MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, మోహన్ బాబు ఈ స్టార్ హీరోల భార్యల్లో ఉన్న కామన్ పాయింట్ తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, మోహన్ బాబు ఈ స్టార్ హీరోల భార్యల్లో ఉన్న కామన్ పాయింట్ తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఎన్టీఆర్, ఏఎన్నార్ తో పలువురు బడా స్టార్ మరదళ్ళను వివాహం చేసుకున్నారు. అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న హీరోల లిస్ట్ ఈ విధంగా ఉంది.  

2 Min read
Author : Sambi Reddy
Published : Oct 28 2024, 07:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈ రోజుల్లో అరేంజ్డ్ మ్యారేజ్ అంటేనే వింత. ఇక మరదళ్ళను చేసుకోవడం అనే మాటే లేదు. కానీ టాలీవుడ్ టాప్ స్టార్స్ కొందరు మరదళ్ళతో ఏడడుగులు వేశారు. నందమూరి తారక రామారావు పరిశ్రమకు రాకముందే వివాహం చేసుకున్నారు. సొంత మరదలు బసవతారకంతో 1948లో ఆయనకు వివాహం జరిగింది. భార్యను సొంతూరిలో ఉంచి, చెన్నై వచ్చి సినిమాలు ప్రయత్నాలు చేసి ఎన్టీఆర్ సక్సెస్ అయ్యారు. ఎన్టీఆర్ కి 12 మంది సంతానం. 8 మంది అబ్బాయిలు కాగా, 4 అమ్మాయిలు. క్యాన్సర్ వ్యాధి బారిన పడిన బసవతారకం 1985లో కన్నుమూశారు. ఆమె జ్ఞాపకార్థం బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి స్థాపించారు.

26


అక్కినేని నాగేశ్వరరావు 1949లో మరదలు అన్నపూర్ణను వివాహం చేసుకున్నారు. అప్పటికి నాగేశ్వరరావు హీరోగా కొంత గుర్తింపు తెచ్చుకున్నారు. దాంతో గొప్ప గొప్ప సంబంధాలు వచ్చాయట. కానీ ఆయన మరదలినే మనువాడారు. భార్య పేరిట నాగేశ్వరరావు హైదరాబాద్ లో అన్నపూర్ణ స్టూడియో నిర్మించారు. అలాగే ఒక ప్రొడక్షన్ హౌస్ కూడా ఏర్పాటు చేశారు. 2011లో అన్నపూర్ణ అనారోగ్యంతో కన్నుమూశారు. 
 

36
Super Star Krishna

Super Star Krishna

ఎన్టీఆర్, ఏఎన్నార్ ల తర్వాత స్టార్ గా వెలుగొందిన హీరో సూపర్ స్టార్ కృష్ణ. 1961లో ఇందిరా దేవిని కృష్ణ వివాహం చేసుకున్నారు. ఇందిరాదేవి కృష్ణకు మరదలు అని సమాచారం. ఇందిరాదేవి-కృష్ణలకు ఐదుగురు సంతానం. మహేష్ బాబు స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు. ప్రథమ కుమారుడు రమేష్ బాబు కన్నుమూశారు. నటి, దర్శకురాలు విజయనిర్మలను కృష్ణ రెండో వివాహం చేసుకున్నారు. 2019లో విజయనిర్మల మరణించారు. 2022లో రోజుల వ్యవధిలో ఇందిరాదేవి, కృష్ణ కన్నుమూశారు. 

 

46
NTR

NTR

మోహన్ బాబు సొంత మరదలు విద్యాదేవిని వివాహం చేసుకున్నారు. ఆమెకు మంచు లక్ష్మి, విష్ణు సంతానం. విద్యాదేవి మరణించడంతో ఆమె చెల్లెలు నిర్మలాదేవిని రెండో వివాహం చేసుకున్నారు. వీరికి మనోజ్ సంతానం. ఇక మోహన్ బాబు నటుడిగా, నిర్మాతగా పరిశ్రమపై తన ముద్ర వేశారు. 500 లకు పైగా సినిమాల్లో మోహన్ బాబు నటించడం విశేషం. మోహన్ బాబు కుమారులు విష్ణు, మనోజ్ కెరీర్లో స్ట్రగుల్ అవుతున్నారు. 
 

56

డైలాగ్ కింగ్ సాయి సుకుమార్ నట వారసుడు ఆది సాయి కుమార్ 2014లో మేనమామ కూతురు అరుణను వివాహం చేసుకున్నాడు. ఆది సాయి కుమార్ సక్సెస్ కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా ఆది సాయి కుమార్ కి ఆఫర్స్ వస్తున్నాయి. 

 

66

స్టార్ బ్రదర్స్ సూర్య-కార్తీలకు తెలుగులో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. కార్తీ 2011లో మరదలు రజిని చిన్న స్వామిని వివాహం చేసుకున్నాడు. కార్తీ నటించిన సత్యం సుందరం ఇటీవల విడుదలైంది. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. కార్తీ హీరోగా సర్దార్ 2 తెరకెక్కుతుంది. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Leader Box Office: బాక్సాఫీస్ వద్ద లెజెండ్‌ శరవణన్‌ 'లీడర్' సంచలనం.. మూడు రోజుల్లో ఊహించని వసూళ్లు
Recommended image2
Top Cinema Song: 93 కోట్ల వ్యూస్‌తో యూట్యూబ్‌ని ఊపేస్తున్న పాట ఇదే.. తెలుగులోనే నెం 1, వింటే ఊగిపోవాల్సిందే
Recommended image3
Emotional: ఈ పాట వింటే.. బండరాయి లాంటి మనిషి కంట కూడా నీరు రావాల్సిందే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved