MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సాయి పల్లవికి తప్ప ఇంకెవరికి సాధ్యం కాని 8 రోల్స్.. ఒక్కొక్కటి ఒక్కో డైమండ్

సాయి పల్లవికి తప్ప ఇంకెవరికి సాధ్యం కాని 8 రోల్స్.. ఒక్కొక్కటి ఒక్కో డైమండ్

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి సౌత్ లో ఓ సెన్సేషన్. హీరోయిన్లు వెండితెరని తమ గ్లామర్ తో హీటేక్కిస్తున్న టైంలో అందాల ఆరబోతకు ఆస్కారం ఇవ్వకుండా తన పెర్ఫామెన్స్ తో ప్రేక్షకులని ఫిదా చేస్తోంది.

2 Min read
Author : pratap reddy | Asianet News
Published : Sep 24 2021, 10:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి సౌత్ లో ఓ సెన్సేషన్. హీరోయిన్లు వెండితెరని తమ గ్లామర్ తో హీటేక్కిస్తున్న టైంలో అందాల ఆరబోతకు ఆస్కారం ఇవ్వకుండా తన పెర్ఫామెన్స్ తో ప్రేక్షకులని ఫిదా చేస్తోంది. గ్లామర్ ఒలకబోయకపోతే కష్టం అనుకునే రోజుల్లో కేవలం నటనతోనే సాయి పల్లవి స్టార్ హీరోయిన్లని సైతం డామినేట్ చేస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212

అంతలా ఆమె అభినయం ప్రేక్షకులపై ప్రభావం చూపుతోంది. నేడు సాయి పల్లవి.. నాగచైతన్యతో జంటగా నటించిన లవ్ స్టోరీ చిత్రం రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా సాయి పల్లవి కెరీర్ లో ఆమె పోషించిన 8 అద్భుతమైన రోల్స్ చూద్దాం. 

312

ప్రేమమ్ : ఈ మలయాళీ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. యంగ్ టీచర్ మలార్ పాత్రలో సాయి పల్లవి నటన కుర్రాళ్ళ హృదయాలు దోచుకుంది. ఈ మూవీ నుంచే సాయి పల్లవి పేరు సౌత్ మొత్తం వినిపించడం ప్రారంభం అయింది. 

412

కాళి : ఈ మలయాళీ చిత్రం తెలుగులో ' హేయ్ పిల్లగాడ' గా విడుదలైంది. విపరీతమైన కోపం ఉన్న భర్తకు భార్యగా అంజలి పాత్రలో సాయి పల్లవి నటన మెప్పిస్తుంది. దుల్కర్ సల్మాన్, సాయి పల్లవి ఈ చిత్రంలో జంటగా నటించారు. 

512

ఫిదా : సాయి పల్లవిని తెలుగు ప్రేక్షకులకు చేరువ చేసిన చిత్రం ఇది. శేఖర్ కమ్ముల దర్శకుడు. అప్పటి వరకు సాయి పల్లవి గురించి విన్న తెలుగు జనం.. ఈ చిత్రంలో ఆమె పెర్ఫామెన్స్ ని రుచి చూశారు. అల్లరి పిల్లగా సాయి పల్లవి నటన, డాన్స్ కుర్రకారుని పిచ్చెక్కించేశాయి. హైబ్రిడ్ పిల్ల భానుమతిగా సాయి పల్లవి మెస్మరైజింగ్ పెర్ఫామెన్స్ అందించింది. 

612

మిడిల్ క్లాస్ అబ్బాయి : ఈ మూవీలో నాని, సాయి పల్లవి మధ్య కెమిస్ట్రీ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఈ మూవీలో సాయి పల్లవి చిన్ని పాత్రలో కాస్త నాటీగా నటించి మెప్పించింది. ఈ మూవీలో సాయి పల్లవి నటన మాస్ ప్రేక్షకులని కూడా మెప్పించింది. 

712

కణం : ఈ చిత్రంలో సాయి పల్లవి పూర్తిగా నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రంలో నటించింది. సాయి పల్లవి ఈ మూవీలో అబార్షన్ కు గురైన మహిళగా అద్భుతంగా నటించింది. 

812

పడిపడి లేచే మనసు : ఈ మూవీలో సాయి పల్లవి, శర్వానంద్ జంటగా నటించారు. ఎమోషనల్ లవ్ డ్రామాగా సాగే ఈ చిత్రంలో సాయి పల్లవి నటన అద్భుతంగా ఉంటుంది. ఊహించని మలుపులతో సాగే ఈ ప్రేమ కథలో శర్వానంద్, సాయి పల్లవి పోటీ పడి నటించారు. 

912

మారి 2: ఈ మూవీలో సాయి పల్లవి ఆటో డ్రెవర్ గా మాస్ రోల్ లో కనిపించింది. సాయి పల్లవి నటన,మాస్ యాటిట్యూడ్ నెక్స్ట్ లెవల్ లో ఉంటాయి. ఇక రౌడీ బేబీ సాంగ్ లో ఆమె డాన్స్ గురించి ఎంత వర్ణించినా తక్కువే. 

1012

పావ కధైగళ్ : ఈ తమిళ చిత్రంలో సాయి పల్లవి గర్భవతి సుమతిగా నటించింది. ఈ చిత్రంలో సాయి పల్లవి పాత్ర ప్రతి ఒక్కరిని కంట తడి పెట్టిస్తుంది. అంతలా ఎమోషనల్ పెర్ఫామెన్స్ తో సాయి పల్లవి ఆకట్టుకుంది. 

1112

లవ్ స్టోరీ : నేడు విడుదల కాబోతున్న ఈ చిత్రంలో సాయి పల్లవి నాగ చైతన్యకు జంటగా నటించింది. ఆమె పాత్రలో అనేక షేడ్స్ ఉంటాయని ఇప్పటికే చిత్ర యూనిట్ పేర్కొంది. 

1212

అప్ కమింగ్ మూవీస్ : సాయి పల్లవి నటనకు ప్రాధ్యానత లేనిదే ఈ చిత్రాన్ని అంగీకరించదు. లవ్ స్టోరీ తర్వాత సాయి పల్లవి విరాట పర్వం, శ్యామ్ సింగ రాయ్ లాంటి చిత్రాల్లో నటిస్తోంది. నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ మూవీలో సాయి పల్లవి పవర్ ఫుల్ రోల్ పోషించబోతున్నట్లు టాక్. 

About the Author

PR
pratap reddy
Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: క్యారెక్టర్ ఆర్టిస్ట్ కోసం 300 మందిని వెనక్కి రప్పించిన చిరంజీవి.. దటీజ్ మెగాస్టార్
Recommended image2
Balu Real Life: గుండె నిండా గుండె గంటలు బాలు రియల్ లైఫ్ లో ఘోరం.. దారుణంగా మోసం చేసిన భార్య
Recommended image3
Janhvi Kapoor Controversy: డబ్బుల కోసమే ఇలా రెచ్చగొడుతున్నారు, ఇండస్ట్రీ మొత్తం అదే పని.. నిత్యా మీనన్ ఫైర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved