- Home
- Entertainment
- Aadavallu Meeku Johaarlu review: ఆడవాళ్లు మీకు జోహార్లు ట్విట్టర్ టాక్.. శర్వా, రష్మిక మూవీ ఎలా ఉందంటే
Aadavallu Meeku Johaarlu review: ఆడవాళ్లు మీకు జోహార్లు ట్విట్టర్ టాక్.. శర్వా, రష్మిక మూవీ ఎలా ఉందంటే
క్రేజీ హీరో శర్వానంద్, రష్మిక మందన జంటగా నటించిన చిత్రం 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నేను శైలజ, చిత్రలహరి లాంటి హిట్ మూవీస్ తెరకెక్కించిన కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకుడు.

క్రేజీ హీరో శర్వానంద్, రష్మిక మందన జంటగా నటించిన చిత్రం 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నేను శైలజ, చిత్రలహరి లాంటి హిట్ మూవీస్ తెరకెక్కించిన కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకుడు. టైటిల్ కి తగ్గట్లుగా ఈ చిత్రంలో నటీమణులు ఎక్కువగా ఉన్నారు. సీనియర్ హీరోయిన్లు ఖుష్బూ, రాధికా శరత్ కుమార్, ఊర్వశి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇప్పటికే ఈ చిత్ర ప్రీమియర్ షోలు యూఎస్ లాంటి ప్రాంతాల్లో ప్రారంభం కాగా.. సినిమా ఎలా ఉందనే విషయాన్ని ప్రేక్షకులు ట్విట్టర్ లో చర్చించుకుంటున్నారు. ఫన్ ఎలిమెంట్స్ తో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా కిషోర్ తిరుమల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శర్వానంద్ కి ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది ఇక రష్మిక గురించి చెప్పనవసరం లేదు. పెళ్లి, పెళ్లి చూపులు, లేడీస్ డామినేషన్ లాంటి అంశాలని కిషోర్ తిరుమల హాస్యం జోడించి చిత్రీకరించారు.
త్వరగా పెళ్లి చేసుకోవాలని ఉన్నా తన ఫ్యామిలీ ఓవర్ కేరింగ్ తో శర్వానంద్ ఇబ్బంది పడే యువకుడిగా బాగా నటించాడు. పెళ్లి చూపులు జరుగుతుంటాయి కానీ ఏ సంబంధమూ సెట్ కాదు. అలాంటి టైంలో శర్వానంద్ కి రష్మిక పరిచయం అవుతుంది. రష్మికతో అయినా శర్వానంద్ వివాహం కుదురుతుందా.. వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా మొదలయింది ? అని తెలుసుకోవడమే మిగిలిన కథ.
పెళ్లి చూపులు సన్నివేశాలు, తన ఫ్యామిలీతో శర్వానంద్ పడే ఇబ్బందులని కిషోర్ తిరుమల చాలా ఫన్నీగా తెరక్కించారు. ట్విట్టర్ లో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఒకసారి చూడొచ్చని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు సినిమా ఇంకాస్త బావుండాల్సింది అని అంటున్నారు.
ఈ చిత్రంలో కిషోర్ తిరుమల రాసిన డైలాగ్స్ బాగా వర్కౌట్ అయ్యాయని అంటున్నారు. అక్కడక్కడా మంచి ఎంటర్టైన్మెంట్ ఉన్నప్పటికీ రొటీన్ గా ఉందని ట్విట్టర్ జనాలు చెబుతున్నారు. మరికొందరు మాత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.. ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు అని చెబుతున్నారు.
ఈ చిత్రంలో బలమైన కథ లేకపోవడం.. ఒక పాయింట్ తీసుకుని దాని చుట్టూ దర్శకుడు వినోదం జోడించాలని ప్రయత్నించడం మైనస్ అని చెబుతున్నారు. రష్మిక ,శర్వానంద్ నటన.. కిషోర్ తిరుమల డైలాగ్స్, కొన్ని ఫన్నీ సన్నివేశాలు ఈ చిత్రానికి ప్రధాన బలాలు.
ఖుష్బూ, రాధిక, ఊర్వశి లాంటి సీనియర్ నటీమణులు ఉన్నా వారికి ఈ చిత్రంలో నటించే స్కోప్ తక్కువ అని అంటున్నారు. ఓవరాల్ గా ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ఒకసారి ట్రై చేయగలిగే డీసెంట్ మూవీ అనే టాక్ ట్విట్టర్ నుంచి వినిపిస్తోంది.