ప్రభాస్ ‘ఆదిపురుష్’ నుంచి సాలిడ్ అప్డేట్.. వీఎఫ్ ఎక్స్ పైనా కీలక నిర్ణయం.!
హిందూ మైథలాజికల్ ఫిల్మ్ ‘ఆదిపురుష్’(Adipurush) నుంచి మరో అప్డేట్ రానుంది. ఈసారి సాలిడ్ అప్డేట్ ను ఇవ్వబోతున్నారు. ఈ సందర్భంగా వీఎఫ్ ఎక్స్ పైనా మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) - ఓం రౌత్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘ఆదిపురుష్’. భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ కూడా మేకర్స్ ప్రారంభించారు. ఈ క్రమంలో విజయదశమి సందర్భంగా ‘ఆదిపురుష్’ నుంచి ఫస్ట్ తో పాటు టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. కానీ పెద్దగా ఆడియెన్స్ ను ఆకట్టుకోలేకపోయింది. పైగా వివాదాలకు దారి తీసింది.
మూవీలోని రాముడు, రావణాసురుడు, హన్మంతుడి పాత్రలను టీజర్ లో చూపించిన తీరుకు పెద్దఎత్తున విమర్శులు కూడా వచ్చాయి. అలాగే మూవీ టీజర్ ను య్యూటూబ్ నుంచి తొలగించాలని, హిందూ దేవుళ్ల ప్రతిష్ఠతను కాపాడాలని కోరుతున్నారు. ‘సనతన్ సెన్సార్ బోర్డు’ కూడా ఏర్పాటు చేయాలని హిందూ దార్శనికుల సంఘం అఖిల భారతీయ సంత్ సమితి ప్రభుత్వాన్ని కోరింది.
ఈ మేరకు ఢిల్లీహై కోర్టులో పిటిషన్ దాఖలైంది. కోర్టు కూడా దర్శకుడు ఓం రౌత్ (Om Raut), ప్రభాస్ కు నోటీసులు పంపించినట్టు తెలుస్తోంది. ఇంకా వివాదం కొనసాగుతుండటంతో ‘ఆదిపురుష్’కు చిక్కులు తప్పడం లేదు. ఈ క్రమంలో మున్ముందు ఇచ్చే అప్డేట్స్ పైనా మేకర్స్, చిత్ర యూనిట్ మరింత జాగ్రత్తలు వహిస్తున్నట్టు తెలుస్తోంది.
డార్లింగ్ ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ‘ఆదిపురుష్’నుంచి స్పెషల్ గా మరో టీజర్ ను విడుదల చేయాలని భావిస్తున్నారంట. ఈనెల 23న కొత్త టీజర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. ఈ క్రమంలో మేకర్స్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది.
రీసెంట్ గా వచ్చిన ‘ఆదిపురుష్’ టీజర్ లో ఎక్కువగా పాత్రలను చూపించిన తీరు, వీఎఫ్ఎక్స్ పై విమర్శలు వచ్చాయి. ఈసారి వాటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారంట. అదీగాక ఫస్ట్ ఎంపిక చేసిన వీఎఫ్ ఎక్స్ టీంను తొలగించి.. కొత్త టీంను సెలెక్ట్ చేశారంట. ఈసారి వచ్చే అప్డేట్ మరింత గ్రాండ్ గానూ, వీఎఫ్ ఎక్స్ కూడా అదిరిపోతుందని అంటున్నారు.
వాల్మీకి రచించిన రామాయణం ఆధారం ‘ఆదిపురుష్’తెరకెక్కబోతోంది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్ట్ చేశారు. ప్రభాస్, క్రితిసనన్ సీతారాములుగా నటిస్తున్నారు. సైఫ్ అలీఖాన్ రావణాసురుడి పాత్రను పోషిస్తున్నారు. భూషన్ కుమార్, కిషన్ కుమార్, రాజేష్ మోహనన్ నిర్మాతలుగా వ్యవహరించారు. 2023 జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు షెడ్యూల్ చేశారు.