- Home
- Sports
- Cricket
- ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం: స్మృతి మంధానకి రికార్డు ధర... ముంబై ఇండియన్స్‌కి హర్మన్‌ప్రీత్...
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం: స్మృతి మంధానకి రికార్డు ధర... ముంబై ఇండియన్స్‌కి హర్మన్‌ప్రీత్...
మహిళా క్రికెట్ చరిత్రలో కొత్త శకం మొదలైంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ఘనంగా ప్రారంభమైంది. డబ్ల్యూపీఎల్ మొదటి సీజన్ వేలానికి మల్లికా సాగర్ యాక్షనర్‌గా వ్యవహరించింది...ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం 2023లో మొట్టమొదట వేలానికి వచ్చిన ప్లేయర్‌గా స్మృతి మంధాన రికార్డు క్రియేట్ చేసింది.

Smriti Mandhana-Harmanpreet Kaur
స్మృతి మంధాన పేరు వినగానే ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు హోరాహోరీగా పోటీపడ్డాయి. కేవలం కొన్ని క్షణాల్లోనే రూ.50 లక్షల నుంచి రూ.3 కోట్లకు చేరుకుంది స్మృతి మంధాన..
Image credit: PTI
రూ.3 కోట్ల 40 లక్షలకు టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధానని కొనుగోలు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. స్మృతి మంధాన తర్వాత వేలానికి వచ్చిన టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ని కొనుగోలు చేయడానికి ఆర్‌సీబీతో పాటు ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, యూపీ వారియర్స్ జట్లు పోటీపడ్డాయి...
Image credit: PTI
హర్మన్‌ప్రీత్ కౌర్‌ని రూ.1 కోటి 80 లక్షలకు కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్ జట్టు. సోఫీ డివైన్‌ని కొనుగోలు చేయడానికి పెద్దగా పోటీ జరగలేదు. బేస్ ప్రైజ్ రూ.50 లక్షలకు సోఫీ డివైన్‌ని దక్కించుకుంది ఆర్‌సీబీ...
Ash Gardner
హేలీ మాథ్యూస్‌ని కొనుగోలు చేయడానికి ఏ జట్టూ ఆసక్తి చూపించలేదు. ఆస్ట్రేలియా ప్లేయర్ యాష్లీ గార్డనర్‌ని కొనుగోలు చేయడానికి యూపీ వారియర్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ జట్లు పోటీపడ్డాయి. గుజరాత్ జెయింట్స్ రూ.3 కోట్ల 20 లక్షలకు యాష్లీ గార్డనర్‌ని కొనుగోలు చేసింది..
ఆసీస్ స్టార్ ఎలీసా పెర్రీని కొనుగోలు చేయడానికి ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు పోటీపడ్డాయి. రూ.1 కోటి 70 లక్షలకు ఆర్‌సీబీ జట్టు, పెర్రీని దక్కించుకుంది.
ఇంగ్లాండ్ ప్లేయర్ సోఫీ ఎక్లెస్టోన్‌ని కొనుగోలు చేయడానికి ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు పోటీపడ్డాయి. యూపీ వారియర్స్ రూ.1 కోటి 80 లక్షలకు సోఫీ ఎక్లెస్టోన్‌కి దక్కించుకుంది.