WPL 2024 auction: డబ్ల్యూపీఎల్ లో అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్ గా కష్వీ గౌతమ్ రికార్డు
WPL 2024 auction: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 వేలం పాటలో కష్వీ గౌతమ్‌ను గుజరాత్ జెయింట్స్ రూ. 2 కోట్లకు కొనుగోలు చేసిన తర్వాత అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్‌గా ఆమె రికార్డు సృష్టించారు.
Kashvee Gautam, WPL 2023, WPL
Women's Premier League 2024 auction: మహిళల క్రికెట్ ప్రీమియర్ లీగ్ రెండో మినీ వేలం ప్రారంభమైంది. ముంబయిలో జరుగుతున్న వేలం పాటలో పలువురు భారత ప్లేయర్లను ప్రాంఛైజీలు భారీ ధరతో దక్కించుకున్నాయి.
WPL 2024, Kashvee Gautam
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 వేలం పాటలో కష్వీ గౌతమ్‌ను గుజరాత్ జెయింట్స్ రూ. 2 కోట్లకు కొనుగోలు చేసిన తర్వాత అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్‌గా ఆమె రికార్డు సృష్టించారు.
Kashvee Gautam
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో కష్వీ గౌతమ్ కు భారీ బిడ్డింగ్ వచ్చింది. ఈ ప్లేయర్ ను గుజరాత్ జెయింట్స్ ఏకంగా రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది. కష్వీ గౌతమ్ బేస్ ప్రైస్ రూ.10 లక్షలు మాత్రమే. అంటే బేస్ ప్రైస్ కంటే 20 రెట్లు ఎక్కువ ధరను చెల్లించి గుజరాత్ జెయింట్స్ దక్కించుకుంది.
Kashvee Gautam
డిసెంబర్ 10 నుంచి ప్రారంభం కానున్న అండర్-23 టోర్నమెంట్ చండీగఢ్ కు చెందిన ఈ ప్లేయర్ కెప్టెన్ గా ఎంపికయ్యారు. ఆ జట్టు తొలి మ్యాచ్ బీహార్‌తో ఆడనుంది. ఆ తర్వాత డిసెంబరు 11న ఢిల్లీతో ఆడనుంది. డిసెంబర్ 13న గుజరాత్ నుంచి, డిసెంబర్ 15న ఉత్తరాఖండ్ తో మ్యాచ్ జరగనుంది.
WPL 2024, Kashvee Gautam,
పదునైన ఫాస్ట్ బౌలింగ్ కు కష్వీ గౌతమ్ పెట్టింది పేరు. సీనియర్ మహిళల ఇంటర్ జోనల్ టీ20 ట్రోఫీలో హ్యాట్రిక్ సాధించిన ప్లేయర్. ఐదు వికెట్లు పడగొట్టి నార్త్ జోన్ జట్టును నార్త్ ఈస్ట్ జోన్ పై 111 పరుగుల తేడాతో గెలిపించారు. ఆ తర్వాత భారత్-ఎ జట్టులో చోటు దక్కించుకున్నారు.
WPL 2024, Kashvee Gautam,
ఒక ఇన్నింగ్స్ లో మొత్తం 10 వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించింది. 2020లో కష్వీ మరో అద్భుతం చేసింది. ఆంధ్రప్రదేశ్ లోని కేఎస్ ఆర్ ఎం కళాశాల మైదానంలో జరిగిన మహిళల అండర్ -19 వన్డే కప్ ట్రోఫీలో అరుణాచల్ ప్రదేశ్ పై ఇన్నింగ్స్ లో మొత్తం 10 వికెట్లు పడగొట్టింది. దీంతో పరిమిత ఓవర్ల క్రికెట్లో మొత్తం 10 వికెట్లు తీసిన తొలి బౌలర్ గా రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్ లో కష్వి గౌతమ్ కేవలం 12 పరుగులిచ్చి 10 వికెట్లు తీయడం గమనార్హం.