విరాట్ కోహ్లీ తీసుకున్నాడుగా, నేను తీసుకుంటే తప్పా... వృద్ధిమాన్ సాహా కామెంట్స్...
ఎమ్మెస్ ధోనీ, ఆ తర్వాత రిషబ్ పంత్‌ల కారణంగా ఎక్కువ అవకాశాలు దక్కించుకోలేకపోయాడు సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా. సాహా రంజీ ట్రోఫీలో పాల్గొనడానికి ఆసక్తి చూపించకపోవడంతో రిటైర్మెంట్ ఇవ్వబోతున్నాడని ప్రచారం జరిగింది...

37 ఏళ్ల వృద్ధిమాన్ సాహా, ఐపీఎల్ మెగా వేలంలో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. గత మూడు సీజన్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఆడిన సాహా వన్ ఆఫ్ ది బెస్ట్ వికెట్ కీపర్లలో ఒకడు...
మెల్‌బోర్న్ టెస్టులో ఫెయిలైన తర్వాత వృద్ధిమాన్ సాహా ఎక్కువగా రిజర్వు బెంచ్‌కే పరిమితమయ్యాడు. రిషబ్ పంత్‌కి విశ్రాంతి ఇవ్వడంతో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో సాహాకి అవకాశం దక్కింది...
తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న వృద్ధిమాన్ సాహా, రంజీ ట్రోఫీ 2022 సీజన్‌కి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాడు...
ఇంగ్లాండ్ టూర్‌లో, ఇంగ్లాండ్‌తో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో అవకాశం దక్కించుకోలేక, రిజర్వు ప్లేయర్‌గానే ఆడిన వృద్ధిమాన్ సాహా, రిటైర్మెంట్ తీసుకోబోతున్నట్టు ప్రచారం జరిగింది...
‘ప్రతీ వ్యక్తి కుటుంబంతో గడపడానికి లేదా మరేదైనా వ్యక్తిగత కారణాలతో బ్రేక్ కావాలని కోరుకుంటాడు. విరాట్ కోహ్లీ కూడా ఆస్ట్రేలియా టూర్‌లో పెటర్నిటీ లీవ్ తీసుకున్నాడు కదా...
అలాంటి నేను రంజీ ట్రోఫీలో ఆడకూడదని బ్రేక్ తీసుకుంటే, ఇన్ని అనుమానాలు ఎందుకు వస్తున్నాయి....’ అంటూ చెప్పుకొచ్చాడు వృద్ధిమాన్ సాహా...
‘నేను ఎప్పుడూ టీమ్ ప్రోటోకాల్‌ను ఫాలో అవుతాను. అందుకే డ్రెస్సింగ్ రూమ్‌లో జరిగిన డిస్కర్షన్‌ను బయట చెప్పను. అది మా వ్యక్తిగత విషయం అయినా సరే...
నా విషయాలన్నీ దాదాపు వ్యక్తిగతంగానే ఉంటాయి. సోషల్ మీడియాలో కానీ, జనాలతో పంచుకోవడానికి ఇష్టపడను. ఇంకతుముందు కూడా ఇలాగే జరిగింది...
నేను జట్టుకి ఎంపిక చేయడమనేది సెలక్టర్ల చేతుల్లో ఉంది. శ్రీలంక టెస్టులో నా పేరు ఉంటుందా? లేదా? అనేది కూడా వారి నిర్ణయమే... కాన్పూర్ టెస్టుకి ముందు నా పని అయిపోయిందని అనుకున్నారంతా...
2018లో సర్జరీ తర్వాత నేను సెకండ్ వికెట్ కీపర్‌గానే ఉంటూ వస్తున్నా. రిషబ్ పంత్‌కి అవకాశాలు ఇవ్వబోతున్నట్టు నాకు ముందుగానే చెప్పారు...’ అంటూ చెప్పుకొచ్చాడు వృద్ధిమాన్ సాహా...