- Home
- Entertainment
- Entertainment News
- `హరిహర`, `థగ్ లైఫ్`, `భైరవం`లను భయపెడుతున్న ఎగ్జిబిటర్లు.. మళ్లీ వాయిదా తప్పదా?
`హరిహర`, `థగ్ లైఫ్`, `భైరవం`లను భయపెడుతున్న ఎగ్జిబిటర్లు.. మళ్లీ వాయిదా తప్పదా?
జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల బంద్ ఇప్పుడు నిర్మాతలకు కలవరపెడుతుంది. ముఖ్యంగా `హరిహర వీరమల్లు`, `థగ్ లైఫ్`, `భైరవం` చిత్రాలకు పెద్ద దెబ్బగా మారబోతుంది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
థియేటర్ల బంద్ నిర్మాతల్లో టెన్షన్
తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లకి సంబంధించిన సమస్య ఇప్పుడు నిర్మాతలను భయపెడుతుంది. పర్సంటేజీ ప్రకారం తమకు కలెక్షన్లు ఇవ్వాలని ఎగ్జిబిటర్లు(థియేటర్ ఓనర్లు) డిమాండ్ చేస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్లు అందుకు ఒప్పుకోవడం లేదు. దీంతో జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు బంద్‌కి ఎగ్జిబిటర్లు పిలుపునిచ్చారు. ఇది నిర్మాతలకు తలనొప్పిగా మారింది. అంతేకాదు ఇదిప్పుడు జూన్‌లో రిలీజ్ కాబోతున్న సినిమాలకు పెద్ద దెబ్బగా మారబోతుంది.
`భైరవం` వాయిదా పడుతుందా?
మే 30న మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కలిసి నటించిన `భైరవం` మూవీ విడుదల కానుంది. అనుకున్నట్టు జూన్ 1న బంద్ కొనసాగితే, ఈ మూవీ ఒక్క రోజుతోనే ఆగిపోవాల్సి వస్తుంది. దీంతో వాయిదా పడే అవకాశాలున్నాయి. ఇది నిర్మాత కెకె రాధా మోహన్‌ని భయపెడుతుంది. దీనికి `నాంది` ఫేమ్ విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.
టెన్షన్‌లో రాజేంద్రప్రసాద్ మూవీ
దీంతోపాటు రాజేంద్రప్రసాద్, అర్చన, రూపేష్, ఆకాంక్ష సింగ్ కలిసి నటించిన `షష్టిపూర్తి` మూవీ సైతం మే 30న విడుదల కాబోతుంది. పవన్ ప్రభ దర్శకత్వంలో మా ఆయి ( MAA AAIE ) ప్రొడక్షన్స్ పతాకం పై రూపేష్ నిర్మించిన ఈ చిత్రం విడుదల విషయంలోనూ దైలామా నెలకొంది. థియేటర్ల సమస్య ఈ లోపు పరిష్కారం అయితే రిలీజ్ ఉంటుంది. లేదంటే వాయిదా తప్పదు.
కమల్ `థగ్ లైఫ్`కి తెలుగులో గట్టి దెబ్బ?
జూన్ 5న కమల్ హాసన్, మణిరత్నంలా `థగ్ లైఫ్` విడుదల కాబోతుంది. ఈ మూవీ తమిళంతోపాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళంలోనూ విడుదల చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కి విశేష స్పందన వచ్చింది. భారీ అంచనాలు నెలకొన్నాయి. థియేటర్ల బంద్ కంటిన్యూ అయితే ఈ మూవీకి తెలుగులో గట్టి దెబ్బే పడే ఛాన్స్ ఉంది. మరి ఇది వాయిదా వరకు వెళ్తుందా అనేది చూడాలి.
మరోసారి `హరిహర వీరమల్లు` వాయిదా పడుతుందా?
ఇక ప్రధానంగా బయటపెట్టేది పవన్ కళ్యాణ్ `హరిహర వీరమల్లు` మూవీని. ఈ చిత్రం ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఫైనల్‌గా జూన్ 12న విడుదల చేస్తామని టీమ్ ప్రకటించింది. జ్యోతికృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఏ ఎం రత్నం నిర్మాత కావడం విశేషం. బాబీ డియోల్, నిధి అగర్వాల్ ఇందులో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హిస్టారికల్ యాక్షన్ మూవీగా ఇది తెరకెక్కింది. పవన్ డిప్యూటీ సీఎం అయ్యాక ఆయన్నుంచి విడుదలవుతున్న తొలి చిత్రం `హరిహర వీరమల్లు` కావడం విశేషం. అంతేకాదు ఆయన మొదటిసారి ఇలాంటి హిస్టారికల్ మూవీ చేస్తున్నారు. దీంతో అంచనాలు బాగా ఉన్నాయి. కానీ థియేటర్ల బంద్ ఇప్పుడు ఈ మూవీని భయపెడుతుంది.
పవన్ మూవీని భయపెడుతున్న ఎగ్జిబిటర్లు
ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడిన నేపథ్యంలో ఇప్పుడైనా రిలీజ్ అవుతుందా? మళ్లీ వాయిదా పడుతుందా అనే ఆందోళనలో పవన్ ఫ్యాన్స్ లో నెలకొంది. మరి ఎగ్జిబిటర్లు ఏం చేస్తారనేది చూడాలి. అయితే థియేటర్లు ఓనర్లు మాత్రం ఈ సారి గట్టిగానే ఫిక్స్ అయ్యారట. తమ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు తగ్గకూడదని, థియేటర్ల బంద్ విషయంలో కచ్చితంగా ఉండాలని నిర్ణయించుకున్నారట. ఇదే ఇప్పుడు పై సినిమాలను కలవరపెడుతుంది. ఏం జరుగుతుందో అనేది ఉత్కంఠ నెలకొంది.