తుతం తమిళం, మలయాళంలో కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. వివాహం తర్వాత ఆమె నటన కొనసాగిస్తుందా లేదా అనేది క్లారిటీ లేదు. ఆది పినిశెట్టి మాత్రం ప్రస్తుతం బైలింగువల్ ఫిల్మ్ ‘ది వారియర్’లో నెగెటివ్ షెడ్స్ రోల్ లో నటిస్తున్నారు. చివరిగా ‘గుడ్ లక్ సఖి, క్లాప్’ సినిమాలతో అలరించాడు.