గాంధీ పుట్టిన దేశం స్వాతంత్య్రం ఆయన త్యాగఫలం... మహాత్ముడు మీద వచ్చి బెస్ట్ మూవీస్ ఇవే!
స్వాతంత్య్ర సంగ్రామంలో అతివాదులు మితవాదులు భాగమయ్యారు. అంతిమ విజయం మితవాదులదే అయ్యింది. శాంతియుత పోరాటాల ద్వారా స్వాతంత్య్రం సాధించిన వచ్చని మహాత్మ గాంధీ నిరూపించారు.
independence day
మహాత్మ గాంధీ స్వాతంత్య్ర ప్రదాత. అహింసో పరమోధర్మః అనే సిద్ధాంతం ఆయన అన్నారు. ఆయన ఆలోచనలు , పోరాట మార్గాలు ప్రపంచానికి స్ఫూర్తిగా నిలిచాయి. కోటీశ్వరుల కుటుంబంలో పుట్టి సాధారణ జీవితం గడిపారు ఆయన. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన గాంధీ జీవితం ఆధారంగా అనేక సినిమాలు తెరకెక్కాయి. అవి ఏమిటో చూద్దాం...
independence day
భారతీయుల కంటే విదేశీయులు మహాత్ముడు జీవితం వెండితెరపైకి తేవాలని అనుకున్నారు. 1982లో వచ్చిన గాంధీ చిత్రంలో గాంధీగా హాలీవుడ్ నటుడు బెన్ కింగ్ స్లే గొప్పగా నటించారు. రిచర్డ్ అటెన్ బరో రూపొందించిన ఈ చిత్రం సంచలనం సృష్టించింది. అప్పట్లో భారీ విజయం సాధించింది.
independence day
గాంధీ మూవీ అనంతరం `ది మేకింగ్ ఆఫ్ మహాత్మ` అనే చిత్రం చేశారు. ప్రఖ్యాత బెంగాలీ దర్శకుడు శ్యామ్బెనెగల్ ది మేకింగ్ ఆఫ్ మహాత్మ చిత్రానికి దర్శకత్వం వహించారు. . సౌత్ ఆఫ్రీకాలో గాంధీ వున్న నాటి రోజుల నేప్యంలో దీన్ని నడిపించారు. అసలు గాంధీ అహింస మార్గం ఎంచుకోవడం వెనుక కారణాలు ఈ చిత్రంలో చెప్పారు.
independence day
ఇక 2000 సంవత్సరంలో కమల్ హాసన్ , షారుక్ ఖాన్ ల కలయికలో వచ్చిన చిత్రం హే రామ్`.అప్పట్లో ఈ మూవీ వివాదాస్పదమైంది . షారుక్ ఖాన్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించారు. ఈ మూవీ అనుకున్నంతగా ఆడలేదు. వివాదాలను మాత్రం రాజేసింది.
independence day
2006లో గాంధీ విలువలు , ఆశయాలు తెలియజేసేలా మున్నా భాయ్ ఎం బి బి ఎస్ తెరకెక్కించారు. సంజయ్ దత్ హీరోగా నటించగా ఆయనకు బాలీవుడ్ వర్గాల్లో పాజిటివ్ ఇమేజ్ వచ్చింది . ఆ తరువాత వచ్చిన `లగేరహో మున్నాభాయ్`లోనూ గాంధీగిరి గురించి ప్రస్తావించారు.
independence day
లగేరహో మున్నాభాయ్` సినిమాను తెలుగులోనూ శంకర్ దాదా జిందాబాద్‌గా రూపొందించారు. ఈ మూవీలో చిరంజీవి మహాత్మ ఆత్మతో మాట్లాడుతూ ఉంటాడు. ఈ సిల్లీ స్క్రీన్ ప్లే తెలుగులో పరాజయం పాలైంది. అయితే చిరంజీవి బెస్ట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
independence day
ఇక గాంధీ ఎమోషనల్ డ్రామాగా `గాంధీ మై ఫాదర్` తెరకెక్కింది. అలాగే దర్శకుడు కృష్ణ వంశీ మహాత్మ టైటిల్ తో పొలిటికల్ డ్రామా తెరకెక్కించారు. శ్రీకాంత్ వందవ చిత్రంగా తెరకెక్కిన మహాత్మ ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది.