త్రిష సూపర్ హిట్ చిత్రానికి సీక్వెల్, స్టోరీ విని 5 తులాల బంగారం ఇచ్చిన నిర్మాత
Trisha : త్రిష సూపర్ హిట్ చిత్రానికి సీక్వెల్ రాబోతోంది. కథ విన్న నిర్మాత దర్శకుడికి వెంటనే 5 తులాల బంగారం ఇచ్చారట.

దర్శకుడు ప్రేమ్ కుమార్ డైరెక్షన్‌లో, విజయ్ సేతుపతి, త్రిష కలిసి నటించిన 96 చిత్రం 2018లో విడుదలైంది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. వసూళ్ల పరంగా కూడా భారీ విజయం సాధించింది.
96 మూవీ నటీనటులు, సాంకేతిక నిపుణులు
ఈ సినిమాలో గౌరి జి కిషన్, దేవదర్శిని, నియాటి కడంబి, జనకరాజ్, భగవతి పెరుమాళ్, రమేష్ తిలక్ తదితరులు నటించారు. గోవింద్ వసంత సంగీతం అందించారు. మద్రాస్ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ నిర్మించింది.
96 సెకండ్ పార్ట్ లవ్ స్టోరీ కాదు
ఇప్పుడు 7 సంవత్సరాల తర్వాత దర్శకుడు ప్రేమ్ కుమార్ ఈ సినిమాకు సీక్వెల్ తీయడానికి రెడీ అవుతున్నారు. అయితే, మొదటి భాగంలా ఈ సినిమా ప్రేమ కథ కాదని ఇదివరకే చెప్పారు. ఈ సినిమాను ఐసరి గణేష్ వేల్స్ సంస్థ నిర్మిస్తుందని అంటున్నారు.
ఐసరి కె. గణేష్ గోల్డ్ గిఫ్ట్
96 సినిమా రెండో భాగం కథ విన్న నిర్మాత ఐసరి గణేష్, కథ విన్న మరుసటి రోజే డైరెక్టర్‌ను పిలిచి 5 తులాల బంగారు నగలు బహుమతిగా ఇచ్చారట. తన సినీ జీవితంలో ఇలాంటి కథ ఎప్పుడూ వినలేదని, ఈ సినిమా హిట్ అవుతుందని చెప్పారట. డైరెక్టర్ ప్రేమ్ కుమార్ 96 సినిమాతో పాటు, జాను అనే తెలుగు సినిమాను (96 రీమేక్), మెయ్యజగాన్ సినిమాను కూడా డైరెక్ట్ చేశారు. మెయ్యజగాన్ సినిమా పెద్దగా రీచ్ కాలేకపోయినా, మిక్స్‌డ్ రివ్యూస్ అందుకుంది.
96 మూవీ 2nd పార్ట్
త్వరలోనే 96 సినిమా రెండో భాగం షూటింగ్ మొదలుకానుందని, మొదటి భాగంలో హీరోగా నటించిన విజయ్ సేతుపతి ఈ సినిమాలో కూడా నటిస్తారా? అనే విషయంపై ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు.