MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • మహిళా ప్రీమియర్ లీగ్: 6 6 6 6.. దంచి కొట్టిన ఆష్లీ గార్డనర్

మహిళా ప్రీమియర్ లీగ్: 6 6 6 6.. దంచి కొట్టిన ఆష్లీ గార్డనర్

WPL 2025: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహిళా ప్రీమియర్ లీగ్ (WPL) 2025 ఎడిషన్ ఫిబ్రవరి 14న ఘనంగా ప్రారంభం అయింది. తొలి మ్యాచ్ లో ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఆష్లీ గార్డనర్ దంచికొట్ట‌డంతో గుజ‌రాత్ జెయింట్స్  201 ప‌రుగులు చేసింది.  

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 14 2025, 10:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Ashleigh Gardner

Ashleigh Gardner

Royal Challengers Bengaluru vs Gujarat Giants: మ‌హిళా ప్రీమియర్ లీగ్ (డ‌బ్ల్యూపీఎల్) 2025 ఘ‌నంగా ప్రారంభం అయింది. 2023లో జరిగిన తొలి ఎడిషన్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి విజేతగా నిలిచింది. ఆ తర్వాతి సీజన్‌లో స్మృతి మంధాన నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తమ తొలి WPL టైటిల్‌ను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. రెండు సార్లు ఫైన‌ల్ కు చేరిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ నిరాశే ఎదురైంది. ఇప్పుడు మ‌హిళా ప్రీమియ‌ర్ లీగ్ (డ‌బ్ల్యూపీఎల్) మూడో సీజ‌న్ మొద‌లైంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
wpl , wpl 2025, cricket,

wpl , wpl 2025, cricket,

WPL 2025 ఓపెనర్ మ్యాచ్ లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు-గుజ‌రాత్ జెయింట్స్ టీమ్స్ త‌లప‌డ్డాయి. టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ కు దిగిన గుజ‌రాత్ జెయింట్స్ ప్లేయ‌ర్లు సూప‌ర్ బ్యాటింగ్ తో దంచి కొట్టారు. దీంతో 20 ఓవ‌ర్ల‌లో 201 ప‌రుగులు చేసింది. 

గుజ‌రాత్ టైటాన్స్ దెబ్బ‌కు వ‌ణికిపోయిన ఆర్సీబీ బౌల‌ర్లు 

ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ కు దిగిన గుజ‌రాత్ జెయింట్స్ ఆరంభం నుంచి అద‌రిపోయే బ్యాటింగ్ తో ఫోర్లు, సిక్స‌ర్ల వ‌ర్షం కురిపించింది. దీంతో 20 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 5 వికెట్లు మాత్ర‌మే కోల్పోయి 201 ప‌రుగులు చేసింది. తొలి మ్యాచ్ లో ప‌రుగుల వ‌ర్షం కురిపిస్తూ స్టేడియాన్ని హోరెత్తించింది గుజ‌రాత్ జెయింట్స్. 

35
wpl , wpl 2025, cricket,

wpl , wpl 2025, cricket,

ఆష్లీ గార్డనర్ సునామీ ఇన్నింగ్స్.. వరుసగా సిక్సర్ల మోత

గుజరాత్ జెయింట్స్ కెప్టెన్ ఆష్లీ గార్డనర్ సునామీ ఇన్నింగ్స్ తో దంచికొట్టారు. వరుసగా ఫోర్లు, సిక్సర్లు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. మరీ ముఖ్యంగా ఆష్లీ గార్డనర్  అద్భుతమైన సిక్సర్లతో స్టేడియం హోరెత్తింది. ఆష్లీ గార్డనర్ కేవలం 39 బంతుల్లోనే 79 పరుగులతో చివరి వరకు నాటౌట్ గా ఉన్నారు. 

తన 79 పరుగుల ఇన్నింగ్స్ తో 3 ఫోర్లు, 8 సిక్సర్లతో దంచి కొట్టారు. తన ఇన్నింగ్స్ కారణంగా  గుజరాత్ జెయింట్స్ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ముందు భారీ టార్గెట్ ను ఉంచింది. స్మృతి మంధాన నాయ‌క‌త్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ఛేజింగ్ ఆరంభంలోనే షాక్ త‌గిలింది. మంచి ట‌చ్ లో ఉన్న కెప్టెన్ మంధాన (9 ప‌రుగులు) రెండో ఓవ‌ర్ లోనే త‌న వికెట్ ను కోల్పోయింది. అదే ఓవ‌ర్ లో డానీ కూడా ఔట్ అయ్యారు. దీంతో 14 ప‌రుగులకే 2 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది ఆర్సీబీ. 

45
wpl , wpl 2025, cricket,

wpl , wpl 2025, cricket,

గుజ‌రాత్ బ్యాట‌ర్ల ముందు ఆర్సీబీ బౌలింగ్ తేలిపోయింది. గుజ‌రాత్ బ్యాట‌ర్ల‌ను ప‌రుగులు చేయ‌కుండా అడ్డుకోవ‌డంతో విజ‌యం సాధించ‌లేక‌పోయారు. దీంతో భారీగా ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నారు. 

వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ బెత్ మూనీ క్లాసిక్ ఇన్నింగ్స్ తో అదరగొట్టింది. 42 బంతుల్లో 56 పరుగుల తన ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు కొట్టారు. లారా వోల్వార్డ్ట్ 6, దయాళన్ హేమలత 4, సిమ్రాన్ షేక్ 11 పరుగులతో నిరాశపరిచారు. కానీ, కెప్టెన్ ఆష్లీ గార్డనర్ సునామీ బ్యాటింగ్ తో 79 పరుగుల ఇన్నింగ్స్ ఆడారు. 

55
wpl , wpl 2025, cricket,

wpl , wpl 2025, cricket,

ఆష్లీ గార్డనర్ సునామీ ఇన్నింగ్స్.. వరుసగా సిక్సర్ల మోత

గుజరాత్ జెయింట్స్ కెప్టెన్ ఆష్లీ గార్డనర్ సునామీ ఇన్నింగ్స్ తో దంచికొట్టారు. వరుసగా ఫోర్లు, సిక్సర్లు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. మరీ ముఖ్యంగా ఆష్లీ గార్డనర్  అద్భుతమైన సిక్సర్లతో స్టేడియం హోరెత్తింది. ఆష్లీ గార్డనర్ కేవలం 39 బంతుల్లోనే 79 పరుగులతో చివరి వరకు నాటౌట్ గా ఉన్నారు. 

తన 79 పరుగుల ఇన్నింగ్స్ తో 3 ఫోర్లు, 8 సిక్సర్లతో దంచి కొట్టారు. తన ఇన్నింగ్స్ కారణంగా  గుజరాత్ జెయింట్స్ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ముందు భారీ టార్గెట్ ను ఉంచింది. 

స్మృతి మంధాన నాయ‌క‌త్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ఛేజింగ్ ఆరంభంలోనే షాక్ త‌గిలింది. మంచి ట‌చ్ లో ఉన్న కెప్టెన్ మంధాన (9 ప‌రుగులు) రెండో ఓవ‌ర్ లోనే త‌న వికెట్ ను కోల్పోయింది. అదే ఓవ‌ర్ లో డానీ కూడా ఔట్ అయ్యారు. దీంతో 14 ప‌రుగులకే 2 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది ఆర్సీబీ. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs AFG Test Match : టీమిండియా దెబ్బకు అప్ఘాన్ ఆగమాగం.. గిల్ సేన గెలుపు వెనకున్న టాప్ 5 రీజన్స్ ఇవే
Recommended image2
SKY: ముంబై ఇండియన్స్‌కు సూర్యకుమార్ యాదవ్ గుడ్ బై? సోషల్ మీడియాలో పోస్టులన్నీ డిలీట్.. ఏం జరుగుతోంది?
Recommended image3
IND vs AFG: పంత్ కొట్టిన దెబ్బకు డ్రోన్ క్రాష్.. మ్యాచ్ స్టాప్? అసలు ఏం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved