ఈ చిన్నారి ఎవరో గుర్తు పట్టారా.? పవన్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ..
Actress: సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత అభిమానులకు, సినీతారలకు మధ్య దూరం తగ్గుతోంది. సెలబ్రిటీలు నేరుగా ఫ్యాన్స్‌తో మాట్లాడే రోజులు వచ్చేశాయ్. తమ అభిరుచులు, ఇష్టాలతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను పంచుకుంటున్నారు. ఇక సినీ తారల చిన్ననాటి ఫొటోలు కూడా నెట్టింట ఇటీవల ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా అలాంటి ఓ ఫొటోనే వైరల్ అవుతోంది..
సినీ తారల చిన్ననాటి ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పుడు ఇదొక ట్రెండ్‌గా నడుస్తోంది. మరీ ముఖ్యంగా హీరోయిన్స్ స్వయంగా తామే తమ చిన్ననాటి ఫొటోలను అభిమానులతో పంచుకుంటున్నారు. తాము చిన్న తనంలో ఎలా ఉన్నామో చెబుతూ మురిసిపోతున్నారు. పైన ఫొటోలో కనిపిస్తోన్న చిన్నారి కూడా ఒక టాప్ హీరోయిన్ అనే విషయం మీకు తెలుసా.? ఇంతకీ ఈ చిన్నారి ఎవరో గుర్తు పట్టారా.?
మొదటి సినిమాతోనే తెలుగులో మంచి పేరును సంపాదించుకున్న ఈ చిన్నది అనతికాలంలోనే నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. తెలుగులో నటించిన సినిమాలన్నీ విజయాన్ని అందుకున్నాయి. అయితే తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తోంది. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.? పవన్ హీరోగా వచ్చిన భీమ్లా నాయక్ మూవీలో రానాకు జోడిగా నటించింది. ఈపాటికే ఈ హీరోయిన్ ఎవరో మీకు ఓ ఐడియా వచ్చే ఉంటుంది కదూ! అవును ఈ నటీమణి మరెవరో కాదు అందాల సంయుక్త మీనన్.
తొలి చిత్రం..
2016లో వచ్చిన పాప్‌కార్న్ అనే మలయాళ మూవీతో వెండి తెరకు పరిచయమైన ఈ కేరళ కుట్టీ ఆ తర్వాత మలయాళంతో పాటు తమిళంలో వరుస సినిమాల్లో నటించింది. ఇక 2022లో భీమ్లా నాయక్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాలో తన అద్భుత నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత వెంటనే బింబిసార చిత్రంతో మరో బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఇక సార్ మూవీతో హ్యాట్రిక్ కొట్టిన సంయుక్త డేవిల్ మూవీతో ప్రేక్షకులను మెప్పించింది. ఇక అటు సాయి ధరమ్ తేజ్ హీరోగా కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన ‘విరూపాక్ష’ మూవీతో ప్రేక్షకులను భయపెట్టింది.
వరుస సినిమాలతో..
ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస సినిమాలతో బిజీగా ఉంది. తెలుగుతో స్వయంభుతో పాటు టైటిల్ ఖరారు కానీ మరో మూడు సినిమాల్లో నటిస్తోంది. అలాగే మలయాళంలో ఒకటి, హిందీలో మరో చిత్రంతో పాన్ ఇండియా హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది. తక్కువ సినిమాల్లో నటించినా తెలుగులో స్టార్ హీరోయిన్ హోదాను సొంతం చేసుకున్న సంయుక్త సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన లేటెస్ట్ ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది.
ఇదీ సంయుక్త నేపథ్యం..
సంయుక్త మీనన్ నేపథ్యం విషయానికొస్తే. 1995 సెప్టెంబర్ 11వ తేదీన పాలక్కడ్‌లో జన్మించింది. ఎకానమిక్స్‌లో డిగ్రీ పూర్తి చేసిన సంయుక్త ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం అన్ని భాషల్లో నటిస్తూ మెప్పిస్తోంది. సంయుక్త నటనకు పలు అవార్డులు వరించాయి. కేరళ ఫిలిమ క్రిటిక్స్ అసోసియేష్ అవార్డ్‌తో పాటు విరూపాక్ష మూవీకిగాను ఉత్తమ నటిగా సంతోషం ఫిల్మ్ అవార్డును గెలుచుకుందీ చిన్నది.