బార్బీ డాల్‌గా మారిన ధనశ్రీ వర్మ.. విండీస్ టూర్‌లో యజ్వేంద్ర చాహాల్ బిజీగా ఉండడంతో...
మిగిలిన క్రికెటర్ల భార్యలతో పోలిస్తే సోషల్ మీడియాలో తెగ యాక్టీవ్‌గా ఉంటుంది యజ్వేంద్ర చాహాల్ భార్య ధనశ్రీ వర్మ. ఓ రకంగా ఆమెపై ఈ మధ్య కాలంలో తీవ్రమైన ట్రోలింగ్ రావడానికి ఇది కూడా కారణం. యజ్వేంద్ర చాహాల్, ధనశ్రీ వర్మ విడాకులు తీసుకోబోతున్నారని కూడా టాక్ వినబడింది..
వెస్టిండీస్‌తో సిరీస్‌కి ముందు ఈ ఇద్దరూ కలిసి ఓ టాక్ షోతో కనిపించారు. ఈ షోలో విడాకుల రూమర్లపై స్పందించకపోయినా తమ లవ్‌స్టోరీ, వివాహం గురించి విషయాలను పంచుకున్నారు. దీంతో ఈ ఇద్దరి విడాకుల రూమర్లకు చెక్ పడింది..
ట్రెండ్‌కి తగ్గట్టుగా గ్లామర్‌ని మెయింటైన్ చేసే ధనశ్రీ వర్మ, ఒంటరిగా మాల్దీవుల్లో హాలీడేస్ గడిపి వచ్చింది. అక్కడ దిగిన బికినీ ఫోటోలను పోస్ట్ చేసి సోషల్ మీడియాని షేక్ చేసింది. తాజాగా బార్బీ గర్ల్ లుక్‌లో మెరిసిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ధనశ్రీ వర్మ...
‘నా బార్బీ వరల్డ్‌లో నేను బార్బీని’ అనే అర్థం వచ్చేలా కాప్షన్ జోడించింది ధనశ్రీ వర్మ. భార్య ఫోటోలపై యజ్వేంద్ర చాహాల్ ఫన్నీగా కామెంట్ చేశాడు...
‘బార్బీ వరల్డ్...’ అంటూ లవ్ అండ్ కిస్ ఎమోజీలు జోడించిన యజ్వేంద్ర చాహాల్, జెట్ ల్యాగ్ కామెంట్ అంటూ ధనశ్రీ వర్మను ట్రోల్ చేశాడు. ధనశ్రీ వర్మ సూపర్ హాట్ ఫోటోలకు లక్షల్లో లైక్స్, వేలల్లో కామెంట్స్ వచ్చేశాయి..
హీరోయిన్లకు తగ్గకుండా చిట్టి పొట్టి దుస్తుల్లో అందాల ప్రదర్శన చేసే ధనశ్రీ వర్మ, ఈసారి బార్బీ గర్ల్ లుక్‌లో కనిపించినా గ్లామర్ డోస్ తగ్గించడంతో ఆమె డై హార్ట్ ఫ్యాన్స్ తెగ ఫీలైపోతున్నారు..
కొన్నాళ్ల కిందట ధనశ్రీ వర్మ, శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి కొన్ని పార్టీలకు, ఫంక్షన్లకు హాజరైంది. యజ్వేంద్ర చాహాల్ లేకుండా ఈ ఇద్దరూ క్లోజ్‌గా మూవ్ అవ్వడంతో ధనశ్రీపై తీవ్రమైన ట్రోలింగ్ వచ్చింది..