WPL 2025: రిచా ఘోష్ విధ్వంస.. ఆర్సీబీ దెబ్బకు గుజరాత్ దిమ్మదిరిగిపోయింది !
WPL 2025: మహిళా ప్రీమియర్ లీగ్ (WPL) 2025 ఆరంభం అదిరిపోయింది. రిచా ఘోష్ విధ్వంసంతో భారీ స్కోర్ ను అందుకుని గుజరాత్ ను దిమ్మదిరిగిపోయే దెబ్బకొట్టింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.

WPL 2025
Royal Challengers Bengaluru vs Gujarat Giants: మహిళా ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2025 అదరిపోయింది. తొలి మ్యాచ్ లోనే పరుగుల వరద పారించారు. నువ్వానేనా అనే విధంగా ఇరు జట్లు పోటీపడి పరుగుల వర్షం కురిపించాయి. మూడో సీజన్‌లో స్మృతి మంధాన నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తమ తొలి WPL 2025 మ్యాచ్ లో గుజరాత్ జెయింట్స్ తో తలపడింది. గుజరాత్ గెలుస్తుందనిపించేలా సాగిన మ్యాచ్.. చివరకు రిచా ఘోష్ విధ్వంసంతో మరో ఓవర్ మిగిలి వుండగానే ఆర్సీబీ విజయం సాధించింది.
wpl , wpl 2025, cricket,
తొలి మ్యాచ్ లోనే పరుగుల వర్షం
మహిళా ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) మూడో సీజన్ శుక్రవారం ప్రారంభమైంది. WPL 2025 తొలి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-గుజరాత్ జెయింట్స్ తలపడ్డాయి. టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ జెయింట్స్ ప్లేయర్లు సూపర్ బ్యాటింగ్ తో దంచి కొట్టారు. దీంతో 20 ఓవర్లలో 201 పరుగులు చేసింది. అయితే, భారీ స్కోర్ ను మరో ఓవర్ మిగిలి ఉండగానే 4 వికెట్లు కోల్పోయి 202 పరుగులతో టార్గెట్ ను అందుకుంది.
WPL 2025, WPL , Women's Premier League,
ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ జెయింట్స్ ఆరంభం నుంచి అదరిపోయే బ్యాటింగ్ తో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించింది. దీంతో 20 ఓవర్లలో కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 201 పరుగులు చేసింది. వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ బెత్ మూనీ క్లాసిక్ ఇన్నింగ్స్ తో అదరగొట్టింది. 42 బంతుల్లో 56 పరుగుల తన ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు కొట్టారు. కెప్టెన్ ఆష్లీ గార్డనర్ సునామీ బ్యాటింగ్ తో 79 పరుగుల ఇన్నింగ్స్ ఆడారు. తన 79 పరుగుల ఇన్నింగ్స్ లో 3 ఫోర్లు, 8 సిక్సర్లతో దంచి కొట్టారు.
స్మృతి మంధాన నాయకత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ఛేజింగ్ ఆరంభంలోనే షాక్ తగిలింది. మంచి టచ్ లో ఉన్న కెప్టెన్ మంధాన (9 పరుగులు) రెండో ఓవర్ లోనే తన వికెట్ ను కోల్పోయింది. అదే ఓవర్ లో డానీ కూడా ఔట్ అయ్యారు. దీంతో 14 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది ఆర్సీబీ. కానీ, ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు రాణించడంతో ఛేజింగ్ లో ముందుకు సాగింది.
ఎల్లీస్ పెర్రీ ధనాధన్ బ్యాటింగ్ తో 34 బంతుల్లో 57 పరుగుల ఇన్నింగ్స్ ఆడారు. రాఘవీ బిస్ట్ 25 పరుగుల ఇన్నింగ్స్ ను ఆడారు. రిచాఘోష్ సునామీ బ్యాటింగ్ తో అదరగొడుతూ చివరి వరకు క్రీజులో ఉండి ఆర్సీబీకి విజయాన్ని అందించారు. రిచా తన 64 పరుగుల ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు, 4 సిక్సర్లు కొట్టారు. రిచాకు తోడుగా కనికా అహుజా 30 పరుగులతో అజేయంగా నిలిచారు. ఈ మ్యాచ్ లో మొత్తంగా ఇరు జట్లు ఏకంగా స్కోర్ బోర్డును 400 పరుగుల మార్కును దాటించాయి.