పవన్ గెలవడని బెట్ కట్టి.. 10 కోట్లు పోగొట్టుకున్న బడా నిర్మాత..? నిజమెంత..?
ఈసారి ఏపీ రాజకీయాలు.. ఏపార్టీ గెలుస్తుంది అనే విషయంలో.. గట్టిగా బెట్టింగ్ లు నడిచాయట.. ఈ విషయంలో ఓ నిర్మాత భారీగా డబ్బు కూడా పోగోట్టుకున్నట్టు తెలుస్తోంది.

క్రికెట్ బెట్టింగ్ ల ను మించి.. ఈసారి ఏపీ రాజాకీయాలు..గెలుపు ఓటములపై బెట్టింగ్స్ జరిగినట్టు తెలుస్తోంది. గెలుపు ఎవరితో తెలియకుండానే కూటమి, వైసీపీ పార్టీలపై కోట్లు, లక్షలు, ఆస్తులు కూడా బెట్టింగ్ లో పెట్టినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలోనే ఓ భడా నిర్మాత బెట్టింగ్ లో 10 కోట్లు పొగోట్టుకున్నాడట.
కూటమి, వైసీపీ రెండు పార్టీలు గెలుపుపై ఈసారి ధీమాను ప్రదర్శించాయి. జనాలకు కూడా ఎవరు గెలుస్తారు అన్న విషయంలో ఉత్కంటగా చూశారు. దాంతో బెట్టింగ్ లు జోరు అందుకున్నాయి. వేలు, లక్షలు, కోట్లు, ఆస్తులు పందెంగా పెట్టినవారు కూడా ఉన్నారట. అంతే కాదు వ్యక్తి పరంగా కూడా పవర్ కళ్యాణ్ గెలుపు ఓటములపై కూడా పందాలు గట్టిగానే వేసుకున్నారు. దాంతో ఈసారి రాజకీయం రసవత్తరం అయ్యింది.
అయితే పందాలు అంటేనే అదృష్టంపై ఆదారపడి ఉంటుంది.. కలిసి వచ్చి ఎక్కువ డబ్బులు రావచ్చు. లేదంటే డబ్బులు కూడా పోవచ్చు. తాజాగా ఏపీలో కూడా ఇదే జరిగింది. ఫలానా పార్టీ అధికారంలోకి వస్తుందని చాలామంది రాజకీయ నాయకులు సినిమా ఇండస్ట్రీకి వాళ్ళు కూడా భారీగా పందాలు వేసుకున్నట్టు చెప్పుకుంటున్నారు.
టాలీవుడ్ లో ఈసారి భారీగా బెట్టింగ్ లు జరిగాయట. అయితే టాలీవుడ్ లో ఎక్కువ మంది కూటమి గెలవాలని కోరుకున్నారు. అందుకని ఈ కూటమికి అనుకూలంగా ఎక్కువ మంది పందెం కాసారని సమాచారం. లక్షలు దాటి పందాలు కోట్ల వరకూ వెళ్ళాయని గుసగుసలాడుకుంటున్నారు. సినిమా వాళ్లు ఎక్కువగా కూటమి గెలుపుపై పందెం వేస్తే.. ఓ బడా నిర్మాత మాత్రం వైసీపీ గెలుస్తుందని, పవన్ ఓడిపోతాడని పందెం వేశాడట.
ఇలా వైసీపీకి అనుకూలంగా.. పవన్ కు వ్యతిరేకంగా పందెం వేసి.. అతను భారీగా నష్టపోయినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం నిజం ఎంత ఉందో తెలియదు కాని.. ఫిల్మ్ సర్కిల్ లో మాత్రం తెగ గుసగుసలాడుకుంటున్నారు. నిజమో కాదో తెలియదు కాని వార్త మాత్రం హల్ చల్ చేస్తోంది.