MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అల్లు అర్జున్ కు దక్కిన అరుదైన గౌరవం.. న్యూయార్క్ లోని ఇండియా డే పరేడ్ కు హాజరైన బన్నీ.. ఘన సత్కారం..

అల్లు అర్జున్ కు దక్కిన అరుదైన గౌరవం.. న్యూయార్క్ లోని ఇండియా డే పరేడ్ కు హాజరైన బన్నీ.. ఘన సత్కారం..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)కు అరుదైన గౌరవం లభించింది. న్యూయార్క్ లో యేటా జరిగే ‘ఇండియా డే’ పరేడ్ కు ఈసారి భారత్ దేశానికి ప్రతినిధిగా గ్రాండ్ మార్షల్ హోదాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరయ్యారు. ఈసందర్భంగా బన్నీని ఘనంగా సత్కరించారు.  

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 22 2022, 11:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)కు యూనైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో అరుదైన గౌరవం లభించింది. యూఎస్ఏలోని  న్యూయార్క్ లో ప్రతి సంవత్సరం నిర్వహించే ‘ఇండియా డే’(India Day) పరేడ్ కు ఈ ఏడాదికి యావత్ భారత్ దేశానికి ప్రతినిథ్యం వహిస్తూ గ్రాండ్ మార్షల్ హోదాలో అల్లు అర్జున్ హాజరయ్యారు. ఈసారి 75వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా న్యూయార్క్ లో గ్రాండ్ గా కావాతు నిర్వహించారు. 
 

26

ఈ సందర్భంగా బన్నీకి న్యూయార్క్ సిటీ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ఘన స్వాగతం పకలికారు. అలాగే ఈ పరేడ్ కు దాదాపు ఐదు లక్షల మందికి పైగా భారతీయలు వచ్చి, భారతదేశం పట్ల తమకున్న దేశభక్తిని, ఐకాన్ స్టార్ పై అభిమానాన్ని చాటుకున్నారు. ఈ స్థాయిలో న్యూయర్క్ డే పరేడ్ కు ప్రవాసులు రావడం ఓ రికార్డుగా ఇండియా డే పరేడ్ ప్రతినిధులు అభివర్ణిస్తున్నారు.
 

36

ఈ మార్షల్ లో అల్లు అర్జున్, ఆయన సతీమణి స్నేహారెడ్డి కూడా పాల్గొన్నారు. వైట్ డ్రెస్ ధరించిన బన్నీ జాతీయ జెండాను ఎగరవేస్తూ న్యూయార్క్ వీధుల్లో మార్షల్ నిర్వహించారు. తాజాగా ఇదే వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా పంచుకున్నారు. ‘న్యూయార్క్‌లో జరిగిన ఇండియా డే పరేడ్‌లో గ్రాండ్ మార్షల్ కు హాజరవడం గౌరవంగా ఉంది’ అనిి అన్నారు. 
 

46

అలానే ఈ సందర్శన లో భాగంగా అల్లు అర్జున్ కు ఘన సత్కారం లభించింది. న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎరిక్ బన్నీని సత్కరించి, సర్టిఫికెట్ ను అందించారు. బన్నీని కలిసినందుకు సంతోషంగా ఉందని తెలియజేశారు. 

56

ఇదే విషయాన్ని బన్నీ కూడా ట్విటర్ ద్వారా తెలియజేశాడు. ‘న్యూయార్క్ నగర మేయర్‌ని కలవడం చాలా ఆనందంగా ఉంది. చాలా స్పోర్టివ్ జెంటిల్‌మన్. మీ గౌరవానికి నా ధన్యవాదాలు.’ అని ట్వీట్ చేస్తూ.. ఎరిక్, బన్నీ కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశాడు.  ఈ ఫొటో వారు  ‘తగ్గేదే లే’ అంటూ స్టిల్ ఇవ్వడం విశేషం. ప్రస్తుతం అల్లు అర్జున్ ఫొటోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. 
 

66

ప్రస్తుతం బన్నీ ‘పుష్ఫ : ది రూల్’ (Pushpa The Rule) చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం  పూజా కార్యక్రమం ఈ రోజు గ్రాండ్ గా జరగనుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సీక్వెల్ కు ముహూర్తం ఫిక్స్ కావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. Pushpa The Rise క్రియేట్ చేసిన సెన్సేషన్ కు సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 
 

About the Author

SG
Sreeharsha Gopagani
అల్లు అర్జున్

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT Movies: ఏకంగా సీఎం పైనే, అదిరిపోయే ట్విస్ట్ లతో పొలిటికల్ థ్రిల్లర్.. ఈ వారం ఓటీటీ రిలీజ్ లు ఇవే
Recommended image2
Superstar Krishna: ఒకే సంవత్సరంలో 23 సినిమాలు.. హీరో కృష్ణ గురించి ఇంత గొప్పగా ఎవరు చెప్పారంటే.?
Recommended image3
Ranveer vs Deepika: బాక్సాఫీస్ దగ్గర భార్యదే పైచేయి.. భర్త వెనుకబడింది ఇక్కడే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved