- Home
- Sports
- Cricket
- ఐపీఎల్‌లో రెస్ట్ కావాలని ఎవ్వడూ అనడేంటి... విండీస్ టూర్‌లో సీనియర్లకు రెస్ట్ ఇవ్వడంపై..
ఐపీఎల్‌లో రెస్ట్ కావాలని ఎవ్వడూ అనడేంటి... విండీస్ టూర్‌లో సీనియర్లకు రెస్ట్ ఇవ్వడంపై..
ఐపీఎల్ 2022 సీజన్ తర్వాత భారత జట్టు మూడు సిరీసులు ఆడితే అందులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా వంటి సీనియర్లు ఆడింది ఒక్కటంటే ఒకే సిరీస్. మళ్లీ వెస్టిండీస్‌తో సిరీస్‌కి ఈ ప్లేయర్లు దూరంగా ఉంటున్నారు...

ఇంగ్లాండ్ టూర్‌లో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస ఆడబోతోంది భారత జట్టు. ఈ పర్యటనలో వన్డే సిరీస్‌కి ఇప్పటికే జట్టును ప్రకటించింది భారత క్రికెట్ బోర్డు...
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రిత్ బుమ్రా, రిషబ్ పంత్ వంటి సీనియర్లు అందరూ రెస్ట్ ఇవ్వడంతో ఈ వన్డే సిరీస్‌కి సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు... ఈ ఏడాది భారత జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించబోతున్న ఏడో ప్లేయర్‌గా నిలవబోతున్నాడు శిఖర్ ధావన్..
ఇంగ్లాండ్‌తో టెస్టు, వన్డే, టీ20 సిరీస్ ఆడిన విరాట్ కోహ్లీ, జస్ప్రిత్ బుమ్రా... వన్డే, టీ20 సిరీస్ ఆడిన రోహిత్ శర్మ... వెస్టిండీస్‌తో జరిగే వన్డే సిరీస్ నుంచి రెస్ట్ తీసుకోవడంపై తీవ్రంగా స్పందించాడు భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్..
‘ప్లేయర్లు ఇలా రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఎవ్వరూ కూడా ఐపీఎల్ సమయంలో రెస్ట్ కావాలని అడగరు? అలాంటప్పుడు టీమిండియాకి ఆడేటప్పుడు మాత్రం రెస్ట్ కావాలా?
భారత జట్టుకి ఆడేటప్పుడు ప్రతీ మ్యాచ్‌కీ అందుబాటులో ఉండాలి. రెస్ట్ గురించి మాట్లాడకూడదు. అదీకాకుండా ఇప్పుడు ఎక్కువగా ఆడేది టీ20 మ్యాచులే. 20 ఓవర్ల ఇన్నింగ్స్‌లు ఆడినందుకు అంతగా అలిసిపోతున్నారా?
టెస్టు మ్యాచులు ఆడితే శరీరంపై ఒత్తిడి పడుతుంది. రోజంతా ఫీల్డింగ్ చేయడం వల్ల అలిసిపోతాం. టీ20 క్రికెట్‌లో గంటన్నర, రెండు గంటలు క్రీజులో ఉండడానికే అంత అలిసిపోతున్నారా...
Image credit: Getty
బీసీసీఐ ఇలా సీనియర్లకు విశ్రాంతి ఇచ్చే పద్ధతి మానుకుంటే బెటర్. గ్రేడ్ 1 ప్లేయర్లు మంచి పారితోషికం అందుకుంటున్నారు. ప్రతీ మ్యాచ్‌కి కలిపి డబ్బులు తీసుకుంటున్నారు...
అలాంటప్పుడు ఏ కంపెనీ అయినా డబ్బులు చెల్లిస్తే వారికి నెలకు ఇన్నిసార్లు రెస్ట్ ఇస్తారా? ఒకవేళ రెస్ట్ కావాలనుకుంటే, వాళ్లకి ఇచ్చే పారితోషికం కూడా కట్ చేయాలి. అప్పుడే అందరూ అన్నీ మ్యాచులు ఆడాలని అనుకుంటారు...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్...