- Home
- Entertainment
- 2025 తెలుగు బ్లాక్ బస్టర్ మూవీస్.. `సంక్రాంతికి వస్తున్నాం`, `డాకు`, `తండేల్`, `కోర్ట్`, `మ్యాడ్ 2`
2025 తెలుగు బ్లాక్ బస్టర్ మూవీస్.. `సంక్రాంతికి వస్తున్నాం`, `డాకు`, `తండేల్`, `కోర్ట్`, `మ్యాడ్ 2`
2025 Telugu Block Buster Movies: తెలుగు సినిమాకి సంబంధించి ఇప్పటికే మూడు నెలలు పూర్తయ్యింది. మరి ఈ మూడు నెలల్లో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలేంటో ఓ లుక్కేద్దాం.

daaku maharaaj, sankranthiki vasthunam, thandel
2025 Telugu Block Buster Movies: సినిమాల సక్సెస్ రేట్ చాలా తగ్గిపోతుంది. ఏడాదికి రెండు వందలకుపైగా చిత్రాలు విడుదలైతే అందులో పది నుంచి పదిహేను చిత్రాలు మాత్రమే సక్సెస్ అవుతున్నాయి. మిగిలినవన్నీ పరాజయం చెందుతున్నాయి.
మరి ఈ ఏడాది ఇప్పటికే మూడు నెలలు గడిచిపోయింది. `సంక్రాంతికి వస్తున్నాం`, `డాకు మహారాజ్`, `తండేల్`.. ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు విజయం సాధించాయో ఓ లుక్కేద్దాం.
sankranthiki vasthunam
జనవరి నెలలో మొత్తం 16 సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో కేవలం రెండే రెండు సినిమాలు విజయం సాధించాయి. వాటిలో వెంకటేష్ హీరోగా ఐశ్వర్యా రాజేష్, మీనాక్షి చౌదరీ జంటగా నటించిన `సంక్రాంతికి వస్తున్నాం` సినిమా ఒకటి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం మూడు వందల కోట్లకుపైగా వసూళ్లని రాబట్టి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.
Nandamuri Balakrishna Daaku Maharaaj
అదే నెలలో బాలకృష్ణ హీరోగా నటించిన `డాకు మహారాజ్` కూడా హిట్ ఖాతాలోనే పడింది. సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ బాగానే ఆడింది. ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహించగా, నాగవంశీ నిర్మించారు. ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో బాబీ డియోల్ విలన్. ఈచిత్రం సుమారు రూ. 150కోట్లకుపైగా వసూళ్లని రాబట్టింది.
thandel
ఫిబ్రవరిలో 14 సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో కేవలం నాగచైతన్య, సాయిపల్లవి కలిసి నటించిన `తండేల్` ఒక్కటే సక్సెస్ అయ్యింది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ మూవీని గీతా ఆర్ట్స్ నిర్మించింది. ఈ మూవీ వంద కోట్లు వసూలు చేసింది.
court movie review
మార్చి నెలలో 22 సినిమాలు విడుదలైతే రెండే రెండు సక్సెస్ అయ్యాయి. నాని నిర్మించిన `కోర్ట్` పెద్ద హిట్ అయ్యింది. చిన్న చిత్రాల్లో పెద్ద విజయం సాధించింది. ఇందులో శివాజీ, ప్రియదర్శి, కుర్ర హీరో హర్ష్ నటించారు. కోర్ట్ రూమ్ డ్రామాగా ఇది ఆకట్టుకుంది. ప్రశంసలందుకుంది.
Mad Square movie , mad 2
ఇక మార్చి నెలకి ముగింపు పలికింది `మ్యాడ్ స్వ్కేర్`. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో సంగీత్ శోభన్, రామ్ నితిన్,నార్నే నితిన్ హీరోలుగా నటించారు. నాగవంశీ నిర్మించిన ఈ మూవీ రెండేళ్ల క్రితం వచ్చిన `మ్యాడ్`కి సీక్వెల్.
ఈ మూవీ ఇంకా థియేటర్లో ఆడుతుంది. ఇప్పటికే రూ. 75కోట్లకుపైగా వసూళ్లని సాధించింది. వందకోట్ల దిశగా వెళ్తుంది. మూడు నెలల్లో 52 సినిమాలు విడుదల కాగా, 5 మాత్రమే సక్సెస్ కావడం గమనార్హం.
read more: క్యాబరే డాన్స్ తో ఊపేసిన డిస్కో శాంతి ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?
also read: వాటిని ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న దుల్కర్ సల్మాన్.. సర్జరీకి ముందు ఎలా ఉండేవారో చూడండి!