Abhishek Sharma: యువరాజ్ సింగ్ కోరిక అదే.. సెంచరీ తర్వాత పెద్ద రహస్యం చెప్పాడు !
Abhishek Sharma: ఇంగ్లాండ్ తో జరిగిన ఐదో టీ20 ఇంటర్నేషనల్‌లో అభిషేక్ శర్మ సెంచరీతో అనేక రికార్డు బద్దలు కొట్టాడు. తన సెంచరీ తర్వాత తన కోచ్ యువరాజ్ సింగ్ కోరున్న విషయం అంటూ పెద్ద రహస్యాన్ని రివీల్ చేశాడు.

yuvraj singh and abhishek sharma
Abhishek Sharma: ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్ తో జరిగిన ఐదవ, చివరి T20Iలో భారత స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ 54 బంతుల్లో 135 పరుగులతో సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. ఫోర్లు, సిక్సర్లు బాదుతూ గ్రౌండ్ ను హోరెత్తించాడు. టీ20 క్రికెట్ లో రెండో వేగవంతమైన సెంచరీ కొట్టిన భారత ప్లేయర్ గా నిలిచాడు.
అలాగే, ఒక T20I ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఆటగాడిగా రికార్డు సాధించాడు. అంతకుముందు ఈ రికార్డు కలిగిన రోహిత్ శర్మ, సంజూ శాంసన్ ను అధిగమించాడు. ఈ ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు, 13 సిక్సర్లు బాదాడు అభిషేక్ శర్మ.

తన సెంచరీపై అభిషేక్ శర్మ ఏం చెప్పాడంటే?
ఇంగ్లాండ్ తో జరిగిన ఐదవ టీ20 మ్యాచ్ లో తన సూపర్ సెంచరీతో భారత్ కు విజయాన్ని అందంచడమే కాకుండా పలు రికార్డులు సాధించిన అభిషేక్ శర్మ.. తాను భారత కోచ్, కెప్టెన్ ధనాధన్ బ్యాటింగ్ వైఖరితో ఆటను కొనసాగించాలని ఆశిస్తున్నట్లు చెప్పాడు. అదే విధంగా తన ఆగను ముంబైలో కొనసాగించానని తెలిపాడు. ఈ క్రమంలోనే అభిషేక్ ఒక పెద్ద రివీల్ చేసాడు.
తన కోచ్ భారత మాజీ స్టార్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ఎప్పటినుంచో ఇలాంటిది కోరుకున్నాడనీ, ఈ రోజు తాను దాన్ని చేశానని అభిషేక్ శర్మ చెప్పాడు. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అభిషేక్ ఇన్నింగ్స్ 54 బంతుల్లో 135 పరుగులు చేయడంతో భారత జట్టు 9 వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసింది. ఆ తర్వాత భారత బౌలర్ల విజృంభణతో ఇంగ్లాండ్ కేవలం 10.3 ఓవర్లలో 97 పరుగులకే ఆలౌట్ అయింది. భారత్ 150 పరుగుల భారీ విజయాన్ని అందుకుంది.
ఈ రోజు నాది అందుకే ఈ భారీ ఇన్నింగ్స్.. అభిషేక్ శర్మ
భారత్ తరఫున టీ20 క్రికెట్ అతిపెద్ద ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్ శర్మ తన రికార్డు సెంచరీపై మాట్లాడుతూ.. 'ఈ రోజు నా రోజు, కాబట్టి నేను మొదటి నుంచి బంతిపై అటాక్ చేయడం ప్రారంభించాను. నా ఆటతీరుకు మద్దతుగా నిలిచిన కోచ్‌కి, కెప్టెన్‌కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా నుంచి వారు అదే వైఖరిని ఆశిస్తున్నారు. వారు ఎప్పుడూ నాకు మద్దతుగా ఉన్నారు. అలాగే, యూవీ ఎప్పుడూ తన వెంటే ఉన్నారని' చెప్పాడు. అభిషేక్ తన ఇన్నింగ్స్‌లో 13 సిక్సర్లు కొట్టాడు, ఇది భారత్ తరపున T20 అంతర్జాతీయ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు.
Image Credit: Getty Images
ఆర్చర్ బౌలింగ్ లో కొట్టిన షాట్‌ల గురించి అభిషేక్ మాట్లాడుతూ..
'ఇది ప్రత్యేకం, దేశం బాగా రాణిస్తుందన్న భావన ఎప్పుడూ ప్రత్యేకమే' అని అన్నారు. ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌పై సులువుగా సిక్సర్ కొట్టడం గురించి అడిగినప్పుడు, 'ప్రత్యర్థి జట్టు బౌలర్లు 140 లేదా 150 (గంటకు కిలోమీటర్లు) కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేస్తున్నప్పుడు, మీరు కొంచెం ముందుగానే సిద్ధం కావాలి. అటువంటి పరిస్థితిలో, బంతికి స్పందించి మీ షాట్ ఆడండి. మీరు ప్రపంచ స్థాయి బౌలర్‌ను (ఆర్చర్) కవర్‌పై కొట్టినప్పుడు చాలా గొప్పగా అనిపిస్తుంది. అయితే, ఆదిల్ రషీద్‌పై షాట్‌లు కూడా నాకు బాగా నచ్చాయని' చెప్పాడు.
Abhishek Sharma, Team India, Cricket
యువరాజ్ సింగ్ గురించి అభిషేక్ శర్మ ఏం చెప్పాడంటే?
తన మెంటార్, భారత దిగ్గజ బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్ తన ఇన్నింగ్స్‌తో సంతోషిస్తాడని అభిషేక్ చెప్పాడు. 'అతను (యువరాజ్ సింగ్) బహుశా ఈరోజు సంతోషంగా ఉంటాడు. అతను ఎప్పుడూ నన్ను 15, 20 ఓవర్ల వరకు బ్యాటింగ్ చేయాలనుకున్నాడు. నేను అలా చేయడానికి ప్రయత్నించానని' చెప్పాడు.
ఇక సిరీస్‌లో 14 వికెట్లు తీసి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా ఎంపికైన వరుణ్ చక్రవర్తి.. ఈ అవార్డును తన భార్య, కొడుకు, తల్లిదండ్రులకు అంకితమిచ్చాడు. 'ఈ ప్రదర్శనతో నేను సంతోషంగా ఉన్నాను కానీ సంతృప్తి చెందలేదు. ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. ఈ అవార్డును నా భార్య, కొడుకు, తల్లిదండ్రులకు అంకితమిస్తున్నాను' అని అన్నారు.

