MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Entertainment News
  • Janaki kalaganaledu: విష్ణు మనసు మార్చిన మల్లిక.. జానకి ఐపీఎస్ చదువు ఆపేందుకు ప్రయత్నాలు!

Janaki kalaganaledu: విష్ణు మనసు మార్చిన మల్లిక.. జానకి ఐపీఎస్ చదువు ఆపేందుకు ప్రయత్నాలు!

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ తెలుగు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఐపీఎస్ కలను నిజం చేసుకునేందుకు అత్తవారింట్లో జానకి పడే కష్టాలే ఈ సీరియల్ కాన్సెప్ట్. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు ఆగస్ట్ 8తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం.. 

2 Min read
Author : Navya G
Published : Aug 08 2022, 02:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... జ్ఞానాంబ జానకికి తన షరతులని చెబుతుంది. ఈ షరతులు అన్నిటికీ ఒప్పుకుంటేనే నీకు చదువుకోడానికి నేను అనుమతిని ఇస్తాను అని అంటుంది.సరే అని జానకి అనగా, రామా ఈ షరతులకి లోబడి ఉండడం చాలా కష్టం అని జానకిని ఆపుతాడు. కానీ జానకి, నేను అన్నీ ఆలోచించుకుని నిర్ణయం తీసుకున్నాను అని అంటుంది. అప్పుడు జ్ఞానం, జానకి చేయి పట్టుకొని దేవుడి దగ్గరకు తీసుకెళ్ళి ఐదు అంకెలు రాసి నేను నీకు అయిదు అవకాశాలు ఇస్తున్నాను. అయిదు అవకాశాలు అయిపోయిన తర్వాత నేను ఏం చెప్తే అది నువ్వు చేయాలి అని అంటుంది జ్ఞానం. 

25

ఆ తర్వాత సీన్లో ఆ షరతుల గురించి రామా ఆలోచించుకుంటూ గదిలో కూర్చుని ఉంటాడు. అప్పుడు జానకి ఆనందంగా అక్కడికి వస్తుంది. దాని గురించి ఇంకా ఆలోచించొద్దు రామ గారు. ఒక సుఖం కావాలంటే ఎన్నో కష్టాలు పడాలి.అలాగే మనకు విజయం కావాలంటే ఎన్నో బాధలు దాటుకొని వెళ్ళాలి. దాని ముందు ఇదో అంత పెద్దదేమీ కాదు అని రామా కి ధైర్యం చెబుతుంది.అప్పుడు ఇద్దరూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటారు.

35

ఆ తర్వాత సీన్లో మల్లికా విష్ణుతో, మీ అమ్మగారికి నీ కన్నా మీ అన్నయ్య గారు అంటేనే ఇష్టము. అందుకే జానకిని ఐపీఎస్ చదవడానికి ఒప్పుకున్నారు. జానకి ఐపీఎస్ అయితే అప్పుడు మీ అన్నయ్యకి ఎంతో మర్యాద ఇస్తారు. అప్పుడు వాళ్ళిద్దరూ షికారులకు వెళ్తారు. పట్నంలో కారులో తిరుగుతారు. ఎంతో విలాసపూరితమైన జీవితాన్ని అనుభవిస్తారు. కానీ మనం మాత్రం చీరలు అమ్ముకుంటూనే మన జీవితాన్ని గడిపేయాలి. 

45

అందుకే మీ అమ్మగారు జానకిని ఐపీఎస్ చదవడానికి ఒప్పుకున్నారు అని విష్ణుని ఆలోచింపజేస్తుంది మల్లిక.దాని తర్వాత సీన్లో తర్వాత రోజు ఉదయం జానకి రామ లేచి చూసేసరికి ఆ గదిలో జానకి పుస్తకాలు కనబడవు. ఆ పుస్తకాలు ఏవి అని గదిలో వెతుకుతూ ఉండగా మల్లిక పుస్తకాలను తీసి పూజ సామాన్లు ఉన్న చోటా ఆ పుస్తకాలను పెడ్తుంది. పూజ సామాన్లను కావాలని కింద పడేసి వెళ్ళిపోతుంది. ఈ విషయంలో జానకి నీ ఇరికించేస్తాను. 

55

అప్పుడు అత్తయ్య ఐపిఎస్ చదవడానికి ఒప్పుకోరు అని మనసులో అనుకుంటుంది మల్లిక. జ్ఞానాంబ అక్కడికి వచ్చి చూసి పూజ సామాన్లు కింద పడిపోయి ఉన్నాయి  ఏంటి? అని తలుపు తీసేసరికి అక్కడ జానకి పుస్తకాలు ఉంటాయి. కోపంతో జానకి! అని పిలుస్తుంది జ్ఞానం. ఇంట్లో వాళ్ళందరూ అక్కడికి వస్తారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
Recommended image2
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?
Recommended image3
53 ఏళ్ల టాలీవుడ్ హీరోయిన్ తో 29 ఏళ్ల యంగ్ హీరో రొమాన్స్, ఎవరా స్టార్స్, ఏంటా సినిమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved