- Home
- Entertainment
- Entertainment News
- Devatha: జస్ట్ మిస్.. దేవుడమ్మ ముందుకు రుక్మిణి.. మాధవకు తృటిలో తప్పిన ప్రమాదం!
Devatha: జస్ట్ మిస్.. దేవుడమ్మ ముందుకు రుక్మిణి.. మాధవకు తృటిలో తప్పిన ప్రమాదం!
Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. చెల్లి కోసం భర్తను త్యాగం చేసిన మహిళ కథతో ప్రేక్షకుల ముందు వచ్చింది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు ఆగస్ట్ 8తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... మాధవ్,రుక్మిణి, దేవిని కారులో తీసుకువెళ్లి ఆదిత్య ఇంటిదగ్గర ఆపుతాడు. దేవి కారు దిగుతుం.ది రుక్మిణి మాత్రం కార్ దిగకుండా ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోమని మాధవ్ని అంటుంది. అప్పుడు మాధవ్ తెలివిగా, పాపం దేవి రమ్మంటుంటే వెళ్లవేంటి అని అంటాడు. ఈ లోగా దేవుడమ్మ ఎవరో కారాగింది అని బయటకు వస్తుంది. ఈ సారికి నువ్వు వెళ్ళు, తర్వాత మేను వస్తామని మాధవ్ అంటాడు. దేవిని లోపలికి వస్తుంది. అప్పుడు కార్ తిరిగి వెళ్ళిపోతుంది.ఇంతసేపు అయింది ఎందుకు కార్ దిగి లోపలికి రాడానికి? అని దేవుడమ్మ అడగగా, అమ్మానాన్న కూడా వచ్చారు కానీ మా అమ్మ లోపలికి రమ్మంటే ఏదో పని ఉంది అని చెప్పి వెళ్ళిపోయింది అని అంటుంది.
అప్పుడు దేవుడమ్మ అందరిని చూశాను గాని మీ అమ్మని మాత్రం చూడలేకపోయాను అని బాధపడుతూ లోపలికి తీసుకెళ్లి పోతుంది దేవిని. ఆ తర్వాత మాధవ్ రుక్మిణి నీ ని ఇంకో చోటికి తీసుకెళ్తాడు. అక్కడికి తీసుకెళ్లి నీ గురించి ఎవరికీ తెలియదు కాబట్టి నువ్వు ఇంత ధైర్యంగా ఉన్నావు. గత పదివేల నుంచి నీకు నాకు పెళ్లి కాకుండా ఒకే దగ్గర ఉంటున్నాము అని మీ అత్తకి తెలిస్తే నిన్ను ఒప్పుకుంటారా?అక్కడ ఉన్న నిజం కన్నా ఊరి వాళ్ళు అందరూ చెప్పే అబద్దానికే విలువ ఎక్కువ ఇస్తారు. నేను చెప్పడం అని కాదు నువ్వైనా ఆలోచించు అని రుక్మిణిని బెదిరిస్తాడు మాధవ్. అందుకే జనం చెప్పే అబద్దాన్ని నిజం చేసి నువ్వు నాతో శాశ్వతంగా ఉండిపోవాలి.ఇప్పుడు నువ్వు సరే అంటే దేవి మనసులో వాళ్ళ నాన్న మీద ఉన్న ద్వేషాన్ని నేనే స్వయంగా తీర్చేస్తాను. వాళ్ళ నాన్న వాళ్ళ ఇంటికి దేవిని ఆనందంగా పంపుతాను అని అంటాడు మాధవ్.
అప్పుడు రుక్మిణి కోపంతో కార్ నడుపు ఒక్కతే వెళ్ళిపోతుంది. కోపంతో ఇంత పద్ధతిగా చెప్పిన వినట్లేదు ఇంక నేను నా దారిలో నుంచి వెళ్లాలి అని అనుకుంటాడు మాధవ్. దాని తర్వాత దేవి దేవుడమ్మతో ఇంట్లోకి వచ్చి అలా ఇల్లంతా చూస్తూ ఉంటుంది.అప్పుడు దేవుడమ్మ మాతో మాట్లాడడానికి వచ్చి ఇల్లు చూస్తున్నావ్ ఏంటి? అని అంటుంది. నేను ఆఫీసర్ తో మాట్లాడడానికి వచ్చాను కానీ ఆయన లేరు కదా అందుకే ఇల్లు చూస్తున్నాను అని అంటుంది దేవి. అప్పుడు దేవుడమ్మ ఇంతకుముందు వచ్చేటప్పుడు మా అందరితో చాలా బాగా మాట్లాడే దానివి. ఇప్పుడు అసలు అలజడే లేకుండా పోతుంది అని అంటుంది. లేదు ఇప్పుడు కూడా మీతో మాట్లాడుతున్నాను కదా అని దేవి అనగా సత్య అక్కడికి వస్తుంది.
నవ్వుతూ పలకరిస్తూ ఎంతసేపు అవుతుంది వచ్చి అని సత్య అడగగా దేవుడమ్మ, ఇందాకే వచ్చింది, వాళ్ళ అమ్మ నాన్నలు కూడా వచ్చారంట కానీ వాళ్ళ అమ్మని చూడడం ఇప్పుడు కూడా కుదరలేదు అని దేవుడమ్మ సత్యతో అంటుంది. రుక్మిణి ఇక్కడికి వచ్చింది అని సత్య ఆశ్చర్య పోతుంది. అప్పుడు దేవుడమ్మ, వాళ్ళ అమ్మకి మనల్ని చూడడం ఇష్టం లేదేమో ఎప్పుడు చూడాలనుకున్న తప్పించుకుంటుంది అని అంటుంది. దేవిని లోపలికి తీసుకుని వెళ్ళు ఏవైనా తినడానికి ఇవ్వు. ఈలోగా ఆదిత్య వస్తాడు కదా! అని అంటుంది దేవుడమ్మ.
అప్పుడు సత్య దేవిని లోపలికి తీసుకువెళ్లి తినడానికి ఏమైనా తెస్తాను ఇక్కడ కూర్చో అని తన గదిలో కూర్చోపెడుతుంది. అప్పుడు దేవి గదిలో ఆదిత్య, సత్య ఫోటో చూసి మా అమ్మ నాన్నలు కూడా ఇలా ఒక ఫోటో తీసుకుంటారు కదా కానీ మా అమ్మ ఎందుకు నాకు చెప్పడానికి సంకొసిస్తుంది అని అనుకుంటది. ఈలోగా పక్కనే ఉన్న ఆ ఫోన్ కవర్ని చూసి ఇలాంటి ఫోనే అమ్మ దగ్గర ఉంది కదా! ఆఫీసర్ సార్ దగ్గర కూడా ఉందా? అని ఆ ఫోన్ కవర్ తీస్తున్న సమయంలో సత్య అక్కడికి వస్తే అది ఉట్టి కాలీ డొక్కు అని అంటుంది. అచ్చు ఇలాంటి ఫోనే మా అమ్మ దగ్గర కూడా ఉంది అని దేవి అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాత భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!