MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • పవన్, చిరు కాళ్లు కడిగి నెత్తిన నీళ్లు జల్లుకోకపోతే ... ‘పుష్ప 2’ రిలీజ్ కానివ్వం

పవన్, చిరు కాళ్లు కడిగి నెత్తిన నీళ్లు జల్లుకోకపోతే ... ‘పుష్ప 2’ రిలీజ్ కానివ్వం

చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబులకు కాళ్లు కడిగి అల్లు అర్జున్ క్షమాపణలు చెప్పకపోతే పుష్ప 2 సినిమాను...

2 Min read
Author : Surya Prakash
Published : Aug 30 2024, 07:04 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

 
అల్లు అర్జున్ కు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఉన్న వివాదం జనసేన కూడా భుజాన ఎత్తుకుంది. గత కొద్ది రోజులుగా జనసైనికులు బన్నీపై నెట్టింట ట్రోల్ చేయగా.. ఇప్పుడు జనసేన నాయకులూ సైతం విరుచుకు పడుతున్నారు. తాజాగా జనసేన (Janasena) నాయకుడు రమేష్ బాబు అల్లు అర్జున్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మీడియా వేదికగా ‘పుష్ప 2’ విడుదలను తమ నియోజకవర్గం అయిన గన్నవరంలో ఆపేస్తామని హెచ్చరికలు చేసారు. వివరాల్లోకి వెళితే...
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Pushpa 2 The Rule

Pushpa 2 The Rule


గత కొద్ది రోజులుగా పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య గత సోషల్ మీడియా వేదికగా వార్ నడుస్తోంది.  ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మెగా ఫ్యామిలీ మొత్తం పవన్ కల్యాణ్ గెలుపునకు పిఠాపురంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనగా, అల్లు అర్జున్ నంద్యాలలో తన మిత్రుడు, వైసీపీ అభ్యర్ధి శిల్పా రవి గెలుపునకు ప్రచారం చేయటం వారికి నచ్చలేదు. అప్పటి నుండి అల్లు అర్జున్ ను మెగా ఫ్యాన్స్ టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. 

37


ఇదే క్రమంలో మెగా ఫ్యామిలీని కించపరిచేలా అల్లు అర్జున్ పేరుతో సోషల్ మీడియాలో ఓ ట్వీట్ వైరల్ కావడంతో మెగా ఫ్యాన్స్ రగిలిపోయారు. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'పుష్ప-2' చిత్రం డిసెంబరులో విడుదలకానుంది. ఇందుకోసం ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ పరిస్థితుల్లో అల్లు అర్జున్‌ను జనసేన పార్టీ నేతలు టార్గెట్ చేశారు. 

47


ఇదిలా ఉంటె హీరో అల్లు అర్జున్ సంస్కార హీనుడంటూ జనసేన నేత చలమలశెట్టి రమేశ్ ధ్వజమెత్తారు. జనసేన నేతలు మీడియా ముందుకు వచ్చి మరీ అల్లు అర్జున్‌పై తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త చలమలశెట్టి రమేశ్ బాబు అల్లు అర్జున్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

57


 బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చలమలశెట్టి రమేశ్ బాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్.. నీవు హీరో అనుకుంటున్నావా? కమెడియన్ మాత్రమే. చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబు అండ చూసుకుని సినిమాల్లోకి వచ్చావు. వారిని విమర్శించే స్థాయి నీకు లేదు అని రమేశ్ అన్నారు.
 

67
pushpa 2

pushpa 2


బ్లడ్ బ్యాంక్ నిర్వహణతో సహా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతో మందికి జీవితాన్ని ప్రసాదించిన మహనీయుడు చిరంజీవి. నువ్వు (అర్జున్) నీడను ఇచ్చిన చెట్టునే విమర్శిస్తున్నావంటూ దుయ్యబట్టారు. నీ బాబు అల్లు అరవింద్. నువ్వు పిల్లికి కూడా బిచ్చం పెట్టలేనటువంటి వాళ్లు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీ స్థాయి ఏమిటో.. నువ్వేమిటో ముందు చూసుకో అని హితవు పలికారు. 

77
pushpa 2

pushpa 2


నువ్వు తొందరలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు కాళ్లు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకుంటే కానీ నువ్వు చేసిన తప్పు సరికాదని అన్నారు. డిసెంబర్ నెలలో విడుదల అవుతున్న నీ సినిమా మా నియోజకవర్గంలో ఎలా అడుతుందో చూపిస్తానని శపథం చేశారు. ఇక్కడ నీ ఫ్లెక్సీలు కట్టే వాళ్లు కూడా ఎవరూ లేరని రమేశ్ బాబు అన్నారు. 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
అల్లు అర్జున్
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Irumudi: ఇరుముడి మూవీకి చిరంజీవి రివ్యూ, ఇండస్ట్రీ ఏ కొందరిదో కాదు..మెగాస్టార్ నుంచి అస్సలు ఊహించని కామెంట్
Recommended image2
Vishwak Sen Legacy: రాజకీయ వారసత్వాన్ని ఇచ్చిన తండ్రినే ద్వేషించే కొడుకు.. విశ్వక్ సేన్‌ `లెగసీ` వచ్చేది అప్పుడే
Recommended image3
Chiranjeevi: చిరంజీవి సినిమా గాలి తీసిన నటుడు, ఇదేమన్నా భీమవరం అనుకున్నావా..ప్రొడ్యూసర్ స్ట్రాంగ్ వార్నింగ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved