- Home
- Entertainment
- Entertainment News
- Intinti gruhalakshmi: లాస్య, నందులకు ఇన్‌డైరెక్ట్‌గా చుక్కలు చూపిస్తున్న తులసి.. సామ్రాట్ ఇంట్లో పార్టీ!
Intinti gruhalakshmi: లాస్య, నందులకు ఇన్‌డైరెక్ట్‌గా చుక్కలు చూపిస్తున్న తులసి.. సామ్రాట్ ఇంట్లో పార్టీ!
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు ఆగస్ట్ 3వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..

ఎపిసోడ్ ప్రారంభంలోనే.... తులసి తన ఇంటి బయట సంగీతం సాధన చేస్తూ ఉంటుంది. ఈ లోగ నందు అక్కడికి వస్తాడు. తులసి నందుని చూసి ,ఈ సమయంలో రావడం ఏంటి పైగా పక్కన లాస్య కూడా లేదు అని అనుకుంటుంది. ఎందుకు వచ్చారు? అని అడగగా,నీతోనే మాట్లాడడానికి వచ్చాను అని నందు అంటాడు. విషయం ఏంటి అని అడిగితే నందు చెప్పడానికి తలబడతాడు. విడాకులు ముందులేని ఆలోచన అంతా అయిపోయిన తర్వాత ఎందుకు అని ఏమెంటో చెప్పమంటుంది తులసి.
అప్పుడు నందు "నేను నీ మాజీ భర్త అనే విషయం సామ్రాట్ వాళ్ళకి చెప్పొద్దు" అని చెబుతాడు. తులసి నవ్వుకుంటూ "ఒకప్పుడు నేను మీ భార్య అని చెప్పుకోవద్దు అని చెప్పేవారు ఇప్పుడు అంతా తారుమారు అయింది, నా అంతట నేను ఎవరికీ నిజం చెప్పను. కానీ ఒకవేళ నన్ను వాళ్ళు అడిగితే అబద్ధం మాత్రం చెప్పను" అని చెప్పి అక్కడ నుంచి తులసి వెళ్ళిపోతుంది. తర్వాత సీన్లో హనీ ,సామ్రాట్ కి బట్టలు సెలెక్ట్ చేస్తుంది.
ఈలోగ తులసి వాళ్ళు సామ్రాట్ వాళ్ళ ఇంటికి వస్తారు. దారిలో తులసి,నందు తన మాజీ భర్తని ఎవరికీ తెలియకూడదు అని ఇంట్లో వాళ్ళందరికీ చెబుతుంది. ఈ లోగా తులసి వాళ్ళు వచ్చారని హాని పరిగెత్తుకుంటూ వాళ్ళ వద్దకు వెళుతుంది. సామ్రాట్ వాళ్ళు బాబాయి గొడవ జరిగిన సరే, మంచి మనసుతో వచ్చారు అని అంటారు. అప్పుడు తులసి, కొంతమందికి తప్పు చేశామని నిజం ఒప్పుకోవడానికి అహంకారం అడ్డొస్తుంది. అలాంటి వాళ్లతోనే సమస్య అని అనగా నందు లాస్యలు అదే సమయంలో అక్కడికి వస్తారు.
అక్కడ లాస్య నందులు అన్న కొన్ని మాటలకి ఇంట్లో వాళ్ళందరూ తిరగబడతారు. ఆ,అర్థమయ్యి, అర్థం కాని సంఘటనను చూసి సామ్రాట్ ఆలోచనలలో పడతాడు. ఈలోగా సామ్రాట్ వంట చేయడానికి వెళతాడు మీరు వంట చేస్తారా? అని తులసి అనగా,మా సామ్రాట్ వంట చాలా బాగుంతుంది అని సామ్రాట్ వాళ్ళ బాబాయ్ అంటారు. అప్పుడు లాస్య గొప్పలకు పోయి నందు కి కూడా వంట బాగా వచ్చు అని అనగా, సామ్రాట్ అయితే ఈ రోజు మేమిద్దరం వంట చేసేస్తాము అని అంటాడు.
అప్పుడు నందుకు ఏం చేయాలో అర్థం కాదు. ఈలోగా లాస్య, అయితే కుటుంబం అంతా రెండు టీములుగా విడిపోయి వంటలు చేద్దాము అని చెబుతుంది. ఎవరెవరు ఏ వంటకాలు చేయాలో డిసైడ్ చేసుకొని వంట మొదలుపెడతారు. తులసి,లాస్య ఇద్దరూ జడ్జ్ లు గా ఉంటారు.ఇంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది. తరువాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే, రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!!