MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ‘పుష్ప 2’లో దిమ్మతిరిగిపోయే ట్విస్ట్.. మాస్టర్ మైండ్ అనిపిస్తున్న సుకుమార్.. వర్కౌట్ అవుద్దా?

‘పుష్ప 2’లో దిమ్మతిరిగిపోయే ట్విస్ట్.. మాస్టర్ మైండ్ అనిపిస్తున్న సుకుమార్.. వర్కౌట్ అవుద్దా?

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) ‘పుష్ప 2’లో ఎవ్వరి ఊహకు అందని ట్విస్ట్ ను ప్లాన్ చేశారు. ఇది సినిమాకే హైలెట్ కానుంది. ఇప్పటికే ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అందుతుండగా.. తాజాగా విలన్స్ విషయంలో భారీ సస్పెన్స్ ను చూపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది.  

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Sep 18 2022, 01:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) - సుకుమార్ దర్శకత్వంతో వచ్చిన ‘ఫుష్ఫ’ (Pushpa) ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిదే. మూవీలోని డైలాగ్స్,  సాంగ్స్, పుష్ఫ రాజ్ అటిట్యూడ్ ఇండియా మొత్తం ఇంపాక్ట్ చూపింది. దీంతో పార్ట్ 2ను దర్శకుడు సుకుమార్ మరింత బ్రిలియెంట్ గా తెరకెక్కించేందుకు సిద్ధం అవుతున్నారు. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

కథలో సస్పెన్స్ ను చాలా బాగా హ్యాండిల్ చేయగల దర్శకుల్లో సుకుమార్ ఒకరు. ఆయన దర్శకత్వం ఇతరుల కన్నా పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ‘రంగస్థలం’ నుంచి నెక్ట్స్ లెవల్లో సినిమాలను డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం Pushpa The Rule పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో ‘పుష్ఫ 2’లోని ఓ భారీ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. 

36

మొదటి భాగంలో విలన్స్ గా సునీల్, ఫాహద్ ఫాజిల్ ను చూపించిన విషయం తెలిసిందే. సునీల్ ను మధ్యలోనే తప్పించినా.. ఫాహద్ ఫాజిల్ తో పుష్ఫరాజ్ పోటీపడనున్నట్టు చూపించనున్నారు. దీంతో మెయిన్ విలన్ గా ఫాహద్ ఫాజిల్ ఉంటాడని అంతా భావిస్తున్నారు. కానీ పుష్ప రాజ్ కు నమ్మిన బంటు ‘కేశవ’ను విలన్ గా చూపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది.
 

46

వినడానికే ఇది మైండ్ బ్లాకింగ్ న్యూస్ గా ఉంది. ఏమాత్రం అనుమానం రాకుండా ‘కేశవ’ పాత్రను భయస్తుడిగా, కామిక్ గా నడిపించారు. కానీ కట్ చేస్తే ‘పుష్ఫ : ది రూల్’లో విలన్ గా కనిపిస్తారని పలువురు సినీ విశ్లేషకులు  భావిస్తున్నారు. దీంతో సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకు మూవీకి సంబంధించి వచ్చిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గూస్ బంప్స్ తెప్పిస్తుండగా.. ఈ ట్విస్ట్ తో దిమ్మతిరిగిపోనుందని అంటున్నారు.
 

56

మరోవైపు ‘కేశవ’ను విలన్ గా చూపించినా.. అల్లుఅర్జున్ స్థాయికి సరిపోతారా? ఆడియెన్స్, ఫ్యాన్స్ ను మెప్పిస్తారా?  అన్నది ప్రశ్నార్థాకంగా మారింది. ఏదేమైనా చిత్రం సౌత్, నార్త్ ఆడియెన్స్ తెగ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే  లోకేషన్స్, స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్న సుకుమార్.. ఈ నెలలోనే షూటింగ్ ను ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. 
 

66

అలాగే పుష్ఫ 2లో.. అల్లు అర్జున్ ను కాస్తా డిఫరెంట్ లుక్ లో చూపించనున్నారు. ఈసారి మరిన్ని పాత్రలు కూడా యాడ్ కానున్నాయి.  సమంత, ప్రియమణి కీలక పాత్రలు పోషిస్తారని తెలుస్తోంది. రష్మిక మందన్న రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్ గా నటిస్తోంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. రూ.350 కోట్లతో గ్రాండ్ గా నిర్మించనున్నారు.

About the Author

SG
Sreeharsha Gopagani
అల్లు అర్జున్

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhurandhar 2 OTT: ఒకే సినిమా, రెండు ఓటీటీలు.. రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్ 2' స్ట్రీమింగ్ ప్లాన్ అదుర్స్!
Recommended image2
Roja Selvamani: రోజాకి హీరోలెవ్వరూ ఎందుకు ప్రపోజ్ చేయలేదో తెలుసా..ఇన్నేళ్లకు నిజం బయటపడింది
Recommended image3
Karthika Deepam 2 Today Episode: జ్యోకు మాటిచ్చిన దీప- తాళి కట్టమంటే కడతావా అని ప్రశ్నించిన శ్రీధర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved