కమల్ హాసన్ డైరెక్షన్ లో చిరంజీవి, మిస్ అయిన బ్లాక్ బస్టర్ సినిమా..? కారణం ఏంటంటే..?
మెగాస్టార్ చిరంజీవి, లోకనాయకుడు కమల్ హాసన్. ఈ ఇద్దరు స్టార్ హీరోలే. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇద్దరు అద్భుతాలు చేసేవారే. అయితే కమల్ హాసన్ దర్శకత్వంలో చిరంజీవి ఓ సినిమా చేయాల్సి ఉందట. అది ఎలా మిస్ అయ్యిందంటే..?
మెగాస్టార్ చిరంజీవి దాదాపు 45 ఏళ్ళుగా తెలుగు సినిమా పరిశ్రమలో తిరుగులేని రారాజుగా ఏలుతూ వస్తున్నారు. ఎన్నో అద్భుతమైన పాత్రలు చేశారు చిరంజీవి. ఇప్పటికీ తెలుగు సినీ పరిశ్రమకు పెద్దదిక్కుగా ఉన్నారు. 70 ఏళ్ళకు అడుగు దూరంలో ఉన్న మెగాస్టార్. కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ సినిమాలు చేస్తున్నారు. టాప్ హీరోగా కొనసాగుతున్నారు.
Actor Kamal Haasan
అదే విధంగా తమిళనాట స్టార్ హీరోగా.. ప్రమోగాలకు బ్రాండ్ అంబాసిడర్ గా పేరున్న నటుడు లోకనాయకుడు కమల్ హాసన్. ఈ స్టార్ హీరో ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 60 ఏళ్లు దాటిపోయింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకిఅడుగు పెట్టిన కమల్ హాసన్.. ఆతరువాత హీరోగా ఎన్ని ఎక్స పెర్మెంట్లు చేశాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు, తమిళ భాషల్లో ఆయన సినిమాలకు ప్రత్యేక బ్రాండ్ ఉంది.
ఇక తెలుగు, తమిళ భాషల్లో చిరంజీవి, కమల్ హాసన్ ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకుని ఉన్నారు. కాగా ఈ ఇద్దరు స్టార్స్ మంచి ఫ్రెండ్స్ గా ఉన్నారు. కమల్ హాసన్ తెలుగులో డైరెక్ట్ సినిమాలు చేశాడు కాని.. చిరంజీవి తమిళంలో సినిమాలు చేసింది లేదు. అయితే ఈ ఇద్దరు హీరోల కాంబినేషన్ లో మాత్రం ఓ సినిమా మిస్ అయ్యిందట.
అయితే ఇద్దరి కాంబినేషపన్ అంటే హీరోలుగా కాదు. కమల్ హాసన్ దర్శకుడిగా.. చిరంజీవి హీరోగా సినిమా చేయాలి అని అనుకున్నారట. కాని అది వర్కట్ అవ్వలేదు. అందరికి తెలిసిందే కమల్ హాసన్ హీరో మాత్రమే కాదు ఆయన మల్టీ టాలెంటెడ్. హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా, సింగర్ గా, క్లాసికల్ డాన్సర్ గా, ఇలా చాలా పాత్రలు పోషిస్తుంటారు.
అయితే తెలుగులో మంచి మార్కెట్ ఉన్న కమల్ హాసన్.. చిరంజీవితో ఓ సినిమా చేయాలని అనుకున్నారట. చిరంజీవికి కథ కూడా వినిపించారట. చిరుకి కూడా ఆ కథ బాగా నచ్చి సినిమా చేద్దాం అనుకున్నారట. కాని ఏమయ్యిందో ఏమో కాని.. ఆతరువాత ఈ ప్రాజెక్ట్ కొన్ని కారణాల వల్ల వెనుకబడింది. ఫ్యాన్స్ కు ఈ అద్బుతమైన సినిమా చూసే బాగ్యం లేకుండా పోయింది.
Chiranjeevi
నిజాంగా ఈసినిమా వచ్చి ఉంటే. ఇండస్ట్రీలో మరో అద్భుతం అయ్యి ఉండేది అంటున్నారు సినిమా పండితులు. ఈ కాంబినేషన్ లో కలిసి నటించిన సినిమా ముందు ముందు ఏదైనా వస్తుందేమో చూడాలి. ప్రస్తుతం కమల్ హాసన్ రాజకీయంగా బిజీ అయిపోయారు. అటు చిరంజీవి తన సినిమాలతో బిజీగా ఉన్నారు. కమల్ హాసన్ చాలా కాలం తరువాత మణిరత్నం డైరెక్షన్ లో దగ్స్ సినిమా చేస్తున్నారు.