- Home
- Entertainment
- 200 కోట్ల క్లబ్ లో 15 సినిమాలు, కాంతారా 2 తో పాటు 2025 లో రికార్డు క్రియేట్ చేసిన మూవీస్ ఏంటో తెలుసా?
200 కోట్ల క్లబ్ లో 15 సినిమాలు, కాంతారా 2 తో పాటు 2025 లో రికార్డు క్రియేట్ చేసిన మూవీస్ ఏంటో తెలుసా?
కాంతారా చాప్టర్ 1 సినిమా రెండో రోజే 200 కోట్ల క్లబ్‌లో చేరింది. ఇప్పటికే ఎన్నో సినిమాలు ఈ ఘనత సాదించాయి. ఇక ఈ ఏడాది 2025 లో ఈ మార్కును దాటిన 15 ఇండియాన్ సినిమాలు ఏవో తెలుసా?

1. ఛవా (హిందీ)
ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్: 807.91 కోట్లు (బ్లాక్ బస్టర్ హిట్)
విక్కీ కౌశల్, రష్మిక మందన్న తో పాటు అక్షయ్ ఖన్నా నటించిన ఈ సినిమా, ఛత్రపతి శంభాజీ మహారాజ్ బయోపిక్ గా తెరకెక్కింది. లక్ష్మణ్ రామ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈమూవీ ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైనరెస్పాన్స్ ను సాధించింది.
2. సైయారా (హిందీ)
ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్: 570.29 కోట్లు (బ్లాక్ బస్టర్ )
ఈ మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా చిత్రంలో అహన్ పాండే , అనిత్ పద్దా జంటగా నటించారు. ఈ సినిమాతో వీరిద్దరు బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రానికి మోహిత్ సూరి దర్శకత్వం వహించారు. 30 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈసినిమా 300 కోట్ల వరకూ వసూళ్లు సాధించింది.
3. కూలీ (తమిళం)
ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్: 518 కోట్లు (హిట్ )
రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ యాక్షన్ చిత్రంలో నాగార్జున అక్కినేని విలన్ గా నటించి మెప్పించాడు. మలయాళ స్టార్ సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, ఆమీర్ ఖాన్ నటించిన ఈసినిమాను లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు.
4. వార్ 2 (హిందీ)
ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్: 364.35 కోట్లు (ప్లాప్)
అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామాలో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పరాజయం చెందింది.
5. లోక ఛాప్టర్ 1 - చంద్ర (మలయాళం)
ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్: 297 కోట్లు (హిట్ )
డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించిన ఈ సూపర్ హీరో చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో కనిపించారు. కల్లియంకట్టు నీలి, నసలన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ 30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి 300కోట్లు కలెక్ట్ చేసింది.
6. మహావతార్ నరసింహ (కన్నడ)
ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్: 326.63 కోట్లు (బ్లాక్ బస్టర్)
ఇది అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించిన యానిమేటెడ్ భక్తి చిత్రం. దాదాపు 30కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈసినిమా 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
7. హౌస్‌ఫుల్ 5 (హిందీ)
ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్: 288.67 కోట్లు (ఫ్లాప్)
తరుణ్ మన్సుఖాని దర్శకత్వం వహించిన ఈ కామెడీ చిత్రంలో అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, రితీష్ దేశ్‌ముఖ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సోనమ్ బజ్వా, నర్గీస్ ఫక్రీ, సంజయ్ దత్, జాకీ ష్రాఫ్, నానా పటేకర్, ఫర్దీన్ ఖాన్ తో పాటు చిత్రాంగద సింగ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈసినిమా అనుకున్నంతగా ఆడలేదు.
8. OG (తెలుగు)
ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ : 277.85 కోట్లు (హిట్)
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈసినిమాలో బాలీవుడ్ రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హష్మి విలన్ గా నటించి మెప్పించారు. ఈసినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించింది. ఈ యాక్షన్ థ్రిల్లర్‌కి సుజీత్ దర్శకత్వం వహించారు.
9. సితారే జమీన్ పర్ (హిందీ)
ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ : 267.52 కోట్లు (హిట్)
ఈ కామెడీ-డ్రామాను ఆర్.ఎస్. ప్రసన్న దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఆమిర్ ఖాన్, జెనీలియా డిసౌజా, డాలీ అహ్లువాలియా, గుర్పాల్ సింగ్ , బ్రిజేంద్ర కాలా నటించారు.
10. ఎంపురాన్ (మలయాళం)
ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్: 266.81 కోట్లు (సెమీ హిట్)
పృథ్వీరాజ్ సుకుమారన్ , టోవినో థామస్ నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రానికి పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు.
11. సంక్రాంతి కి వస్తున్నాం (తెలుగు)
ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ : 255.48 (బ్లాక్ బస్టర్)
వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ యాక్షన్ కామెడీ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా ఉపేంద్ర లిమాయే కూడా నటించారు.
12. గుడ్ బ్యాడ్ అగ్లీ (తమిళం)
ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్: 248.25 కోట్లు (హిట్)
ఈ తమిళ యాక్షన్ కామెడీ చిత్రానికి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. అజిత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించారు, ప్రియా ప్రకాష్ వారియర్, త్రిష కృష్ణన్ ,అర్జున్ దాస్ లతో పాటు సీనియర్ నటులు సందడి చేశారు.
13. రైడ్ 2 (హిందీ)
ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్: 237.46 కోట్లు (హిట్)
రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ లో అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రంలో రితేష్ దేశ్ ముఖ్, వాణి కపూర్, అమిత్ సియాల్ కూడా నటించారు.
14. తుడరుమ్ మలయాళం)
ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్: 235.38 కోట్లు (బ్లాక్ బస్టర్)
తరుణ్ మూర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించారు. ఇందులో శోభన, ప్రకాష్ వర్మ, ఫర్హాన్ ఫాజిల్ కూడా నటించారు.
15. కాంతారా ఛాప్టర్ 1 (కన్నడ)
ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్: 218 కోట్లు
రిషబ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ఈ కన్నడ చిత్రం పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటింది. "కాంతారా చాప్టర్ 1" ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 200 కోట్ల కలెక్షన్ మార్క్ ను దాటేసింది. ఈ పురాణ కాలపు పౌరాణిక యాక్షన్ డ్రామా మూవీలో రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య , జయరామ్‌లతో పాటు పలువురు సీనియర్ నటులు సందడి చేశారు.