యూసఫ్ పఠాన్ నయా ఇన్నింగ్స్... తమ్ముడు ఇర్ఫాన్ పఠాన్ దారిలోనే ఆ లీగ్‌లో...
అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన భారత మాజీ ఆల్‌రౌండర్ యూసఫ్ పఠాన్, సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టేందుకు ఆసక్తిగా ఉన్నాడు. రిటైర్మెంట్ తర్వాత యూసఫ్ పఠాన్ తమ్ముడు ఇర్ఫాన్ పఠాన్ లంక ప్రీమియర్ లీగ్‌లో పాల్గొన్నాడు. ఇప్పుడు అన్న కూడా తమ్ముడిదారిలోనే నడవబోతున్నాడు..

జూలై 30 నుంచి ప్రారంభమయ్యే లంక ప్రీమియర్ లీగ్‌కి యూసఫ్ పఠాన్, రిజిస్టర్ చేయించుకున్నాడు. యూసఫ్ పఠాన్‌తో పాటు బంగ్లా ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్లు బెన్ కట్టింగ్స్, జేమ్స్ ఫాల్కనర్, సౌతాఫ్రికా కెప్టెన్ టెంబ భువుమా కూడా ఎల్‌పీఎల్ సీజన్2లో పాల్గొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

వీరితో పాటు మిచెల్ మెక్‌లగాన్, నికోలస్ పూరన్, మహ్మదుల్లా, రూథర్‌ఫర్ట్, రవి రాంపాల్, డేవిడ్ వీస్, ఫర్గూసన్ వంటి ప్లేయర్లు కూడా లంక ప్రీమియర్ లీగ్‌లో పాల్గొనబోతున్నట్టు సమాచారం.

తమ్ముడు ఇర్ఫాన్ పఠాన్‌లాగే జట్టులో స్థానం కోసం ఎన్నో ఏళ్లు ఎదురుచూసిన యూసఫ్ పఠాన్, ఈ ఏడాది ఆరంభంలోనే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు.

ఇర్ఫాన్ పఠాన్, గత సీజన్‌లో క్యాండీ టస్కర్స్ జట్టు తరుపున ఆడాడు. అన్నతో పాటే ఇర్ఫాన్ పఠాన్ కూడా ఇప్పుడు సెలక్షన్‌కి అందుబాటులో ఉండబోతున్నాడు.

భారత ఆల్‌రౌండర్ యూసఫ్ పఠాన్, 38 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించాడు. టీమిండియా తరుపున 57 వన్డేలు ఆడిన యూసఫ్ పఠాన్, 810 పరుగులు చేసి 33 వికెట్లు పడగొట్టాడు. ఇందులో రెండు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

22 టీ20 మ్యాచులు ఆడిన యూసఫ్, 236 పరుగులతో పాటు 13 వికెట్లు తీశాడు. 2007 టీ20 వరల్డ్‌కప్‌లో, 2011 వన్డే వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో సభ్యుడైన యూసఫ్ పఠాన్... న్యూజిలాండ్‌పై, సౌతాఫ్రికాపై జరిగిన మ్యాచుల్లో ఒంటి చేత్తో మ్యాచులు గెలిపించాడు.

ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరుపున ఆడిన యూసఫ్ పఠాన్, తొలి సీజన్‌లో 435 పరుగులు, 8 వికెట్లు తీసి, ఆర్ఆర్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు యూసఫ్ పఠాన్...

ఐపీఎల్ మూడో సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌కి వైస్ కెప్టెన్‌గా వ్యవహారించిన యూసఫ్ పఠాన్, ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 37 బంతుల్లోనే సెంచరీ బాదాడు. వరుసగా 11 బౌండరీలు బాది, రికార్డు క్రియేట్ చేశాడు యూసఫ్ పఠాన్...

నాలుగు వరుస సిక్సర్లు, ఆ తర్వాత రెండు ఫోర్లు, సిక్సర్, మళ్లీ వరుసగా నాలుగు ఫోర్లతో సెంచరీ బాది, ఐపీఎల్ చరిత్రల్లోనే ఫాస్టెస్ట్ సెంచరీ క్రియేట్ చేశాడు యూసఫ్ పఠాన్...

12 సీజన్ల పాటు ఐపీఎల్‌లో కొనసాగిన యూసఫ్ పఠాన్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల తరుపున ఆడాడు. 2020 సీజన్‌కి ముందు యూసఫ్ పఠాన్‌ను విడుదల చేసింది సన్‌రైజర్స్.

2020 వేలంలో అమ్ముడుపోని యూసఫ్ పఠాన్, తొలిసారి ఐపీఎల్ సీజన్‌ను మిస్ అయ్యాడు. 2021 మినీ వేలంలో పాల్గొనని యూసఫ్ పఠాన్, రంజీ ట్రోఫీలో 18 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదాడు...

తమ్ముడు ఇర్ఫాన్ పఠాన్‌తో కలిసి అనేక మ్యాచుల్లో అద్వితీయ విజయాలు అందించిన యూసఫ్ పఠాన్, తమ్ముడిలాగే ఫామ్ కోల్పోయి జట్టులో చోటు కోల్పోయాడు.

మార్చి 30, 2012న సౌతాఫ్రికాపై జరిగిన టీ20 మ్యాచులో చివరగా అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన యూసఫ్ పఠాన్, ఎనిమిదేళ్ల తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాడు.

యూసఫ్ పఠాన్ తమ్ముడు ఇర్ఫాన్ పఠాన్ గత ఏడాది క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించాడు. టీమిండియా తరుపున ఒకేసారి ప్రాతినిథ్యం వహించిన పఠాన్ బ్రదర్స్‌గా విశేష ఆదరణ దక్కించుకున్న ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్ కెరీర్ ఆరంభించినంత ఘనంగా వీడ్కోలు పలకలేకపోయారు.

రోహిత్ శర్మ 18, మహేంద్ర సింగ్ ధోనీ 17 తర్వాత ఐపీఎల్ కెరీర్‌లో అత్యధిక ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు గెలిచిన భారత క్రికెటర్‌గా నిలిచాడు యూసఫ్ పఠాన్. యూసఫ్ పఠాన్ ఐపీఎల్ కెరీర్‌లో 16 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.